< پیدایش 18 >

و خداوند در بلوطستان ممری، بروی ظاهر شد، و او در گرمای روز به درخیمه نشسته بود. ۱ 1
మమ్రే అనే ప్రాంతంలో సింధూర చెట్ల దగ్గర ఒక మధ్యాహ్నం వేళ అబ్రాహాము తన గుడారం వాకిట్లో కూర్చుని ఉన్నాడు. అప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు.
ناگاه چشمان خود را بلندکرده، دید که اینک سه مرد در مقابل اوایستاده‌اند. و چون ایشان را دید، از در خیمه به استقبال ایشان شتافت، و رو بر زمین نهاد ۲ 2
అతడు తలెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ముందు నిలబడి ఉన్నారు. అతడు వారిని చూసి తన గుడారం వదిలి వారిని కలుసుకోవడానికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. వారి ఎదుట నేల వరకూ వంగి ఇలా అన్నాడు.
و گفت: «ای مولا، اکنون اگر منظور نظر تو شدم، از نزدبنده خود مگذر، ۳ 3
“ప్రభూ, నీ దాసుడనైన నాపై దయ చూపి నన్ను దాటి వెళ్ళకండి. నాతో రండి.
اندک آبی بیاورند تا پای خودرا شسته، در زیر درخت بیارامید، ۴ 4
నేను నీళ్ళు తెప్పిస్తాను. వాటితో మీ కాళ్ళు కడుక్కోండి. చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి.
و لقمه نانی بیاورم تا دلهای خود را تقویت دهید و پس از آن روانه شوید، زیرا برای همین، شما را بر بنده خودگذر افتاده است.» گفتند: «آنچه گفتی بکن.» ۵ 5
మీ దాసుడినైన నా దగ్గరికి వచ్చారు కదా, కొంచెం ఆహారం తీసుకు వస్తాను. దాన్ని తిని సేద దీర్చుకోండి. ఆ తరువాత మీ దారిన మీరు వెళ్ళవచ్చు.” అందుకు వారు “నువ్వు చెప్పినట్టే చెయ్యి” అన్నారు.
پس ابراهیم به خیمه، نزد ساره شتافت و گفت: «سه کیل از آرد میده بزودی حاضر کن و آن را خمیرکرده، گرده‌ها بساز.» ۶ 6
అప్పుడు అబ్రాహాము వెంటనే గుడారంలో ఉన్న శారా దగ్గరికి వెళ్ళి “నువ్వు త్వరగా 21 కిలోల మెత్తటి పిండి తెచ్చి కలిపి రొట్టెలు చెయ్యి” అన్నాడు.
و ابراهیم به سوی رمه شتافت و گوساله نازک خوب گرفته، به غلام خودداد تا بزودی آن را طبخ نماید. ۷ 7
తరువాత అబ్రాహాము పశువుల మంద దగ్గరికి పరుగెత్తి ఒక మంచి లేగ దూడను పట్టుకు వచ్చి ఒక పనివాడికి ఇచ్చాడు. వాడు త్వరత్వరగా దాన్నివధించి వండి సిద్ధం చేశాడు.
پس کره و شیر وگوساله‌ای را که ساخته بود، گرفته، پیش روی ایشان گذاشت، و خود در مقابل ایشان زیردرخت ایستاد تا خوردند. ۸ 8
తరువాత అతడు పెరుగూ, పాలూ వాటితోపాటు తాను వండించి సిద్ధం చేయించిన దూడ మాంసాన్ని తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. వాళ్ళు భోజనం చేస్తుంటే అక్కడే ఆ చెట్టు కిందే నిలబడ్డాడు.
به وی گفتند: «زوجه ات ساره کجاست؟» گفت: «اینک درخیمه است.» ۹ 9
వారు అతణ్ణి “నీ భార్య ఎక్కడ?” అని అడిగారు. అతడు “అదిగో, గుడారంలో ఉంది” అన్నాడు.
گفت: «البته موافق زمان حیات، نزد تو خواهم برگشت، و زوجه ات ساره را پسری خواهد شد.» و ساره به در خیمه‌ای که در عقب اوبود، شنید. ۱۰ 10
౧౦అప్పుడు ఆయన “తిరిగి వసంతకాలంలో నేను మళ్ళీ నీ దగ్గరికి తప్పకుండా వస్తాను. విను, అప్పటికి నీ భార్య శారాకు ఒక కొడుకు ఉంటాడు” అన్నాడు. శారా ఆయన వెనుక ఉన్న గుడారం ద్వారం దగ్గర ఉండి ఈ మాటలు వింటూ ఉంది.
و ابراهیم و ساره پیر و سالخورده بودند، و عادت زنان از ساره منقطع شده بود. ۱۱ 11
౧౧అప్పటికి అబ్రాహాము శారాలు వయసు ఉడిగిపోయి ముసలివాళ్ళయ్యారు. శారాకు పిల్లలను కనే వయసు దాటిపోయింది.
