< 창세기 5 >

1 아담 자손의 계보가 이러하니라 하나님이 사람을 창조하실 때에 하나님의 형상대로 지으시되
ఆదాము వంశక్రమం ఇది. దేవుడు మనిషిని సృష్టించిన రోజున వాళ్ళను తన సొంత పోలికలో చేశాడు.
2 남자와 여자를 창조하셨고 그들이 창조되던 날에 하나님이 그들에게 복을 주시고 그들의 이름을 사람이라 일컬으셨더라
వారిని పురుషులుగా, స్త్రీలుగా సృష్టించాడు. వాళ్ళను సృష్టించిన రోజున ఆయన వాళ్ళను ఆశీర్వదించి వాళ్లకు మనుషులు అని పేరు పెట్టాడు.
3 아담이 일백 삼십세에 자기 모양 곧 자기 형상과 같은 아들을 낳아 이름을 셋이라 하였고
ఆదాముకు నూట ముప్ఫై సంవత్సరాల వయస్సులో అతని పోలికగా అతని స్వరూపంలో కొడుకు పుట్టాడు. ఆదాము అతనికి షేతు అని పేరుపెట్టాడు.
4 아담이 셋을 낳은 후 팔백년을 지내며 자녀를 낳았으며
షేతు పుట్టిన తరువాత ఆదాము ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు, కూతుళ్ళు పుట్టారు.
5 그가 구백 삼십세를 향수하고 죽었더라
ఆదాము తొమ్మిది వందల ముప్ఫై సంవత్సరాలు బ్రతికాడు.
6 셋은 일백 오세에 에노스를 낳았고
షేతుకు నూట ఐదు సంవత్సరాల వయస్సులో ఎనోషు పుట్టాడు.
7 에노스를 낳은 후 팔백 칠년을 지내며 자녀를 낳았으며
ఎనోషు పుట్టిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
8 그가 구백 십이세를 향수하고 죽었더라
షేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బ్రతికాడు.
9 에노스는 구십세에 게난을 낳았고
ఎనోషుకు తొంభై సంవత్సరాల వయస్సులో కేయినాను పుట్టాడు.
10 게난을 낳은 후 팔백 십 오년을 지내며 자녀를 낳았으며
౧౦కేయినాను పుట్టిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదిహేను సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
11 그가 구백 오세를 향수하고 죽었더라
౧౧ఎనోషు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
12 게난은 칠십세에 마할랄렐을 낳았고
౧౨కేయినానుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో మహలలేలు పుట్టాడు.
13 마할랄렐을 낳은 후 팔백 사십년을 지내며 자녀를 낳았으며
౧౩మహలలేలు పుట్టిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలభై సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
14 그가 구백 십세를 향수하고 죽었더라
౧౪కేయినాను తొమ్మిది వందల పది సంవత్సరాలు బ్రతికాడు.
15 마할랄렐은 육십 오세에 야렛을 낳았고
౧౫మహలలేలుకు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో యెరెదు పుట్టాడు.
16 야렛을 낳은 후 팔백 삼십년을 지내며 자녀를 낳았으며
౧౬యెరెదు పుట్టిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్ఫైసంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
17 그가 팔백 구십 오세를 향수하고 죽었더라
౧౭మహలలేలు ఎనిమిదివందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
18 야렛은 일백 육십 이세에 에녹을 낳았고
౧౮యెరెదుకు నూట అరవై రెండు సంవత్సరాల వయస్సులో హనోకు పుట్టాడు.
19 에녹을 낳은 후 팔백년을 지내며 자녀를 낳았으며
౧౯హనోకు పుట్టిన తరువాత యెరెదు ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
20 그가 구백 육십 이세를 향수하고 죽었더라
౨౦యెరెదు తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాలు బ్రతికాడు.
21 에녹은 육십 오세에 므두셀라를 낳았고
౨౧హనోకుకు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో మెతూషెల పుట్టాడు.
22 므두셀라를 낳은 후 삼백년을 하나님과 동행하며 자녀를 낳았으며
౨౨మెతూషెల పుట్టిన తరువాత హనోకు మూడు వందల సంవత్సరాలు దేవునితో సహవాసం చేస్తూ కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
23 그가 삼백 육십 오세를 향수하였더라
౨౩హనోకు మూడువందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
24 에녹이 하나님과 동행하더니 하나님이 그를 데려 가시므로 세상에 있지 아니하였더라
౨౪హనోకు దేవునితో కలసి నడిచాడు. దేవుడు అతణ్ణి తీసుకువెళ్ళాడు గనుక అతడు కనబడలేదు.
25 므두셀라는 일백 팔십 칠세에 라멕을 낳았고
౨౫మెతూషెలకు నూట ఎనభై ఏడు సంవత్సరాల వయస్సులో లెమెకు పుట్టాడు.
26 라멕을 낳은 후 칠백 팔십 이년을 지내며 자녀를 낳았으며
౨౬మెతూషెలకు లెమెకు పుట్టిన తరువాత ఏడు వందల ఎనభై రెండు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
27 그는 구백 육십 구세를 향수하고 죽었더라
౨౭మెతూషెల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు.
28 라멕은 일백 팔십 이세에 아들을 낳고
౨౮లెమెకుకు నూట ఎనభై రెండు సంవత్సరాల వయస్సులో ఒక కొడుకు పుట్టాడు.
29 이름을 노아라 하여 가로되 `여호와께서 땅을 저주하시므로 수고로이 일하는 우리를 이 아들이 안위하리라' 하였더라
౨౯“భూమిని యెహోవా శపించినందువల్ల కలిగిన మన చేతుల కష్టం విషయంలో, మన పని విషయంలో ఇతడు మనకు విశ్రాంతి ఇస్తాడు” అని, అతనికి నోవహు అని పేరు పెట్టాడు.
30 라멕이 노아를 낳은 후 오백 구십 오년을 지내며 자녀를 낳았으며
౩౦లెమెకుకు నోవహు పుట్టిన తరువాత ఐదు వందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
31 그는 칠백 칠십 칠세를 향수하고 죽었더라
౩౧లెమెకు ఏడువందల డెబ్భై ఏడు సంవత్సరాలు బ్రతికాడు.
32 노아가 오백세 된 후에 셈과, 함과, 야벳을 낳았더라
౩౨ఐదు వందల సంవత్సరాలు బ్రతికిన నోవహుకు షేము, హాము, యాపెతు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు.

< 창세기 5 >