< اعداد 1 >

و در روز اول ماه دوم از سال دوم از بیرون آمدن ایشان از زمین مصر، خداوند دربیابان سینا در خیمه اجتماع موسی را خطاب کرده، گفت: ۱ 1
యెహోవా సీనాయి అరణ్యంలో ఉన్న సన్నిధి గుడారంలో నుండి మోషేతో మాట్లాడాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన రెండో సంవత్సరం రెండో నెల మొదటి తేదీన జరిగింది. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు.
«حساب تمامی جماعت بنی‌اسرائیل را برحسب قبایل و خاندان آبای ایشان، به شماره اسم های همه ذکوران موافق سرهای ایشان بگیرید. ۲ 2
“ఇశ్రాయేలు ప్రజల జనాభా లెక్కలు వారి వారి వంశాల ప్రకారం, పూర్వీకుల కుటుంబాల ప్రకారం రాయించు. వారి పేర్లు రాయించు.
از بیست ساله و زیاده، هر‌که از اسرائیل به جنگ بیرون می‌رود، تو وهارون ایشان را برحسب افواج ایشان بشمارید. ۳ 3
ఇశ్రాయేలు రాజ్యం కోసం సైనికులుగా యుద్ధానికి వెళ్ళగలిగిన వారు, ఇరవై ఇంకా ఆ పై వయసున్న పురుషులందరినీ లెక్కపెట్టు. ఒక్కో దళంలో ఎంతమంది పురుషులున్నారో నువ్వూ, అహరోనూ కలసి నమోదు చేయాలి.
و همراه شما یک نفر از هر سبط باشد که هر یک رئیس خاندان آبایش باشد. ۴ 4
మీతో కలసి సేవ చేయడానికి ఒక్కో గోత్రం నుండి ఒక వ్యక్తి గోత్ర నాయకుడిగా ఉండాలి. అతడు తన తెగలో ప్రముఖుడై ఉండాలి.
و اسم های کسانی که با شما باید بایستند، این است: از روبین، الیصوربن شدیئور. ۵ 5
మీతో కలసి పోరాటాల్లో పాల్గొనే నాయకులు వీరు. రూబేను గోత్రం నుండి షెదేయూరు కొడుకు ఏలీసూరు,
و از شمعون، شلومیئیل بن صوریشدای. ۶ 6
షిమ్యోను గోత్రం నుండి సూరీషద్దాయి కొడుకు షెలుమీయేలు,
و از یهودا، نحشون بن عمیناداب. ۷ 7
యూదా గోత్రం నుండి అమ్మీనాదాబు కొడుకు నయస్సోను,
و از یساکار، نتنائیل بن صوغر. ۸ 8
ఇశ్శాఖారు గోత్రం నుండి సూయారు కొడుకు నెతనేలు
و از زبولون، الیاب بن حیلون. ۹ 9
జెబూలూను గోత్రం నుండి హేలోను కొడుకు ఏలీయాబు.
و از بنی یوسف: از افرایم، الیشمع بن عمیهود. و از منسی، جملیئیل بن فدهصور. ۱۰ 10
౧౦యోసేపు సంతానమైన ఎఫ్రాయిము గోత్రం నుండి అమీహూదు కొడుకు ఎలీషామాయు, మనష్షే గోత్రం నుండి పెదాసూరు కొడుకు గమలీయేలు,
از بنیامین، ابیدان بن جدعونی. ۱۱ 11
౧౧బెన్యామీను గోత్రం నుండి గిద్యోనీ కొడుకు అబీదాను,
و از دان، اخیعزر بن عمیشدای. ۱۲ 12
౧౨దాను గోత్రం నుండి అమీషద్దాయి కొడుకు అహీయెజెరు,
و از اشیر، فجعیئیل بن عکران. ۱۳ 13
౧౩ఆషేరు గోత్రం నుండి ఒక్రాను కొడుకు పగీయేలు,
و از جاد، الیاساف بن دعوئیل. ۱۴ 14
౧౪గాదు గోత్రం నుండి దెయూవేలు కొడుకు ఎలాసాపు
و از نفتالی، اخیرع بن عینان.» ۱۵ 15
౧౫నఫ్తాలి గోత్రం నుండి ఏనాను కొడుకు అహీర.”
