< Jeremiás 30 >

1 Az ige, mely Jirmejáhúhoz lett az Örökkévalótól; mondván:
ఇది యెహోవా నుంచి యిర్మీయాకు వచ్చిన వాక్కు,
2 Így szól az Örökkévaló, Izrael Istene, mondván: Írd föl magadnak könyvbe mind azon igéket, melyeket szóltam hozzád.
“ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు,
3 Mert íme, napok jönnek, úgymond az Örökkévaló, és visszahozom népemnek, Izraelnek és Jehúdának foglyait, úgymond az Örökkévaló, visszahozom őket azon országba, melyet őseiknek adtam, hogy birtokba vegyék.
‘రాబోయే రోజుల్లో నేను ఇశ్రాయేలు వాళ్ళూ, యూదా వాళ్ళైన నా ప్రజలను చెరనుంచి విడిపించి, వాళ్ళ పితరులకు నేనిచ్చిన దేశాన్ని వారు స్వాధీనం చేసుకునేలా వాళ్ళను తిరిగి రప్పిస్తాను,’ అని యెహోవానైన నేను చెప్పాను. కాబట్టి, నేను నీతో చెప్పిన మాటలన్నీ ఒక రాతచుట్టలో రాయి.”
4 És ezek a szavak, melyeket szólt az Örökkévaló Izrael és Jehúda felől.
యెహోవా ఇశ్రాయేలు వాళ్ళ గురించి, యూదా వాళ్ళ గురించి చెప్పిన మాటలివి.
5 Mert így szól az Örökkévaló: Ijedség szavát hallottuk, rettegés és nincs béke.
“యెహోవా ఇలా అంటున్నాడు, ‘భయంతో వణుకుతున్న స్వరం మేం విన్నాం. ఆ స్వరంలో శాంతి లేదు.
6 Kérdezzétek csak és lássátok, vajon szül-e férfi? Miért láttam minden férfit kezével a csípőin mint a szülő nő, és átváltozott minden arc sápadtsággá?
ప్రసూతి వేదనతో ఒక పురుషుడు బిడ్డను కనగలడా? మీరు అడిగి తెలుసుకోండి. ప్రతి యువకుడు తన నడుము మీద చేతులెందుకు పెట్టుకుంటున్నాడు? ప్రసవ వేదన పడే స్త్రీలా వాళ్ళ ముఖాలు ఎందుకు పాలిపోయాయి?
7 Jaj, mert nagy ama nap, nincs hozzá hasonló; szorongatás ideje az Jákobnak, de abból megszabadul.
అయ్యో, ఎంత భయంకరమైన రోజు! అలాంటి రోజు ఇంకొకటి రాదు. అది యాకోబు సంతతి వాళ్లకు ఆందోళన కలిగించే సమయం. అయినా దానిలోనుంచి అతనికి రక్షణ దొరుకుతుంది.’”
8 És lesz ama napon, úgymond az Örökkévaló a seregek ura, eltöröm jármát nyakadról és köteleidet szétszakítom és nem igázzák őt le többé idegenek,
సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు “ఆ రోజు, నీ మెడ మీద ఉన్న నీ కాడి విరిచి, నేను నీ బంధకాలు తెంపుతాను. ఇంక విదేశీయులు నీ చేత దాస్యం చేయించుకోరు.
9 hanem szolgálni fogják az Örökkévalót, Istenüket, és Dávidot, királyukat, akit majd támasztok nekik.
కాని, వాళ్ళు తమ దేవుడైన యెహోవాను ఆరాధించి, నేను వాళ్ళ మీద రాజుగా చేసే తమ రాజైన దావీదును సేవిస్తారు.
10 És te ne félj szolgám Jákob, úgymond az Örökkévaló, és ne rettegj Izrael, mert íme én megsegítlek távolból és magzatodat fogságuk országából; visszatér Jákob, nyugodt lesz és gondtalan, és nem ijeszti senki.