پس ساره در دل خود بخندید و گفت: «آیا بعداز فرسودگی‌ام مرا شادی خواهد بود، و آقایم نیزپیر شده است؟» ۱۲ 12
౧౨శారా “నా బలమంతా పోయింది. ఈ సుఖం నాకెలా కలుగుతుంది? నా యజమాని అయిన నా భర్త కూడా ముసలివాడయ్యాడు కదా” అనుకుని తనలో తాను నవ్వుకుంది.
و خداوند به ابراهیم گفت: «ساره برای چه خندید؟» و گفت: «آیا فی الحقیقه خواهم زایید و حال آنکه پیر هستم؟» ۱۳ 13
౧౩అప్పుడు యెహోవా అబ్రాహాముతో “శారా ‘ముసలిదాన్ని అయిన నేను నిజంగా బిడ్డను కనగలనా’ అనుకుని ఎందుకు నవ్వింది?
«مگرهیچ امری نزد خداوند مشکل است؟ در وقت موعود، موافق زمان حیات، نزد تو خواهم برگشت و ساره را پسری خواهد شد.» ۱۴ 14
౧౪యెహోవాకు సాధ్యం కానిది ఏమైనా ఉందా? నేను నిర్ణయించిన కాలంలో మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి శారాకు ఒక కొడుకు ఉంటాడు” అన్నాడు.
آنگاه ساره انکار کرده، گفت: «نخندیدم»، چونکه ترسید. گفت: «نی، بلکه خندیدی.» ۱۵ 15
౧౫అప్పుడు శారా భయపడి “నేను నవ్వలేదండీ” అంది. దానికి ఆయన “అలా అనకు, నువ్వు నవ్వావు” అని జవాబిచ్చాడు.
پس، آن مردان از آنجا برخاسته، متوجه سدوم شدند، و ابراهیم ایشان را مشایعت نمود. ۱۶ 16
౧౬అప్పుడు ఆ మనుషులు అక్కడనుండి వెళ్ళడానికి లేచారు. లేచి సొదొమ పట్టణం వైపు చూసారు. వారిని సాగనంపడానికి అబ్రాహాము వారితో కలిసి వెళ్ళాడు.
و خداوند گفت: «آیا آنچه من می‌کنم ازابراهیم مخفی دارم؟ ۱۷ 17
౧౭కానీ యెహోవా ఇలా అనుకున్నాడు. “అబ్రాహాము కచ్చితంగా ఒక బలమైన గొప్ప జాతి అవుతాడు.
و حال آنکه از ابراهیم هرآینه امتی بزرگ و زورآور پدید خواهد آمد، وجمیع امت های جهان از او برکت خواهند یافت. ۱۸ 18
౧౮అతని మూలంగా భూమిపై అన్ని జాతులూ ఆశీర్వాదం పొందుతాయి. నేను చేయబోతున్న పనులను అబ్రాహాముకు తెలియకుండా ఎలా దాచగలను?
زیرا او را می‌شناسم که فرزندان و اهل خانه خود را بعد از خود امر خواهد فرمود تا طریق خداوند را حفظ نمایند، و عدالت و انصاف را بجاآورند، تا خداوند آنچه به ابراهیم گفته است، به وی برساند.» ۱۹ 19
౧౯అతని తరువాత అతని వారసులు నీతి న్యాయాలను జరిగించేలా వారికి యెహోవా మార్గాన్ని బోధించడానికీ తద్వారా అబ్రాహాముకు ఆయన చెప్పిన విషయాలన్నీ జరిగించడానికీ నేను అబ్రాహామును ఎన్నుకున్నాను.”
پس خداوند گفت: «چونکه فریاد سدوم و عموره زیاد شده است، و خطایای ایشان بسیار گران، ۲۰ 20
౨౦అప్పుడు యెహోవా ఇలా అన్నాడు. “సొదొమ గొమొర్రాలను గూర్చిన విన్నపాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అలాగే వాటి పాపం కూడా చాలా ఘోరం. కనుక
اکنون نازل می‌شوم تا ببینم موافق این فریادی که به من رسیده، بالتمام کرده اندوالا خواهم دانست.» ۲۱ 21
౨౧నేను దిగి వెళ్ళి నాకు చేరిన ఆ విన్నపం ప్రకారం వాళ్ళు అంత దుర్మార్గులా కాదా అన్నది చూస్తాను. లేకపోతే నాకు తెలుస్తుంది.”
آنگاه آن مردان از آنجابسوی سدوم متوجه شده، برفتند. و ابراهیم درحضور خداوند هنوز ایستاده بود. ۲۲ 22
౨౨ఆ మనుషులు అక్కడనుండి వెళ్ళడానికి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళారు. కానీ అబ్రాహాము ఇంకా యెహోవా సముఖంలోనే నిలబడి ఉన్నాడు.
و ابراهیم نزدیک آمده، گفت: «آیا عادل را با شریر هلاک خواهی کرد؟ ۲۳ 23
౨౩అప్పడు అబ్రాహాము వారిని సమీపించి ఇలా అడిగాడు. “దుర్మార్గులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా?
