< اول سموئیل 19 >

و شاول به پسر خود یوناتان و به جمیع خادمان خویش فرمود تا داود رابکشند. ۱ 1
మీరు దావీదును చంపేయాలని సౌలు తన కొడుకు యోనాతానుతో, సేవకులందరితో చెప్పాడు.
اما یوناتان پسر شاول به داود بسیار میل داشت، و یوناتان داود را خبر داده، گفت: «پدرم شاول قصد قتل تو دارد، پس الان تا بامدادان خویشتن را نگاهدار و در جایی مخفی مانده، خود را پنهان کن. ۲ 2
అయితే, సౌలు కొడుకు యోనాతానుకు దావీదు అంటే ఎంతో ఇష్టం. కాబట్టి యోనాతాను, దావీదుతో ఇలా అన్నాడు “నా తండ్రి సౌలు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు ఉదయాన్నే జాగ్రత్తపడి రహస్య స్థలం లో దాక్కో.
و من بیرون آمده، به پهلوی پدرم در صحرایی که تو در آن می‌باشی خواهم ایستاد، و درباره تو با پدرم گفتگو خواهم کرد واگر چیزی ببینم تو را اطلاع خواهم داد.» ۳ 3
నేను నా తండ్రి దగ్గర నిలబడి నిన్ను గూర్చిన సమాచారం ఏదైనా తెలిసినప్పుడు పొలంలోకి వచ్చి నీకు తెలియచేస్తాను” అన్నాడు.
و یوناتان درباره داود نزد پدر خود شاول به نیکویی سخن رانده، وی را گفت: «پادشاه بر بنده خود داود گناه نکند زیرا که او به تو گناه نکرده است بلکه اعمال وی برای تو بسیار نیکو بوده است. ۴ 4
యోనాతాను తన తండ్రి సౌలుతో దావీదును గూర్చి సానుభూతిగా మాట్లాడి “నీ సేవకుడైన దావీదు నీపట్ల ఎలాంటి తప్పూ చేయలేదు, పైగా ఎంతో మేలు చేశాడు. కాబట్టి రాజా, నువ్వు అతనికి ఎలాంటి కీడూ తలపెట్టవద్దు.
و جان خویش را به‌دست خود نهاده، آن فلسطینی را کشت و خداوند نجات عظیمی به جهت تمامی اسرائیل نمود و تو آن را دیده، شادمان شدی؛ پس چرا به خون بی‌تقصیری گناه کرده، داود را بی‌سبب بکشی.» ۵ 5
అతడు తన ప్రాణానికి తెగించి ఆ ఫిలిష్తీయుని చంపినప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులకందరికీ గొప్ప విజయం కలుగజేశాడు. అది నీకు కూడా సంతోషం కలిగించింది కదా, కారణం లేకుండా దావీదును చంపి నిరపరాధి ప్రాణం తీసిన పాపం నీకు ఎందుకు?” అని చెప్పినప్పుడు,
و شاول به سخن یوناتان گوش گرفت، و شاول قسم خورد که به حیات خداوند او کشته نخواهد شد. ۶ 6
సౌలు యోనాతాను చెప్పింది విని “యెహోవా మీద ఒట్టు, అతనికి మరణ శిక్ష విధించను” అని ప్రమాణం చేశాడు.
آنگاه یوناتان داود را خواند و یوناتان او را از همه این سخنان خبر داد و یوناتان داود را نزد شاول آورده، او مثل ایام سابق در حضور وی می‌بود. ۷ 7
అప్పుడు యోనాతాను దావీదును పిలిపించి ఆ విషయాలన్నీ అతనికి తెలియచేశాడు. దావీదును సౌలు దగ్గరికి తీసుకొచ్చినపుడు దావీదు ముందులాగే అతని ఆవరణంలో ఉన్నాడు.
و باز جنگ واقع شده، داود بیرون رفت و بافلسطینیان جنگ کرده، ایشان را به کشتار عظیمی شکست داد و از حضور وی فرار کردند. ۸ 8
తరువాత యుద్ధం జరినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి, చాలామందిని చంపేశాడు.