౧౦కాబట్టి, నా సేవకుడవైన యాకోబూ, భయపడకు, యెహోవా చేప్పేదేమంటే, ‘ఇశ్రాయేలూ, దిగులు పడకు. దూరంగా ఉన్న నిన్ను, బందీలుగా ఆ దేశంలో ఉన్న నీ సంతతి వాళ్ళను, నేను రక్షించబోతున్నాను. యాకోబు సంతతి తిరిగి వచ్చి, శాంతి కలిగి ఉంటుంది. అతడు సురక్షితంగా ఉంటాడు, భయభీతులు ఇంక ఉండవు.
11 Mert veled vagyok, úgymond az Örökkévaló, hogy megsegítselek; mert végpusztítást teszek mind azon nemzetek közt, ahová elszórtalak, ámde rajtad nem teszek végpusztítást, megfenyítlek igazság szerint, de büntetlenül nem hagylak.
౧౧ఎందుకంటే, నేను నీతో ఉన్నాను,’ యెహోవా వాక్కు ఇదే, ‘నిన్ను రక్షించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను ఏ దేశాల్లోకైతే చెదరగొట్టానో, ఆ దేశాలన్నిటినీ నేను సమూల నాశనం చేస్తాను. కాని, నిన్ను మాత్రం పూర్తిగా నాశనం చెయ్యను. అయితే నిన్ను తగిన క్రమశిక్షణలో పెడతాను. శిక్ష లేకుండా మాత్రం నిన్ను విడిచిపెట్టను.’
12 Mert így szól az Örökkévaló: Végzetes a törésed, kínzó a te sebed!
౧౨యెహోవా ఇలా అంటున్నాడు, ‘నీ దెబ్బ నయం కాదు. నీ గాయం మానని పుండుగా అయ్యింది.
13 Senki sem szerez neked jogot nyavalyádban; sebhegesztő gyógyító szerek nincsenek számodra.
౧౩నీ పక్షంగా వాదించేవాళ్ళు ఎవరూ లేరు. నీ పుండు నయం చేసే మందు లేదు.
14 Mind a szeretőid elfelejtettek téged, felőled nem kérdezősködnek; mert amint ellenség ver, úgy vertelek, kegyetlennek a fenyítésével, azért, mert sok volt a bűnöd, számosak a vétkeid.
౧౪నీ ప్రేమికులంతా నిన్ను మరిచిపోయారు. వాళ్ళు నీ కోసం చూడరు. ఎందుకంటే, అధికమైన నీ పాపాలనుబట్టి, నీ గొప్ప దోషాన్నిబట్టి, ఒక కఠినమైన యజమాని పెట్టే క్రమశిక్షణ కింద నిన్ను ఉంచి, ఒక శత్రువు గాయపరిచినట్టు నేను నిన్ను గాయపరిచాను.
15 Mit kiáltasz törésed miatt, hogy végzetes a fájdamad? Azért mert sok volt a bűnöd, számosak vétkeid, cselekedtem ezeket veled.
౧౫నీ గాయాన్నిబట్టి నువ్వు సాయం కోసం అడుగుతున్నావా? నీ బాధ తీరనిది. విస్తారమైన నీ పాపాలనుబట్టి, అనేకమైన నీ దోషాలను బట్టి నేను నీకు ఇలా చేశాను.
16 Azért mind akik téged megemésztenek, megemésztetnek, s mind a szorongatóid, mindnyájan fogságba mennek és lesznek a fosztogatóid fosztogatásra és mind a prédálóidat prédává teszem.
౧౬కాబట్టి, నిన్ను దిగమింగే వాళ్ళెవరో, వాళ్ళనే దిగమింగడం జరుగుతుంది. నీ ప్రత్యర్దులందరూ బందీలుగా చెరలోకి వెళ్తారు. నిన్ను దోచుకున్నవాళ్ళు దోపుడు సొమ్ము అవుతారు. నిన్ను కొల్లగొట్టిన వాళ్ళను కొల్లసొమ్ముగా చేస్తాను.
17 Mert behegesztem sebedet és csapásaidból meggyógyítlak, úgymond az Örökkévaló, mert eltaszítottnak neveztek téged: Czión az, nincs ki felőle kérdezősködik.
