< 1 इतिहास 8 >

1 बेला हा बन्यामीनचा ज्येष्ठ पुत्र. आशबेल हा दुसरा आणि अहरह हा तिसरा.
బెన్యామీను కొడుకుల్లో పెద్దవాడు బెల, రెండో వాడు అష్బేలు,
2 चौथा नोहा व पाचवा राफा.
మూడో వాడు అహరహు, నాల్గో వాడు నోహా, అయిదో వాడు రాపా.
3 आणि बेलाचे पुत्र अद्दार, गेरा, अबीहूद,
వీళ్ళలో బెలకు అద్దారు, గెరా, అబీహూదు,
4 अबीशूवा, नामान, अहोह,
అబీషూవ, నయమాను, అహోయహు,
5 गेरा, शफूफान आणि हुराम हे बेलाचे पुत्र.
గెరా, షెపూపాను, హూరాము పుట్టారు.
6 एहूदाचे पुत्र गिबा येथल्या पितृकुलाचे प्रमुख होते. त्यास पाडाव करून मानाहथ येथे नेले.
ఏహూదుకు పుట్టిన వాళ్ళు గెబలో నివాసమున్న వివిధ తెగలకు నాయకులుగా ఉన్నారు. వీళ్ళు బలవంతంగా మనహతుకు తరలి వెళ్ళాల్సి వచ్చింది.
7 नामान, अहीया व गेरा यांस त्याने कैदी करून नेले. त्यास उज्जा व अहिहूद हे झाले.
ఏహూదు కొడుకులు నయమాను, అహీయా, గెరా. చివరివాడు గెరా మహానతుకు తరలి వెళ్తున్న వాళ్లకు నాయకత్వం వహించాడు. ఇతను ఉజ్జా, ఆహిహుదులకు తండ్రి.
8 शहरयिमाने मवाबात आपल्या पत्नी हुशीम आणि बारा यांना घटस्फोट दिला. यानंतर त्यास दुसऱ्या एका पत्नीपासून अपत्ये झाली.
షహరయీము మోయాబు దేశంలో తన భార్యలు హుషీము, బయరా అనే వాళ్ళని వదిలి వేసిన తరువాత అతనికి పిల్లలు కలిగారు.
9 त्याची पत्नी होदेश हिच्यापासून त्यास योबाब, सिब्या, मेशा, मल्काम,
అతని మరో భార్య అయిన హోదెషు ద్వారా అతనికి యోబాబు, జిబ్యా, మేషా, మల్కాము,
10 १० यऊस, शख्या, मिर्मा हे पुत्र झाले. ते आपल्या पित्याच्या घराण्यांचे प्रमुख होते.
౧౦యెపూజు, షాక్యా, మిర్మాలు పుట్టారు. వీళ్ళు అతని కొడుకులు. వీళ్ళు తమ తెగలకు నాయకులుగా ఉన్నారు.
11 ११ हुशीम पासून शहरयिमाला अबीटूब आणि एल्पाल हे पुत्र झाले.
౧౧హుషీము అనే తన భార్య ద్వారా అతనికి అప్పటికే అహీటూబు, ఎల్పయలు అనే కొడుకులు ఉన్నారు.
12 १२ एबर, मिशाम शमेद, बरीया आणि शमा हे एल्पालाचे पुत्र. शमेदने ओनो आणि लोद व त्या आसपासची गावे वसवली.
౧౨ఎల్పయలు కొడుకులు ఏబెరు, మిషాము, షెమెదు. షెమెదు ఓనోనూ, లోదునూ వాటితో పాటు వాటి చుట్టూ ఉన్న గ్రామాలనూ కట్టించాడు.
13 १३ बरीया आणि शमा हे अयालोनमधील घराण्यांचे प्रमुख होते. त्यांनी गथ येथील रहिवाश्यांना हुसकावून लावले.
౧౩ఇంకా బెరీయా, షెమా అయ్యాలోనులో నివసించారు. వీళ్ళు తమ వంశ నాయకులు. వీళ్ళు గాతు నివాసులను అక్క డి నుంచి వెళ్ళగొట్టారు.
14 १४ हे बरीयाचे पुत्र: अह्यो, शाशक, यरेमोथ,
౧౪బెరీయా కొడుకులు అహ్యో, షాషకు, యెరేమోతు,
15 १५ जबद्या. अराद, एदर,
౧౫జెబద్యా, అరాదు, ఏదెరు,
16 १६ मीखाएल, इश्पा, योहा हे बरीयाचे पुत्र.
౧౬మిఖాయేలు, ఇష్పా, యోహా.
17 १७ जबद्या, मशुल्लाम, हिज्की, हेबेर,
౧౭ఎల్పయలు కొడుకులు జెబద్యా, మెషుల్లాము, హిజికీ, హెబెరు,
18 १८ इश्मरय, इज्लीया, योबाब हे एल्पालचे पुत्र.
౧౮ఇష్మెరై, ఇజ్లీయా, యోబాబు.
19 १९ याकीम, जिख्री, जब्दी,
౧౯షిమీ కొడుకులు యాకీము, జిఖ్రీ, జబ్ది,
20 २० एलीएनय, सिलथय, अलीएल,
౨౦ఎలీయేనై, జిల్లెతై, ఎలీయేలు,
21 २१ अदाया, बराया, शिम्राथ हे शिमीचे पुत्र
౨౧అదాయా, బెరాయా, షిమ్రాతు.
