< اول سموئیل 10 >

پس سموئیل ظرف روغن را گرفته، برسر وی ریخت و او را بوسیده، گفت: «آیا این نیست که خداوند تو را مسح کرد تا برمیراث او حاکم شوی؟ ۱ 1
అప్పుడు సమూయేలు నూనె బుడ్డి తీసుకు సౌలు తల మీద నూనె పోసి అతణ్ణి ముద్దు పెట్టుకుని “యెహోవా నిన్ను అభిషేకించి తన సొత్తు అయిన తన ప్రజల మీద నిన్ను రాజుగా నియమించాడు” అని ఇంకా ఇలా చెప్పాడు,
امروز بعد از رفتنت ازنزد من دو مرد، نزد قبر راحیل به‌سرحد بنیامین درصلصح خواهی یافت، و تو را خواهند گفت: الاغهایی که برای جستن آنها رفته بودی، پیداشده است و اینک پدرت فکر الاغها را ترک کرده، به فکر شما افتاده است، و می‌گوید به جهت پسرم چکنم. ۲ 2
“ఈ రోజు నువ్వు నా దగ్గర నుండి వెళ్ళిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులో ఉన్న రాహేలు సమాధి దగ్గర ఇద్దరు వ్యక్తులు నీకు కనిపిస్తారు. వారు ‘నువ్వు వెదకుతున్న గాడిదలు దొరికాయి. మీ నాన్న గాడిదల విషయం మరచిపోయి, నా కొడుకును వెదకడానికి నేనేం చెయ్యాలి, అని నీ కోసం బాధ పడుతున్నాడు’ అని చెబుతారు.
چون از آنجا پیش رفتی و نزد بلوط تابوررسیدی در آنجا سه مرد خواهی یافت که به حضور خدا به بیت ئیل می‌روند که یکی از آنها سه بزغاله دارد، و دیگری سه قرص نان، و سومی یک مشگ شراب. ۳ 3
తరువాత నువ్వు అక్కడి నుండి వెళ్లి తాబోరు మైదానానికి రాగానే అక్కడ బేతేలు నుండి దేవుని దగ్గరకి వెళ్లే ముగ్గురు మనుషులు నీకు ఎదురుపడతారు. వారిలో ఒకడు మూడు మేకపిల్లలను, ఒకడు మూడు రొట్టెలను, మరొకడు ద్రాక్షారసపు తిత్తిని మోసుకుంటూ వస్తారు.
و سلامتی تو را خواهند پرسید ودو نان به تو خواهندداد که از دست ایشان خواهی گرفت. ۴ 4
వారు నీ క్షేమ సమాచారాలు అడిగి నీకు రెండు రొట్టెలు ఇస్తారు. వాటిని వారి నుండి నువ్వు తీసుకోవాలి.
بعد از آن به جبعه خدا که در آنجا قراول فلسطینیان است خواهی آمد، و چون در آنجانزدیک شهر برسی گروهی از انبیا که از مکان بلندبه زیر می‌آیند و در‌پیش ایشان چنگ و دف و نای و بربط بوده، نبوت می‌کنند، به تو خواهندبرخورد. ۵ 5
ఈ విధంగా వెళ్తూ ఫిలిష్తీయుల దండులో నివాసం ఉండే దేవుని కొండకు చేరతావు. అక్కడ ఊరి దగ్గరకి నువ్వు రాగానే, తంతి వాయిద్యాలు, తంబుర, సన్నాయి, సితారా వాయిస్తున్నవారు, వారి వెనుక ఉన్నత స్థలం నుండి దిగి వస్తున్న ప్రవక్తల గుంపు నీకు కనబడుతుంది. వారు ప్రకటన చేస్తూ వస్తారు.
و روح خداوند بر تو مستولی شده، باایشان نبوت خواهی نمود، و به مرد دیگر متبدل خواهی شد. ۶ 6
యెహోవా ఆత్మ నీపైకి బలంగా దిగివస్తాడు. నువ్వు కూడా వారితో కలిసి ప్రకటిస్తూ ఉండగా నీకు నూతన మనస్సు వస్తుంది.
و هنگامی که این علامات به تورونماید، هرچه دستت یابد بکن زیرا خدا باتوست. ۷ 7
దేవుడు నీకు తోడుగా ఉంటాడు కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు ఏది మంచిదనిపిస్తే అది చెయ్యి.
و پیش من به جلجال برو و اینک من برای گذرانیدن قربانی های سوختنی و ذبح نمودن ذبایح سلامتی نزد تو می‌آیم، و هفت روز منتظرباش تا نزد تو بیایم و تو را اعلام نمایم که چه بایدکرد.» ۸ 8
నాకంటే ముందు నీవు గిల్గాలుకు వెళ్ళినప్పుడు, దహన బలులు, సమాధాన బలులు అర్పించడానికి నేను నీ దగ్గరికి దిగి వస్తాను. నేను నీ దగ్గరకి వచ్చి నువ్వు ఏమి చేయాలో చెప్పేవరకూ ఏడు రోజులపాటు నువ్వు అక్కడే ఉండిపోవాలి.”
