< 2 Chronicles 6 >

1 Then said Solomon, 'Jehovah said — to dwell in thick darkness,
అప్పుడు సొలొమోను “గాఢాంధకారంలో నేను నివసిస్తున్నాను అని యెహోవా సెలవిచ్చాడు.
2 and I — I have built a house of habitation for Thee, and a fixed place for Thy dwelling to the ages.'
అయితే నువ్వు ఎల్లకాలం నివసించడానికి నిత్యమైన స్థలంగా నేనొక గొప్ప మందిరాన్ని నీ కోసం కట్టించాను” అన్నాడు.
3 And the king turneth round his face, and blesseth the whole assembly of Israel, and the whole assembly of Israel is standing,
తరువాత రాజు ప్రజల వైపు తిరిగి, ఇశ్రాయేలీయుల సమాజం అంతా నిలబడి ఉండగా వారిని దీవించాడు.
4 and he saith, 'Blessed [is] Jehovah, God of Israel, who hath spoken with His mouth with David my father, and with His hands hath fulfilled [it], saying:
అతడు వారితో “నా తండ్రి దావీదుకు ప్రమాణం చేసి, దాన్ని స్వయంగా నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు స్తోత్రం కలుగు గాక.
5 'From the day that I brought out My people from the land of Egypt, I have not fixed on a city out of any of the tribes of Israel to build a house for my name being there, and I have not fixed on a man to be leader over My people Israel;
ఆయన ‘నేను నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన రోజు మొదలు నా నామం నిలిచి ఉండడానికి ఒక మందిరం కట్టించాలని నేను ఇశ్రాయేలు గోత్రాల్లో ఏ పట్టణాన్నీ ఏర్పాటు చేసుకోలేదు, ఇశ్రాయేలీయులనే నా ప్రజల మీద అధిపతిగా ఉండడానికి ఏ మనిషినీ నియమించ లేదు.
6 and I fix on Jerusalem for My name being there, and I fix on David to be over My people Israel.
ఇప్పుడు నా నామం నిలిచి ఉండడానికి యెరూషలేమునూ, నా ప్రజలు ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా ఉండడానికి దావీదునూ ఎన్నుకున్నాను’ అని చెప్పాడు.
7 'And it is with the heart of David my father to build a house for the name of Jehovah God of Israel,
ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నామ ఘనత కోసం ఒక మందిరాన్ని కట్టించాలన్నది నా తండ్రి దావీదు హృదయ వాంఛ.
8 and Jehovah saith unto David my father, Because that it hath been with thy heart to build a house for My name, thou hast done well that it hath been with thy heart,
అయితే యెహోవా నా తండ్రితో ‘నా నామ ఘనత కోసం మందిరం కట్టాలన్న నీ ఉద్దేశం మంచిది.
9 but thou dost not build the house, for thy son who cometh forth out from thy loins, he doth build the house for My name.
కానీ నువ్వు ఆ మందిరాన్ని కట్టడానికి వీలు లేదు. నీకు పుట్టబోయే కుమారుడు నా నామానికి ఆ మందిరం కడతాడు’ అని చెప్పాడు.
10 'And Jehovah doth establish His word that He spake, and I rise up in the stead of David my father, and sit on the throne of Israel, as Jehovah spake, and I build the house for the name of Jehovah, God of Israel,
౧౦యెహోవా అప్పుడు చెప్పిన తన మాటను ఇప్పుడు నెరవేర్చాడు. యెహోవా సెలవు ప్రకారం నేను నా తండ్రి దావీదు స్థానంలో రాజునై సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాకు మందిరం కట్టించాను.
11 and I place there the ark, where [is] the covenant of Jehovah that He made with the sons of Israel.'
౧౧ఇశ్రాయేలీయులతో యెహోవా చేసిన నిబంధనకు గుర్తుగా ఉన్న మందసాన్ని దానిలో ఉంచాను” అని చెప్పాడు.
12 And he standeth before the altar of Jehovah, over-against all the assembly of Israel, and spreadeth out his hand, —
౧౨తరవాత ఇశ్రాయేలీయులంతా సమావేశమై చూస్తుండగా యెహోవా బలిపీఠం ముందు నిలబడి తన చేతులు చాపి ప్రార్థన చేశాడు.