اینانند دعوت‌شدگان جماعت و سروران اسباط آبای ایشان، و روسای هزاره های اسرائیل. ۱۶ 16
౧౬వీళ్ళంతా ప్రజల్లోనుండి నియమితులయ్యారు. వీరు తమ పూర్వీకుల గోత్రాలకు నాయకులుగానూ, ఇశ్రాయేలు ప్రజల తెగలకు పెద్దలుగానూ ఉన్నారు.
و موسی و هارون این کسان را که به نام، معین شدند، گرفتند. ۱۷ 17
౧౭ఈ పేర్లతో ఉన్న వ్యక్తులను మోషే అహరోనులు పిలిచారు.
و در روز اول ماه دوم، تمامی جماعت را جمع کرده، نسب نامه های ایشان را برحسب قبایل و خاندان آبای ایشان، به شماره اسم‌ها از بیست ساله و بالاتر موافق سرهای ایشان خواندند. ۱۸ 18
౧౮వీళ్ళతో పాటు ఇశ్రాయేలు ప్రజల్లో పురుషులందరినీ రెండో నెల మొదటి రోజున సమావేశపర్చారు. ఇరవై ఏళ్ళూ ఆ పై వయసున్న వారు తమ తమ వంశాలనూ, పూర్వీకుల కుటుంబాలనూ తమ తెగల పెద్దల పేర్లనూ తెలియజేసారు.
چنانکه خداوندموسی را امر فرموده بود، ایشان را در بیابان سینابشمرد. ۱۹ 19
౧౯అప్పుడు యెహోవా తనకాజ్ఞాపించినట్టుగా సీనాయి అరణ్యంలో మోషే వారి సంఖ్య నమోదు చేశాడు.
و اما انساب بنی روبین نخست زاده اسرائیل، برحسب قبایل و خاندان آبای ایشان، موافق نامها و سرهای ایشان این بود: هر ذکور ازبیست ساله و بالاتر، جمیع کسانی که برای جنگ بیرون می‌رفتند. ۲۰ 20
౨౦ఇశ్రాయేలు మొదటి కొడుకు రూబేను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
شمرده شدگان ایشان از سبطروبین، چهل و شش هزار و پانصد نفر بودند. ۲۱ 21
౨౧అలా రూబేను గోత్రం నుండి 46, 500 మందిని లెక్కించారు.
و انساب بنی شمعون برحسب قبایل وخاندان آبای ایشان، کسانی که از ایشان شمرده شدند، موافق شماره اسم‌ها و سرهای ایشان این بود: هر ذکور از بیست ساله و بالاتر، هر‌که برای جنگ بیرون می‌رفت. ۲۲ 22
౨౨షిమ్యోను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
شمرده شدگان ایشان ازسبط شمعون، پنجاه و نه هزار و سیصد نفر بودند. ۲۳ 23
౨౩అలా షిమ్యోను గోత్రం నుండి 59, 300 మందిని లెక్కించారు.
و انساب بنی جاد برحسب قبایل و خاندان آبای ایشان، موافق شماره اسم‌ها، از بیست ساله وبالاتر، هر‌که برای جنگ بیرون می‌رفت. ۲۴ 24
౨౪గాదు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
شمرده شدگان ایشان از سبط جاد، چهل و پنج هزار و ششصد و پنجاه نفر بودند. ۲۵ 25
౨౫అలా గాదు గోత్రం నుండి 45, 650 మందిని లెక్కించారు.
و انساب بنی یهودا برحسب قبایل وخاندان آبای ایشان، موافق شماره اسم‌ها ازبیست ساله و بالاتر، هر‌که برای جنگ بیرون می‌رفت. ۲۶ 26
౨౬యూదా సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
شمرده شدگان ایشان از سبط یهودا، هفتاد و چهار هزار و شش صد نفر بودند. ۲۷ 27
౨౭అలా యూదా గోత్రం నుండి 74, 600 మందిని లెక్కించారు.