22 २२ इश्पान, एबर, अलीएल,
౨౨షాషకు కొడుకులు ఇష్పాను, ఏబెరు, ఎలీయేలు,
23 २३ अब्दोन, जिख्री, हानान,
౨౩అబ్దోను, జిఖ్రీ, హానాను,
24 २४ हनन्या, एलाम, अनथोथीया,
౨౪హనన్యా, ఏలాము, అంతోతీయా,
25 २५ इफदया, पनुएल हे शाशकचे पुत्र होत.
౨౫ఇపెదయా, పెనూయేలు.
26 २६ शम्शरय, शहऱ्या, अथल्या,
౨౬ఇక యెరోహాము కొడుకులు షంషెరై, షెహర్యా, అతల్యా,
27 २७ यारेश्या, एलीया, जिख्री हे यरोहामाचे पुत्र.
౨౭యహరెష్యా, ఏలీయ్యా, జిఖ్రీ.
28 २८ हे सर्व आपापल्या घराण्यांचे प्रमुख होते. ते यरूशलेम येथे राहत होते.
౨౮వీళ్ళంతా తమ తమ వంశాలకు నాయకులు. వీళ్ళు యెరూషలేములో నివసిస్తూ ప్రముఖులయ్యారు.
29 २९ गिबोनाचा पिता यइएल. तो गिबोनामध्ये राहत होता. त्याची पत्नी माका.
౨౯గిబియోనుకి తండ్రి అయిన యహియేలు గిబియోనులో నివసించాడు. ఇతని భార్య పేరు మయకా.
30 ३० त्याचा ज्येष्ठ पुत्र अब्दोन. सूर, कीश, बाल, नादाब,
౩౦ఇతని పెద్దకొడుకు పేరు అబ్దోను. మిగిలిన కొడుకులు సూరు, కీషు, బయలు, నాదాబు,
31 ३१ गदोर, अह्यो, जेखर आणि मिकलोथ ही इतर अपत्ये.
౩౧గెదోరు, అహ్యో, జెకెరు.
32 ३२ शिमा हा मिकलोथचा पुत्र. आपल्या यरूशलेममधील बांधवांच्या जवळच हे सर्व राहत होते.
౩౨మిక్లోతుకు షిమ్యాను పుట్టాడు. వీళ్ళు కూడా యెరూషలేములో తమ బంధువులకు సమీపంగా నివసించారు.
33 ३३ कीशचा पिता नेर. कीश शौलाचा पिता. आणि शौल योनाथान, मलकीशुवा, अबीनादाब, एश्बाल यांचा पिता.
౩౩నేరుకి కీషు పుట్టాడు. కీషుకి సౌలు పుట్టాడు. సౌలుకు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబు, ఎష్బయలు పుట్టారు.
34 ३४ योनाथानाचा पुत्र मरीब्बाल. मरीब्बाल मीखाचा पिता.
౩౪యోనాతాను కొడుకు మెరీబ్బయలు. మెరీబ్బయలుకు మీకా పుట్టాడు.
35 ३५ पीथोन, मेलेख, तरेया आणि आहाज हे मीखाचे पुत्र.
౩౫మీకా కొడుకులు పీతోను, మెలెకు, తరేయా, ఆహాజు అనే వాళ్ళు.
36 ३६ यहोअद्दाचे वडील आहाज. यहोअद्दा आलेमेथ, अजमावेथ व जिम्री यांचा पिता होता. जिम्री हा मोसाचा पिता होता.
౩౬ఆహాజుకు యెహోయాదా పుట్టాడు. యెహోయాదా కొడుకులు ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీ. జిమ్రీకి మోజా పుట్టాడు.
37 ३७ बिनाचा पिता मोसा. बिनाचा पुत्र राफा. राफाचा एलासा. एलासाचा आसेल.
౩౭మోజాకి బిన్యా పుట్టాడు. బిన్యా కొడుకు రాపా. రాపా కొడుకు ఎలాశా. ఎలాశా కొడుకు ఆజేలు.
38 ३८ आसेलला सहा पुत्र होते. ते म्हणजे अज्रीकाम, बोखरु, इश्माएल, शाऱ्या, ओबद्या, हान.
౩౮ఆజేలుకి ఆరుగురు కొడుకులు. వాళ్ళ పేర్లు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షెయర్యా, ఓబద్యా, హానాను. వీళ్ళంతా ఆజేలు కొడుకులు.
39 ३९ आसेलचा भाऊ एशेक. त्याचे पुत्र: ज्येष्ठ पुत्र ऊलाम, दुसरा यऊश आणि तिसरा अलीफलेत.
౩౯ఆజేలు సోదరుడు ఏషెకు. ఇతనికి ముగ్గురు కొడుకులున్నారు. వీళ్ళలో ఊలాము పెద్దవాడు. రెండోవాడు యెహూషు. మూడోవాడు ఎలీపేలెటు.
40 ४० ऊलामचे पुत्र शूर आणि उत्तम धनुर्धर होते. पुत्र, नातवंडे मिळून दिडशें जण होते. हे सर्व बन्यामीनाचे वंशज होते.
౪౦ఊలాము కొడుకులు విలువిద్యలో ప్రావీణ్యం పొందిన శూరులు. వీళ్ళకు నూట యాభై మంది కొడుకులూ, మనవళ్ళూ ఉన్నారు. వీళ్ళంతా బెన్యామీను గోత్రం వాళ్ళు.

< 1 इतिहास 8 >