< Proverbs 17 >

1 Better [is] a dry morsel, and rest with it, Than a house full of the sacrifices of strife.
ఎంత రుచికరమైన భోజనం ఉన్నా కలహాలతో ఉన్న ఇంట్లో ఉండడం కంటే ప్రశాంతంగా వట్టి రొట్టెముక్క తినడం మంచిది.
2 A wise servant ruleth over a son causing shame, And in the midst of brethren He apportioneth an inheritance.
బుద్ధిమంతుడైన సేవకుడు సిగ్గు కలిగించే కొడుకు మీద అధికారం సంపాదించుకుంటాడు. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితం పంచు కుంటాడు.
3 A refining pot [is] for silver, and a furnace for gold, And the trier of hearts [is] Jehovah.
వెండికి మూస, బంగారానికి కొలిమి కావాలి. హృదయాలను శుద్ధి చేసేది యెహోవాయే.
4 An evil doer is attentive to lips of vanity, Falsehood is giving ear to a mischievous tongue.
చెడు నడవడిక గలవాడు చెప్పుడు మాటలు వింటాడు. హానికరమైన మాటలు పలుకుతుంటే అబద్ధికుడు శ్రద్ధగా వింటాడు.
5 Whoso is mocking at the poor Hath reproached his Maker, Whoso is rejoicing at calamity is not acquitted.
పేదలను వెక్కిరించేవాడు వారి సృష్టికర్తను నిందిస్తున్నాడు. ఆపద కలగడం చూసి సంతోషించేవాడికి శిక్ష తప్పదు.
6 Sons' sons [are] the crown of old men, And the glory of sons [are] their fathers.
మనవలు ముసలివారికి కిరీటాలు. తమ పిల్లలకు ప్రతిష్ట తెచ్చేది తల్లి దండ్రులే.
7 Not comely for a fool is a lip of excellency, Much less for a noble a lip of falsehood.
అతి వాగుడు బుద్ధిలేనివాడికి తగదు. అంతకన్నా ముఖ్యంగా అబద్ధమాడడం అధిపతికి పనికిరాదు.
8 A stone of grace [is] the bribe in the eyes of its possessors, Whithersoever it turneth, it prospereth.
లంచం ఇచ్చేవాడికి అదొక మహిమగల మణి లాగా ఉంటుంది. అలాంటివాడు చేసేవన్నీ నెరవేరుతున్నట్టు ఉంటుంది.
9 Whoso is covering transgression is seeking love, And whoso is repeating a matter Is separating a familiar friend.
ప్రేమను కోరేవాడు జరిగిన తప్పును గుట్టుగా ఉంచుతాడు. జరిగిన సంగతి మాటిమాటికీ ఎత్తేవాడు దగ్గర స్నేహితులను కూడా పాడు చేసుకుంటాడు.
10 Rebuke cometh down on the intelligent More than a hundred stripes on a fool.
౧౦బుద్ధిహీనుడికి నూరుదెబ్బల కంటే బుద్ధిమంతుడికి ఒక గద్దింపు మాట మరింత లోతుగా నాటుతుంది.
11 An evil man seeketh only rebellion, And a fierce messenger is sent against him.
౧౧దుర్మార్గుడు ఎప్పుడూ తిరుగుబాటు చేయడానికే చూస్తాడు. అలాటి వాడికి వ్యతిరేకంగా క్రూరుడైన వార్తాహరుణ్ణి పంపిస్తారు.
12 The meeting of a bereaved bear by a man, And — not a fool in his folly.
౧౨మూర్ఖపు పనులు చేస్తున్న మూర్ఖుడికి ఎదురు పడడం కంటే పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని కలుసుకోవడమే క్షేమం.
13 Whoso is returning evil for good, Evil moveth not from his house.
౧౩మేలుకు ప్రతిగా కీడు చేసేవాడి లోగిలిలో నుండి కీడు ఎన్నటికీ తొలగిపోదు.
14 The beginning of contention [is] a letting out of waters, And before it is meddled with leave the strife.
౧౪పోట్లాట మొదలు పెట్టడం నీటిని వదిలిపెట్టినట్టే. కాబట్టి వివాదం పెరగక ముందే దాన్ని వదిలెయ్యి.