و روح بد از جانب خداوند بر شاول آمد و او در خانه خود نشسته، مزراق خویش را در دست داشت وداود به‌دست خود می‌نواخت. ۹ 9
యెహోవా దగ్గర నుండి దురాత్మ వచ్చి సౌలును ఆవహించాడు. సౌలు ఈటె పట్టుకుని యింటి ఆవరణంలో కూర్చుని ఉన్నాడు. దావీదు తంతి వాద్యం వాయిస్తుంటే,
و شاول خواست که داود را با مزراق خود تا به دیوار بزند، اما او از حضور شاول بگریخت و مزراق را به دیوار زد و داود فرار کرده، آن شب نجات یافت. ۱۰ 10
౧౦సౌలు ఒకే దెబ్బతో దావీదు గోడకు అతుక్కునేలా తన చేతిలోని ఈటె విసిరాడు. దావీదు పక్కకు తొలగడంతో అది అతని పక్కగా గోడకు గుచ్చుకుంది. దావీదు ఆ రాత్రి తప్పించుకుని పారిపోయాడు.
و شاول قاصدان به خانه داود فرستاد تا آن را نگاهبانی نمایند و در صبح او را بکشند. امامیکال، زن داود، او را خبر داده، گفت: «اگر امشب جان خود را خلاص نکنی، فردا کشته خواهی شد.» ۱۱ 11
౧౧ఉదయాన్నే అతణ్ణి చంపాలని కనిపెడుతూ దావీదును పట్టుకోడానికి సౌలు దావీదు ఇంటికి తన సైనికులను పంపాడు. దావీదు భార్య మీకాలు “ఈ రాత్రి నీ ప్రాణాన్ని నీవు దక్కించుకోకపోతే రేపు నిన్ను చంపేస్తారు” అని చెప్పి
پس میکال داود را از پنجره فرو هشته، اوروانه شد و فرار کرده، نجات یافت. ۱۲ 12
౧౨కిటికీగుండా దావీదును కిందికి దింపితే అతడు తప్పించుకుని పారిపోయాడు.
اما میکال ترافیم را گرفته، آن را در بستر نهاد و بالینی از پشم بز زیر سرش نهاده، آن را با رخت پوشانید. ۱۳ 13
౧౩తరువాత మీకాలు ఒక విగ్రహం తీసుకు మంచంమీద ఉంచి తలవైపు మేక చర్మం ఉంచి దుప్పటితో కప్పివేసింది.
وچون شاول قاصدان فرستاده تا داود را بگیرند، گفت بیمار است. ۱۴ 14
౧౪సౌలు దావీదును పట్టుకోవడానికి సైనికులను పంపినపుడు “అతడు అనారోగ్యంతో మంచాన ఉన్నాడు” అని చెప్పింది.
پس شاول قاصدان را فرستادتا داود را ببینند و گفت: «او را بر بسترش نزد من بیاورید تا او را بکشم.» ۱۵ 15
౧౫దావీదును చూసేందుకు సౌలు సైనికులను పంపి “అతణ్ణి మంచంతోసహా తీసుకురండి. నేను అతణ్ణి చంపుతాను” అన్నాడు.
و چون قاصدان داخل شدند، اینک ترافیم در بستر و بالین پشم بز زیرسرش بود. ۱۶ 16
౧౬ఆ సైనికులు లోపల జొరబడి చూసినప్పుడు తల వైపున మేక చర్మం ఒక మంచంపై ఉన్న విగ్రహం కనబడింది.
و شاول به میکال گفت: «برای چه مرا چنین فریب دادی و دشمنم را رها کردی تانجات یابد.» و میکال شاول را جواب داد که او به من گفت: «مرا رها کن؛ برای چه تو را بکشم؟» ۱۷ 17
౧౭అప్పుడు సౌలు “నా శత్రువు తప్పించుకుపోయేలా చేసి నన్ను ఎందుకు మోసం చేసావు” అని మీకాలును అడిగితే, మీకాలు “నా చేతిలో నీ ప్రాణం ఎందుకు పోగొట్టుకుంటావ్, ‘నన్ను వెళ్లనివ్వు’ అని దావీదు తనతో చెప్పాడు” అని సౌలుతో చెప్పింది.