و چون رو گردانید تا از نزد سموئیل برود، خدا او را قلب دیگر داد. و در آن روز جمیع این علامات واقع شد. ۹ 9
సమూయేలు దగ్గర నుండి వెళ్లిపోడానికి బయలుదేరినపుడు దేవుడు సౌలుకు నూతన మనస్సు అనుగ్రహించాడు. ఆ రోజే ఆ ఆనవాళ్ళు కనబడ్డాయి.
و چون آنجا به جبعه رسیدند، اینک گروهی از انبیا به وی برخوردند، وروح خدا بر او مستولی شده، در میان ایشان نبوت می‌کرد. ۱۰ 10
౧౦వారు ఆ కొండ దగ్గరకి వస్తుండగా ప్రవక్తల సమూహం అతనికి ఎదురు వచ్చినప్పుడు దేవుని ఆత్మ బలంగా అతని మీదికి వచ్చాడు. అతడు వారి మధ్య నిలిచి ప్రకటన చేస్తూ ఉన్నాడు.
و چون همه کسانی که او را پیشترمی شناختند، دیدند که اینک با انبیا نبوت می‌کند، مردم به یکدیگر گفتند: «این چیست که با پسرقیس واقع شده است، آیا شاول نیز از‌جمله انبیااست؟» ۱۱ 11
౧౧గతంలో అతనిని ఎరిగిన వారంతా అతడు ప్రవక్తలతో కలసి ప్రకటించడం చూసి “కీషు కుమారుడికి ఏమయ్యింది? సౌలు కూడా ప్రవక్త అయ్యాడా?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
و یکی از حاضرین در جواب گفت: «اما پدر ایشان کیست؟» از این جهت مثل شد که آیا شاول نیز از‌جمله انبیا است. ۱۲ 12
౧౨అక్కడ ఉన్న ఒక వ్యక్తి “అతని తండ్రి ఎవరు?” అని అడిగాడు. అందువల్ల సౌలు కూడా ప్రవక్త అయ్యాడా? అనే సామెత పుట్టింది.
و چون ازنبوت کردن فارغ شد به مکان بلند آمد. ۱۳ 13
౧౩తరువాత అతడు ప్రకటించడం ఆపివేసి ఉన్నత స్థలానికి వచ్చాడు.
و عموی شاول به او و به خادمش گفت: «کجا رفته بودید؟» او در جواب گفت: «برای جستن الاغها و چون دیدیم که نیستند، نزدسموئیل رفتیم.» ۱۴ 14
౧౪సౌలు చిన్నాన్న అతణ్ణి, అతని పనివాణ్ణి చూసి “మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు?” అని అడిగినపుడు అతడు “గాడిదలను వెదకాలని వెళ్ళాం, అవి కనబడనప్పుడు సమూయేలు దగ్గరకి వెళ్ళాం” అని చెప్పాడు.
عموی شاول گفت: «مرا بگوکه سموئیل به شما چه گفت؟» ۱۵ 15
౧౫సౌలు చిన్నాన్న “సమూయేలు నీకు ఏమి చెప్పాడో ఆ విషయాలు నాకు కూడా చెప్పు” అని అడిగాడు.
شاول به عموی خود گفت: «ما را واضح خبر داد که الاغها پیداشده است.» لیکن درباره امر سلطنت که سموئیل به او گفته بود، او را مخبر نساخت. ۱۶ 16
౧౬సౌలు అతనితో “గాడిదలు దొరికాయి అని అతడు చెప్పాడు” అని చెప్పాడు గానీ రాజ్య పరిపాలనను గురించి సమూయేలు చెప్పిన మాట చిన్నాన్నకు చెప్పలేదు.
و سموئیل قوم را در مصفه به حضورخداوند خواند ۱۷ 17
౧౭తరువాత సమూయేలు మిస్పాలో యెహోవా సన్నిధికి ప్రజలను పిలిపించి ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు,
و به بنی‌اسرائیل گفت: «یهوه، خدای اسرائیل، چنین می‌گوید: من اسرائیل را ازمصر برآوردم، و شما از دست مصریان و از دست جمیع ممالکی که بر شما ظلم نمودند، رهایی دادم. ۱۸ 18
౧౮“ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా చెబుతున్నాడు, నేను ఇశ్రాయేలీయులైన మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించి ఐగుప్తీయుల ఆక్రమణ నుండి, మిమ్మల్ని బాధపెట్టిన ప్రజలనుండి విడిపించాను.