13 for Solomon hath made a scaffold of brass, and putteth it in the midst of the court, five cubits its length, and five cubits its breadth, and three cubits its height, and he standeth upon it, and kneeleth on his knees over-against all the assembly of Israel, and spreadeth forth his hands towards the heavens —
౧౩సొలొమోను తాను చేయించిన ఐదు మూరల పొడవు, ఐదు మూరల వెడల్పు, మూడు మూరల యెత్తు ఉన్న ఇత్తడి వేదికను ఆవరణంలో పెట్టించాడు. దాని మీద నిలబడి, సమావేశమైన ఇశ్రాయేలీయులందరి ఎదుటా మోకరించి, ఆకాశం వైపు చేతులు చాపి ఇలా ప్రార్థించాడు.
14 and saith, 'O Jehovah God of Israel, there is not like Thee a god in the heavens and in the earth, keeping the covenant and the kindness for Thy servants who are walking before Thee with all their heart;
౧౪“యెహోవా, ఇశ్రాయేలీయుల దేవా, హృదయ పూర్వకంగా నిన్ను అనుసరించే నీ భక్తుల పట్ల నీ నిబంధనను నెరవేరుస్తూ కృప చూపే నీలాంటి దేవుడు ఆకాశాల్లో గానీ, భూమి మీద గానీ లేడు.
15 who hast kept for Thy servant David my father that which Thou didst speak to him; yea, Thou dost speak with Thy mouth, and with Thy hand hast fulfilled [it], as at this day.
౧౫నీ సేవకుడు, నా తండ్రి అయిన దావీదుతో నువ్వు చేసిన వాగ్దానం నిలబెట్టుకున్నావు. నువ్వు ప్రమాణం చేసి దాన్ని నెరవేర్చావు. ఈ రోజు మేము దాన్ని కళ్ళారా చూస్తున్నాము.
16 'And now, O Jehovah, God of Israel, keep for Thy servant David my father that which Thou didst speak to him, saying, There is not cut off to thee a man from before Me, sitting on the throne of Israel, only, if thy sons watch their way to walk in My law, as thou hast walked before Me.
౧౬‘నువ్వు నడుచుకున్నట్టు నీ కుమారులు కూడా ప్రవర్తించి, నా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటే ఇశ్రాయేలీయుల సింహాసనం మీద కూర్చుని పాలించేవాడు నా సన్నిధిలో నీకుండకుండా పోడు’ అని నీవు నీ సేవకుడు, నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చిన మాటను ఇశ్రాయేలీయుల దేవా, యెహోవా, దయచేసి నెరవేర్చు.
17 'And now, O Jehovah, God of Israel, is Thy word stedfast that Thou hast spoken to Thy servant, to David,
౧౭యెహోవా, నువ్వు నీ సేవకుడు దావీదుకిచ్చిన వాగ్దానం ఇప్పుడు స్థిరపడుతుంది గాక.
18 (for is it true? — God dwelleth with man on the earth! Lo, the heavens, and the heavens of the heavens, do not contain Thee, how much less this house that I have built?)
౧౮దేవుడు మనుషులతో కలిసి ఈ భూమిపై నివసిస్తాడా? ఆకాశ మహాకాశాలు నీకు సరిపోవే? నేను కట్టిన ఈ మందిరం సరిపోతుందా?
19 'And Thou hast turned unto the prayer of Thy servant, and unto his supplication, O Jehovah my God, to hearken unto the cry and unto the prayer that Thy servant is praying before Thee,
౧౯దేవా, యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిలో చేసే ఈ ప్రార్థననూ విన్నపాన్నీ మన్నించు. నీ సేవకుడిని, నేను చేసే ప్రార్థననూ, నా మొర్రనూ ఆలకించు.
20 for Thine eyes being open towards this house by day and by night, towards the place that Thou hast said to put Thy name there, to hearken unto the prayer that Thy servant prayeth towards this place.
౨౦నీ సేవకులు ఈ స్థలం లో చేసే విన్నపాలు వినడానికి, ‘నా నామాన్ని అక్కడ ఉంచుతాను’ అని నువ్వు వాగ్దానం చేసిన స్థలం లో ఉన్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి దివారాత్రులు నిలుస్తుంది గాక.
21 'And Thou hast hearkened unto the supplications of Thy servant, and of Thy people Israel, that they pray towards this place, and Thou dost hear from the place of Thy dwelling, from the heavens, and hast hearkened, and forgiven.