15 Whoso is justifying the wicked, And condemning the righteous, Even both of these [are] an abomination to Jehovah.
౧౫దుర్మార్గులను నిర్దోషులుగా, మంచి చేసే వారిని దోషులుగా తీర్పు తీర్చేవాడు వీరిద్దరూ యెహోవాకు అసహ్యం.
16 Why [is] this — a price in the hand of a fool to buy wisdom, And a heart there is none?
౧౬బుద్ధిహీనుడు జ్ఞానం సంపాదించడానికి డబ్బు ఇవ్వడం దేనికి? నేర్చుకునే సామర్థ్యం వాడికి లేదు గదా?
17 At all times is the friend loving, And a brother for adversity is born.
౧౭స్నేహితుడు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. కష్టకాలంలో ఆదుకోడానికే సోదరులు పుట్టేది.
18 A man lacking heart is striking hands, A surety he becometh before his friend.
౧౮తన పొరుగువాడికి జామీను ఉండి అతడి అప్పులకు హామీ ఉండే వాడు తెలివితక్కువ వాడు.
19 Whoso is loving transgression is loving debate, Whoso is making high his entrance is seeking destruction.
౧౯కలహాలంటే ఇష్టం ఉన్నవాడు పాపాన్ని ప్రేమించేవాడు. తన ఇంటి వాకిళ్ళు ఎత్తు పెంచేవాడు ఎముకలు విరగడానికి కారణం అవుతాడు.
20 The perverse of heart findeth not good, And the turned in his tongue falleth into evil.
౨౦దుష్ట హృదయం గలవాడికి మేలు జరగదు. కుటిలంగా మాట్లాడే వాడు ప్రమాదంలో చిక్కుకుంటాడు.
21 Whoso is begetting a fool hath affliction for it, Yea, the father of a fool rejoiceth not.
౨౧బుద్ధిలేని వాడి తండ్రికి దుఃఖమే. తెలివిలేని వాణ్ణి కన్నవాడికి సంతోషం లేదు.
22 A rejoicing heart doth good to the body, And a smitten spirit drieth the bone.
౨౨ఆహ్లాదకరమైన మనస్సు మంచి ఔషధం. చితికిపోయిన మనస్సు వల్ల ఎముకలు ఎండిపోతాయి.
23 A bribe from the bosom the wicked taketh, To turn aside the paths of judgment.
౨౩న్యాయాన్ని తారుమారు చేయడానికి దుష్టుడు రహస్యంగా లంచం తీసుకుంటాడు.
24 The face of the intelligent [is] to wisdom, And the eyes of a fool — at the end of the earth.
౨౪వివేకం గలవాడు తన ముఖాన్ని జ్ఞానం కేసి తిప్పుకుంటాడు. బుద్ధిలేని వాడి కళ్ళు భూమి కొనల వైపు తిరిగి ఉంటాయి.
25 A provocation to his father [is] a foolish son, And bitterness to her that bare him.
౨౫బుద్ధిలేని కొడుకు తన తండ్రికి దుఃఖం తెస్తాడు. కన్న తల్లికి వాడు వేదన కలిగిస్తాడు.
26 Also, to fine the righteous is not good, To smite nobles for uprightness.
౨౬మంచి చేసే వారిని శిక్షించడం న్యాయం కాదు. యథార్థత గల ఉదాత్తులను కొరడాలతో కొట్టడం తగదు.
27 One acquainted with knowledge is sparing his words, And the cool of temper [is] a man of understanding.
౨౭జ్ఞానం గలవాడు తక్కువగా మాట్లాడతాడు. అవగాహన గలవాడు శాంత గుణం కలిగి ఉంటాడు.
28 Even a fool keeping silence is reckoned wise, He who is shutting his lips intelligent!
౨౮మూర్ఖుడు సైతం మౌనంగా ఉంటే చాలు, అందరూ అతడు జ్ఞాని అనుకుంటారు. అలాటి వాడు నోరు మూసుకుని ఉంటే చాలు, అతడు తెలివి గలవాడని అందరూ అనుకుంటారు.

< Proverbs 17 >