و داود فرار کرده، رهایی یافت و نزدسموئیل به رامه آمده، از هر‌آنچه شاول با وی کرده بود، او را مخبر ساخت، و او و سموئیل رفته، در نایوت ساکن شدند. ۱۸ 18
౧౮ఆ విధంగా దావీదు తప్పించుకు పారిపోయి రమాలో ఉన్న సమూయేలు దగ్గరికి వచ్చి సౌలు తనపట్ల చేసినదంతా అతనికి తెలియజేశాడు. అతడూ సమూయేలూ బయలుదేరి నాయోతుకు వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు.
پس شاول را خبرداده، گفتند: «اینک داود در نایوت رامه است.» ۱۹ 19
౧౯దావీదు రమా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలుకు సమాచారం వచ్చినప్పుడు,
و شاول قاصدان برای گرفتن داود فرستاد، وچون جماعت انبیا را دیدند که نبوت می‌کنند و سموئیل را که به پیشوایی ایشان ایستاده است، روح خدا بر قاصدان شاول آمده، ایشان نیز نبوت کردند. ۲۰ 20
౨౦దావీదును పట్టుకోవడానికి సౌలు తన సైనికులను పంపించాడు. వీరు అక్కడికి వచ్చినప్పుడు కొందరు ప్రవక్తలు సమకూడి పూనకంలో ప్రకటించడం, సమూయేలు వారికి నాయకుడుగా ఉండడం చూసినప్పుడు దేవుని ఆత్మ సౌలు పంపిన సైనికుల మీదకి వచ్చాడు. వారు కూడా పరవశులై ప్రకటించడం ప్రారంభించారు.
و چون شاول را خبر دادند قاصدان دیگر فرستاده، ایشان نیز نبوت کردند، و شاول بازقاصدان سوم فرستاده، ایشان نیز نبوت کردند. ۲۱ 21
౨౧ఈ విషయం సౌలుకు తెలిసి మరి కొందరు సైనికులును పంపాడు. వారు కూడా ఆ విధంగానే ప్రకటిస్తున్నారు. సౌలు మూడవసారి సైనికులను పంపాడు గాని వారు కూడా అలాగే ప్రకటించడం మొదలుపెట్టారు.
پس خود او نیز به رامه رفت و چون به چاه بزرگ که نزد سیخوه است رسید، سوال کرده، گفت: «سموئیل و داود کجا می‌باشند؟» و کسی گفت: «اینک در نایوت رامه هستند.» ۲۲ 22
౨౨చివరిసారిగా తానే రమాకు వెళ్ళి సెకు దగ్గర ఉన్న బావి దగ్గర నిలబడి “సమూయేలూ దావీదూ ఎక్కడ ఉన్నారు?” అని అడిగాడు. ఒక వ్యక్తి “రమా దగ్గర నాయోతులో ఉన్నారు” అని చెప్పాడు.
و به آنجابه نایوت رامه روانه شد و روح خدا بر او نیز آمد ودر حینی که می‌رفت نبوت می‌کرد تا به نایوت رامه رسید. ۲۳ 23
౨౩అతడు రమా దగ్గర ఉన్న నాయోతుకు వచ్చినపుడు దేవుని ఆత్మ అతని మీదికి దిగాడు. కాబట్టి అతడు ప్రయాణం చేస్తూ రమా దగ్గర ఉన్న నాయోతుకు వచ్చేవరకూ పరవశుడై ప్రకటిస్తూ ఉన్నాడు.
و او نیز جامه خود را کنده، به حضور سموئیل نبوت می‌کرد و تمامی آن روز وتمامی آن شب برهنه افتاد، بنابراین گفتند: «آیاشاول نیز از‌جمله انبیاست؟» ۲۴ 24
౨౪ఇంకా అతడు తన దుస్తులు తీసివేసి ఆ రోజు రాత్రి, పగలు సమూయేలు ఎదుటే ప్రకటిస్తూ, లోదుస్తులతోనే పడి ఉన్నాడు. అప్పటినుండి “సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా?” అనే సామెత పుట్టింది.

< اول سموئیل 19 >