౨౧నీ సేవకుడు, నీ ఇశ్రాయేలు ప్రజలు ఈ మందిరం వైపుకు తిరిగి చేయబోయే ప్రార్థనలు ఆలకించు, అవును, నువ్వు నివసిస్తున్న పరలోకం నుండి ఆలకించి, వారి పాపాలను క్షమించు.
22 'If a man doth sin against his neighbour, and he hath lifted up on him an oath to cause him to swear, and the oath hath come in before Thine altar in this house —
౨౨ఎవరైనా తన పొరుగువాడి పట్ల తప్పు చేసినప్పుడు అతని చేత ప్రమాణం చేయించడానికి ఈ మందిరంలోని నీ బలిపీఠం ఎదుటికి వచ్చినప్పుడు,
23 then Thou dost hear from the heavens, and hast done, and hast judged Thy servants, to give back to the wicked, to put his way on his head, and to declare righteous the righteous, to give to him according to his righteousness.
౨౩నువ్వు పరలోకం నుండి విని, నీ దాసులకు న్యాయం తీర్చు. హాని చేసినవాడి తలపైకి శిక్ష రప్పించు. నీతిపరుని నీతి చొప్పున వాడికి దయచేసి, అతని నీతిని స్థిరపరచు.
24 'And if Thy people Israel is smitten before an enemy, because they sin against Thee, and they have turned back and confessed Thy name, and prayed and made supplication before Thee in this house —
౨౪నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నీ ఎదుట పాపం చేయడం వలన తమ శత్రువులను ఎదిరించి నిలవలేక నీ దగ్గరకి తిరిగి వచ్చి నీ నామాన్ని ఒప్పుకుని, ఈ మందిరంలో నీ సన్నిధిలో ప్రార్థించి వేడుకున్నప్పుడు,
25 then Thou dost hear from the heavens, and hast forgiven the sin of Thy people Israel, and caused them to turn back unto the ground that Thou hast given to them, and to their fathers.
౨౫పరలోకం నుండి నువ్వు విని, నీ ప్రజలు చేసిన పాపాన్ని క్షమించి, వారికి, వారి పూర్వీకులకు నీవిచ్చిన దేశానికి వారిని మళ్లీ రప్పించు.
26 'In the heavens being restrained, and there is no rain, because they sin against Thee, and they have prayed towards this place, and confessed Thy name — from their sin they turn back because Thou dost afflict them —
౨౬వారు నీ దృష్టికి పాపం చేయడం వలన ఆకాశం మూసుకు పోయి వర్షం కురవనప్పుడు, వారు ఈ స్థలం లో ప్రార్థన చేసి నీ నామాన్ని ఒప్పుకుని, నువ్వు కలిగించిన బాధలో వారు తమ పాపాలను విడిచిపెట్టి తిరిగితే
27 then Thou dost hear in the heavens, and hast forgiven the sin of Thy servants, and of Thy people Israel, because Thou directest them unto the good way in which they walk, and hast given rain on Thy land that Thou hast given to Thy people for an inheritance.
౨౭పరలోకంలో ఉన్న నువ్వు ఆలకించి, నీ సేవకులు, నీ ప్రజలు అయిన ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని క్షమించి, వారు నడవాల్సిన మంచి మార్గం వారికి బోధించి, నువ్వు నీ ప్రజలకి స్వాస్థ్యంగా ఇచ్చిన నీ దేశంలో వర్షం కురిపించు.
28 'Famine, when it is in the land, pestilence, when it is, blasting, and mildew, locust, and caterpillar, when they are, when its enemies have distressed it in the land — its gates, any plague and any sickness;
౨౮దేశంలో కరువు, తెగులు కనబడినప్పుడూ అగ్గి తెగులు, బూజు, తగిలినప్పుడూ మిడతలు, చీడపురుగులు దాడి చేసినప్పుడూ, లేదా శత్రువులు ఇశ్రాయేలు ప్రజల పట్టణాలను ముట్టడించినప్పుడూ అరిష్టం, వ్యాధి సోకినప్పుడూ
29 any prayer, any supplication that is for any man, and for all Thy people Israel, when they know each his own plague, and his own pain, and he hath spread out his hands towards this house:
౨౯ఏ ఒక్కడు గానీ, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులంతా గానీ హృదయంలో బాధ, కష్టం అనుభవిస్తూ ఉండి, ఈ మందిరం వైపు చేతులు చాపి చేసే విజ్ఞాపనలూ ప్రార్థనలూ నీ నివాస స్థలమైన పరలోకం నుండి నువ్వు ఆలకించి వారిని క్షమించు.