౧౭నీకు స్వస్థత తీసుకొస్తాను. నీ గాయాలను స్వస్థపరుస్తాను.’” ఇదే యెహోవా వాక్కు. “ఎందుకంటే వాళ్ళు ‘సీయోను వెలి వేయబడింది. దాన్ని పట్టించుకునే వాడు లేడు’ అని నీ గురించి అన్నారు గనుక, నేను ఈ విధంగా చేస్తాను.”
18 Így szól az Örökkévaló: íme én visszahozom Jákob sátrainak foglyait és hajlékainak irgalmazok; fölépül a város a maga halmán és a palota a maga módja szerint lesz lakva.
౧౮యెహోవా ఇలా అంటున్నాడు “చూడు, యాకోబు నివాసస్థలాలను కరుణించి అతని గుడారాల మీద నేను కనికరం చూపిస్తాను. అప్పుడు శిథిలాల గుట్ట మీద ఒక పట్టణం నిర్మాణం అవుతుంది. ఇదివరకు ఉన్నట్టే ఒక స్థిరమైన నివాసం ఏర్పాటవుతుంది.
19 És hálaszó ered belőlük és játszadozók hangja; megsokasítom őket és nem kevesbednek, dicsőkké teszem őket és nem kisebbednek.
౧౯అప్పుడు వాటిలోనుంచి ఒక స్తుతి కీర్తన, ఒక వేడుక శబ్దం బయటకు వస్తుంది. ప్రజలు తక్కువ సంఖ్యలో లేకుండా నేను వాళ్ళను విస్తరింపజేస్తాను. అల్పులు కాకుండా నేను వాళ్ళకు ఘనత కలుగజేస్తాను.
20 És olyanok lesznek fiai, mint hajdan, és községe szilárdan áll előttem, és megbüntetem mind az elnyomóit.
౨౦వాళ్ళ ప్రజలు మునుపటిలా ఉంటారు. వాళ్ళను హింసించే వాళ్ళందరినీ నేను శిక్షించినప్పుడు, వాళ్ళ సమాజం నా ఎదుట స్థిరం అవుతుంది.
21 És belőle lesz a hatalmasa és uralkodója az ő közepéből ered; közeledni hagyom őt, hogy hozzám lépjen; mert kicsoda az, aki rászánta szívét, hogy hozzám lépjen, úgymond az Örökkévaló?
౨౧వాళ్ళ నాయకుడు వాళ్ళల్లోనుంచే వస్తాడు. నేను వాళ్ళను ఆకర్షించినప్పుడు, వాళ్ళు నన్ను సమీపించినప్పుడు, వాళ్ళ మధ్య నుంచి అతడు బయలుదేరుతాడు. నేను ఇది చెయ్యకపోతే, నన్ను సమీపించే సాహసం ఎవడు చెయ్యగలడు?” ఇది యెహోవా వాక్కు.
22 És ti lesztek nekem népül és én leszek nektek Istenül.
౨౨“అప్పుడు మీరు నా ప్రజలుగా ఉంటారు. నేను మీ దేవుడుగా ఉంటాను.
23 Íme az Örökkévaló vihara hévvel tör ki, rohanó szélvész, a gonoszok fejére fordul.
౨౩చూడు, యెహోవా ఉగ్రత పెనుగాలిలా బయలుదేరింది. అది ఎల్లప్పుడూ వీచే పెనుగాలి. అది సుడిగాలిలా దుష్టుల తలల మీద గిరగిరా తిరుగుతుంది.
24 Nem tér meg az Örökkévaló föllobbant haragja, amíg meg nem tette és teljesítette szívének gondolatait; a napok végén meg fogjátok érteni.
౨౪తన కార్యం జరిగించే వరకూ, తన హృదయాలోచనలు నెరవేర్చే వరకూ యెహోవా కోపాగ్ని చల్లారదు. చివరి రోజుల్లో మీరు దీన్ని అర్థం చేసుకుంటారు.”

< Jeremiás 30 >