و انساب بنی یساکار برحسب قبایل وخاندان آبای ایشان، موافق شماره اسم‌ها ازبیست ساله و بالاتر، هر‌که برای جنگ بیرون می‌رفت. ۲۸ 28
౨౮ఇశ్శాఖారు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
شمرده شدگان ایشان از سبط یساکار، پنجاه و چهار هزار و چهارصد نفر بودند. ۲۹ 29
౨౯అలా ఇశ్శాఖారు గోత్రం నుండి 54, 400 మందిని లెక్కించారు.
و انساب بنی زبولون برحسب قبایل وخاندان آبای ایشان، موافق شماره اسم‌ها ازبیست ساله و بالاتر، هر‌که برای جنگ بیرون می‌رفت. ۳۰ 30
౩౦జెబూలూను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
شمرده شدگان ایشان از سبط زبولون پنجاه و هفت هزار و چهارصد نفر بودند. ۳۱ 31
౩౧అలా జెబూలూను గోత్రం నుండి 57, 400 మందిని లెక్కించారు.
و انساب بنی یوسف از بنی افرایم برحسب قبایل و خاندان آبای ایشان، موافق شماره اسم هااز بیست ساله و بالاتر، هر‌که برای جنگ بیرون می‌رفت. ۳۲ 32
౩౨యోసేపు కొడుకుల్లో ఒకడైన ఎఫ్రాయిము సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
شمرده شدگان ایشان از سبط افرایم، چهل هزار و پانصد نفر بودند. ۳۳ 33
౩౩అలా ఎఫ్రాయిము గోత్రం నుండి 40, 500 మందిని లెక్కించారు.
و انساب بنی منسی برحسب قبایل وخاندان آبای ایشان، موافق شماره اسم‌ها، ازبیست ساله و بالاتر، هر‌که برای جنگ بیرون می‌رفت. ۳۴ 34
౩౪మనష్షే సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
شمرده شدگان ایشان از سبط منسی، سی و دو هزار و دویست نفر بودند. ۳۵ 35
౩౫అలా మనష్షే గోత్రం నుండి 32, 200 మందిని లెక్కించారు.
و انساب بنی بنیامین برحسب قبایل وخاندان آبای ایشان، موافق شماره اسم‌ها، ازبیست ساله بالاتر، هر‌که برای جنگ بیرون می‌رفت. ۳۶ 36
౩౬బెన్యామీను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
شمرده شدگان ایشان از سبط بنیامین، سی و پنج هزار و چهارصد نفر بودند. ۳۷ 37
౩౭అలా బెన్యామీను గోత్రం నుండి 35, 400 మందిని లెక్కించారు.
و انساب بنی دان برحسب قبایل و خاندان آبای ایشان، موافق شماره اسم‌ها از بیست ساله وبالاتر، هر‌که برای جنگ می‌رفت. ۳۸ 38
౩౮దాను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
شمرده شدگان ایشان از سبط دان، شصت و دو هزار و هفتصد نفر بودند. ۳۹ 39
౩౯అలా దాను గోత్రం నుండి 62, 700 మందిని లెక్కించారు.
و انساب بنی اشیر برحسب قبایل و خاندان آبای ایشان، موافق شماره اسم‌ها از بیست ساله وبالاتر، هر‌که برای جنگ بیرون می‌رفت. ۴۰ 40
౪౦ఆషేరు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
شمرده شدگان ایشان از سبط اشیر، چهل ویک هزار و پانصد نفر بودند. ۴۱ 41
౪౧అలా ఆషేరు గోత్రం నుండి 41, 500 మందిని లెక్కించారు.
و انساب بنی نفتالی برحسب قبایل وخاندان آبای ایشان، موافق شماره اسم‌ها ازبیست ساله و بالاتر، هر‌که برای جنگ بیرون می‌رفت. ۴۲ 42
౪౨నఫ్తాలి సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
شمرده شدگان ایشان از سبط نفتالی، پنجاه و سه هزار و پانصد نفر بودند. ۴۳ 43
౪౩అలా నఫ్తాలి గోత్రం నుండి 53, 400 మందిని లెక్కించారు.
اینانند شمرده شدگانی که موسی و هارون با دوازده نفر از سروران اسرائیل، که یک نفر برای هر خاندان آبای ایشان بود، شمردند. ۴۴ 44
౪౪ఇశ్రాయేలులోని పన్నెండు గోత్రాలకు నాయకత్వం వహించిన వారితో పాటు వీరందర్నీ మోషే అహరోనులు లెక్కించారు.