شاید در شهر پنجاه عادل باشند، آیا آن را هلاک خواهی کرد و آن مکان را بخاطرآن پنجاه عادل که در آن باشند، نجات نخواهی داد؟ ۲۴ 24
౨౪ఆ పట్టణంలో ఒకవేళ యాభైమంది నీతిమంతులు ఉంటే ఆ యాభైమంది నీతిమంతుల కోసం పట్టణాన్ని నాశనం చేయకుండా రక్షించలేవా?
حاشا از تو که مثل این کار بکنی که عادلان را با شریران هلاک سازی و عادل و شریر مساوی باشند. حاشا از تو آیا داور تمام جهان، انصاف نخواهد کرد؟» ۲۵ 25
౨౫నీతిమంతులకూ దుర్మార్గులకూ ఒకే రకంగా తీర్పు తీర్చడం నీకు దూరమౌతుంది గాక. అలాగే దుర్మార్గులతో పాటుగా నీతిమంతులను నాశనం చేయడం నీకు దూరమౌతుంది గాక! సర్వలోకానికీ తీర్పు తీర్చేవాడు న్యాయం చెయ్యడా?”
خداوند گفت: «اگر پنجاه عادل در شهر سدوم یابم هر آینه تمام آن مکان را به‌خاطر ایشان رهایی دهم.» ۲۶ 26
౨౬దానికి యెహోవా “సొదొమ పట్టణంలో యాభైమంది నీతిమంతులు నాకు కనిపిస్తే వాళ్ళ కోసం ఆ ప్రదేశాన్నంతా కాపాడతాను” అన్నాడు.
ابراهیم در جواب گفت: «اینک من که خاک و خاکستر هستم جرات کردم که به خداوند سخن گویم. ۲۷ 27
౨౭అందుకు అబ్రాహాము “అయ్యా చూడు, నేను దుమ్ముతో, బూడిదతో సమానం. అయినా నేను ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను.
شاید از آن پنجاه عادل پنج کم باشد، آیا تمام شهر را بسبب پنج، هلاک خواهی کرد؟» گفت: «اگر‌چهل و پنج در آنجا یابم، آن را هلاک نکنم.» ۲۸ 28
౨౮యాభై మంది నీతిమంతుల్లో ఒకవేళ ఐదుగురు తక్కువయ్యారనుకోండి. ఐదుగురు తక్కువయ్యారని ఆ పట్టణమంతటినీ నాశనం చేస్తావా?” అని మళ్ళీ అడిగాడు. అందుకాయన “అక్కడ నలభై ఐదుగురు కనిపిస్తే నాశనం చేయను” అన్నాడు.
بار دیگر بدو عرض کرده، گفت: «هر گاه در آنجا چهل یافت شوند؟» گفت: «به‌خاطر چهل آن را نکنم.» ۲۹ 29
౨౯అతడు మళ్ళీ ఆయనతో మాట్లాడుతూ “ఒకవేళ అక్కడ నలభై మందే కనిపిస్తారేమో” అన్నాడు. దానికి ఆయన “ఆ నలభై మంది కోసం నాశనం చేయను” అని చెప్పాడు.
گفت: «زنهار غضب خداوند افروخته نشود تاسخن گویم، شاید در آنجا سی پیدا شوند؟» گفت: «اگر در آنجا سی یابم، این کار را نخواهم کرد.» ۳۰ 30
౩౦అతడు మళ్ళీ “ప్రభూ, నాపై కోప్పడనంటే నేను మాట్లాడతాను. ఒకవేళ ముప్ఫై మందే అక్కడ కనిపిస్తారేమో” అన్నాడు. అప్పుడాయన “ముప్ఫై మంది కనిపించినా నేను పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు.
گفت: «اینک جرات کردم که به خداوندعرض کنم. اگر بیست در آنجا یافت شوند؟» گفت: «به‌خاطر بیست آن را هلاک نکنم.» ۳۱ 31
౩౧అందుకు అతడు “నా ప్రభువుతో మాట్లాడే సాహసం చేస్తున్నాను. ఒకవేళ ఇరవైమందే ఉంటారేమో” అన్నాడు. అప్పుడు ప్రభువు “ఆ ఇరవైమంది కోసం నాశనం చేయను” అన్నాడు.
گفت: «خشم خداوند، افروخته نشود تا این دفعه را فقط عرض کنم، شاید ده در آنجا یافت شوند؟» گفت: «به‌خاطر ده آن را هلاک نخواهم ساخت.» ۳۲ 32
౩౨చివరిగా అతడు “ప్రభూ, నాపై కోపగించకు. నేనింకా ఒక్కసారే మాట్లాడతాను. ఒకవేళ పదిమందే అక్కడ ఉన్నారేమో” అన్నాడు. అప్పుడు ప్రభువు “పదిమంది కోసం నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు.
پس خداوند چون گفتگو را با ابراهیم به اتمام رسانید، برفت و ابراهیم به مکان خویش مراجعت کرد. ۳۳ 33
౩౩అబ్రాహాముతో మాటలు ముగిసిన వెంటనే యెహోవా వెళ్ళిపోయాడు. అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాడు.

< پیدایش 18 >