و شما امروز خدای خود را که شما را ازتمامی بدیها و مصیبت های شما رهانید، اهانت کرده، او را گفتید: پادشاهی بر ما نصب نما، پس الان با اسباط و هزاره های خود به حضور خداوندحاضر شوید.» ۱۹ 19
౧౯అయినప్పటికీ మీ కష్టకాలంలో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడిన మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విడిచిపెట్టారు. ‘మా మీద ఒకరిని రాజుగా నియమించు’ అని కోరుకున్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రాలు, మీ కుటుంబాల క్రమం ప్రకారం మీరంతా యెహోవా సన్నిధిలో హాజరు కావాలి.”
و چون سموئیل جمیع اسباط اسرائیل راحاضر کرد، سبط بنیامین گرفته شد. ۲۰ 20
౨౦ఇశ్రాయేలీయుల గోత్రాలన్నిటినీ సమూయేలు సమకూర్చినపుడు బెన్యామీను గోత్రంపై చీటీ పడింది.
و سبطبنیامین را با قبایل ایشان نزدیک آورد، و قبیله مطری گرفته شد. و شاول پسر قیس گرفته شد، وچون او را طلبیدند، نیافتند. ۲۱ 21
౨౧బెన్యామీను గోత్రంవారి వంశాలు, కూటమి పేరుల ప్రకారం సమకూర్చినపుడు మత్రియుల వంశం ఏర్పడింది. తరువాత కీషు కుమారుడు సౌలు ఎన్నికయ్యాడు. ప్రజలు అతనిని వెదగ్గా అతడు కనబడలేదు.
پس بار دیگر ازخداوند سوال کردند که آیا آن مرد به اینجا دیگرخواهد آمد؟ خداوند در جواب گفت: «اینک اوخود را در میان اسبابها پنهان کرده است.» ۲۲ 22
౨౨అప్పుడు వారు “ఇక్కడికి రావలసి మనిషి ఇంకెవరైనా ఉన్నారా” అని యెహోవా దగ్గర వాకబు చేసినప్పుడు యెహోవా “అతడు సామానుల్లో దాక్కున్నాడు” అని చెప్పాడు.
ودویده، او را از آنجا آوردند، و چون در میان قوم بایستاد، از تمامی قوم از کتف به بالا بلندتر بود. ۲۳ 23
౨౩వారు పరుగెత్తుకుంటూ వెళ్ళి అక్కడి నుండి అతణ్ణి తీసుకువచ్చారు. అతడు సమూహంలో నిలబడినప్పుడు భుజాల నుండి ఇతరులకంటే పైకి ఎత్తయినవాడుగా కనబడ్డాడు.
و سموئیل به تمامی قوم گفت: «آیا شخصی راکه خداوند برگزیده است ملاحظه نمودید که درتمامی قوم مثل او کسی نیست؟» و تمامی قوم صدا زده، گفتند: «پادشاه زنده بماند!» ۲۴ 24
౨౪అప్పుడు సమూయేలు “యెహోవా ఏర్పరచుకున్నవాణ్ణి మీరు చూశారా? ప్రజలందరిలో అతని వంటివాడు ఎవరూ లేడు” అని చెప్పినప్పుడు, ఆ ప్రజలంతా ఆనందంతో “రాజు చిరకాలం జీవిస్తాడు గాక” అంటూ బిగ్గరగా కేకలు వేశారు.
پس سموئیل رسوم سلطنت را به قوم بیان کرده، در کتاب نوشت، و آن را به حضور خداوندگذاشت. و سموئیل هرکس از تمامی قوم را به خانه‌اش روانه نمود. ۲۵ 25
౨౫తరువాత సమూయేలు రాజ్యపాలన పద్ధతిని ప్రజలకి వినిపించి, ఒక గ్రంథంలో రాసి యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచాడు. తరువాత సమూయేలు అక్కడ సమావేశమైన వారందరినీ తమ తమ ఇళ్ళకు పంపివేశాడు.
و شاول نیز به خانه خودبه جبعه رفت و فوجی از کسانی که خدا دل ایشان را برانگیخت همراه وی رفتند. ۲۶ 26
౨౬సౌలు కూడా గిబియాలో ఉన్న తన ఇంటికి వెళ్లిపోయాడు. దేవుని ఆత్మ ద్వారా హృదయంలో ప్రేరేపణ పొందిన యుద్ధవీరులు అతని వెంట వెళ్లారు.
اما بعضی پسران بلیعال گفتند: «این شخص چگونه ما رابرهاند؟» و او را حقیر شمرده، هدیه برایش نیاوردند. اما او هیچ نگفت. ۲۷ 27
౨౭అసూయపరులూ, దుష్టులూ అయిన కొందరు “ఈ మనిషి మనలను ఏలుతాడా?” అని చెప్పుకొంటూ అతడిని పట్టించుకోకుండా, కానుకలు ఇవ్వకుండా ఉన్నప్పుడు సౌలు ఏమీ పట్టించుకోకుండా చెవిటి వాడిలాగా నెమ్మదిగా ఉండిపోయాడు.

< اول سموئیل 10 >