و تمامی شمرده شدگان بنی‌اسرائیل برحسب خاندان آبای ایشان، از بیست ساله و بالاتر، هر کس از اسرائیل که برای جنگ بیرون می‌رفت. ۴۵ 45
౪౫ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజల్లో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధాలకు వెళ్ళగలిగే వారిందర్నీ వారి వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్కించారు.
همه شمرده شدگان، ششصد و سه هزار و پانصد وپنجاه نفر بودند. ۴۶ 46
౪౬వారింతా కలసి 6,03,550 మంది అయ్యారు.
اما لاویان برحسب سبط آبای ایشان در میان آنها شمرده نشدند. ۴۷ 47
౪౭కాని లేవీ వారసులను వారు లెక్కించలేదు.
زیرا خداوند موسی را خطاب کرده، گفت: ۴۸ 48
౪౮ఎందుకంటే యెహోవా మోషేకి ఇంతకు ముందే ఆజ్ఞాపించాడు.
«اما سبط لاوی را مشمار و حساب ایشان را درمیان بنی‌اسرائیل مگیر. ۴۹ 49
౪౯“లేవీ గోత్రికులను ఇశ్రాయేలు జనసంఖ్యలో చేర్చకూడదు. వారిని నమోదు చేయవద్దు.
لیکن لاویان را برمسکن شهادت و تمامی اسبابش و بر هرچه علاقه به آن دارد بگمار، و ایشان مسکن و تمامی اسبابش را بردارند، و ایشان آن را خدمت نمایندو به اطراف مسکن خیمه زنند. ۵۰ 50
౫౦వాళ్లకు నిబంధన శాసనాల గుడారం బాధ్యతలు అప్పగించు. శాసనాల గుడారం లోని అలంకరణలూ, వస్తువులన్నిటినీ వారు చూసుకోవాలి. లేవీయులే గుడారాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. దానిలో ఉన్న వస్తువులను వారే మోయాలి. దాని చుట్టూ వారు తమ గుడారాలు వేసుకోవాలి.
و چون مسکن روانه شود لاویان آن را پایین بیاورند، و چون مسکن افراشته شود لاویان آن را برپا نمایند، وغریبی که نزدیک آن آید، کشته شود. ۵۱ 51
౫౧గుడారాన్ని మరో స్థలానికి తరలించాల్సి వస్తే లేవీయులే దాన్ని ఊడదీయాలి. తిరిగి గుడారాన్ని నిలపాలన్నా లేవీయులే దాన్ని నిలపాలి. ఎవరన్నా పరాయి వ్యక్తి గుడారాన్ని సమీపిస్తే వాడికి మరణ శిక్ష విధించాలి.
و بنی‌اسرائیل هر کس در محله خود و هر کس نزدعلم خویش برحسب افواج خود، خیمه زنند. ۵۲ 52
౫౨ఇశ్రాయేలు ప్రజలు వారి వారి సైనిక దళానికి చెందిన జెండా ఎక్కడ నాటారో అక్కడే తమ గుడారాలు వేసుకోవాలి.
و لاویان به اطراف مسکن شهادت خیمه زنند، مبادا غضب بر جماعت بنی‌اسرائیل بشود، ولاویان شعائر مسکن شهادت را نگاه دارند.» ۵۳ 53
౫౩నా కోపం ఇశ్రాయేలు ప్రజలపైకి రాకుండా ఉండాలంటే లేవీయులు నిబంధన శాసనాల గుడారం చుట్టూ తమ నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి. నిబంధన శాసనాల గుడారాన్ని వారే జాగ్రత్తగా చూసుకోవాలి.”
پس بنی‌اسرائیل چنین کردند، و برحسب آنچه خداوند موسی را امر فرموده بود، به عمل آوردند. ۵۴ 54
౫౪ఇశ్రాయేలు ప్రజలు ఈ ఆజ్ఞల ప్రకారం అన్నీ చేసారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ ఇశ్రాయేలు ప్రజలు నెరవేర్చారు.

< اعداد 1 >