30 then Thou dost hear from the heavens, the settled place of Thy dwelling, and hast forgiven, and hast given to each according to all his ways (because Thou knowest his heart, for Thou — Thou only — hast known the heart of the sons of men),
౩౦మా పూర్వీకులకు నీవిచ్చిన ఈ దేశంలో వారు తమ జీవితకాలమంతా నీపట్ల భయభక్తులు కలిగి
31 so that they fear Thee, to walk in Thy ways, all the days that they are living on the face of the ground that Thou hast given to our fathers.
౩౧నీ మార్గాల్లో నడిచేలా వారి హృదయాలను ఎరిగిన నువ్వు వారి ప్రవర్తనకు తగిన ప్రతిఫలం దయచెయ్యి. ఎందుకంటే నీవొక్కడివే మానవుని హృదయాన్ని ఎరిగిన వాడివి.
32 'And also, unto the stranger who is not of Thy people Israel, and he hath come from a land afar off for the sake of Thy great name, and Thy strong hand, and Thy stretched-out arm, and they have come in and prayed towards this house:
౩౨ఇశ్రాయేలీయులనే నీ ప్రజలకు సంబంధం లేని అన్యులు నీ గొప్ప నామం గూర్చీ నీ బాహుబలం గూర్చీ చాచిన నీ చేతులను గూర్చీ విని, దూరదేశం నుండి ఈ మందిరానికి వచ్చి వేడుకుంటే,
33 then Thou dost hear from the heavens, from the settled place of Thy dwelling, and hast done according to all that the stranger calleth unto Thee for: so that all the peoples of the earth do know Thy name, so as to fear Thee, as Thy people Israel, and to know that Thy name is called on this house that I have built.
౩౩నీ నివాసమైన పరలోకం నుండి నువ్వు వారి ప్రార్థన అంగీకరించి, ఆ అన్యులు నిన్ను అడిగిన దాన్ని వారికి అనుగ్రహించు. తద్వారా నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు తెలుసుకున్నట్టుగా ఈ భూప్రజలంతా నీ నామాన్ని తెలుసుకుని, నీలో భయభక్తులు కలిగి, నేను కట్టిన ఈ మందిరానికి నీ నామం పెట్టావని గ్రహిస్తారు.
34 'When Thy people doth go out to battle against its enemies in the way that Thou dost send them, and they have prayed unto Thee the way of this city that Thou hast fixed on, and the house that I have built for Thy name:
౩౪నీ ప్రజలు నువ్వు పంపిన మార్గంలో తమ శత్రువులతో యుద్ధానికి బయలుదేరి, నువ్వు ఏర్పరచుకున్న ఈ పట్టణం వైపూ నీ నామానికి నేను కట్టించిన ఈ మందిరం వైపూ చూసి వేడుకున్నప్పుడు,
35 then Thou hast heard from the heavens their prayer and their supplication, and hast maintained their cause.
౩౫పరలోకం నుండి నువ్వు వారి విన్నపాన్నీ, ప్రార్థననూ ఆలకించి వారి పనుల్లో వారికి సహాయం చెయ్యి.
36 'When they sin against Thee — for there is not a man who sinneth not — and Thou hast been angry with them, and hast given them before an enemy, and taken them captive have their captors, unto a land far off or near;
౩౬పాపం చేయని వాడెవడూ లేడు కాబట్టి వారు నీకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు నువ్వు వారి మీద ఆగ్రహించి, శత్రువుల చేతికి వారిని అప్పగిస్తే, ఆ శత్రువులు వారిని దూరంగా లేక దగ్గరగా ఉన్న తమ దేశాలకు పట్టుకు పోయినప్పుడు,
37 and they have turned [it] back unto their heart in the land whither they have been taken captive, and have turned back, and made supplication unto Thee in the land of their captivity, saying, We have sinned, we have done perversely, and have done wickedly;
౩౭వారు చెరగా వెళ్ళిన ఆ దేశంలో బుద్ధి తెచ్చుకుని పశ్చాత్తాప పడి ‘మేము పాపం చేసి, దోషులమయ్యాం, మేము భక్తిహీనంగా నడిచాం’ అని ఒప్పుకుని
38 yea, they have turned back unto Thee with all their heart, and with all their soul, in the land of their captivity, whither they have taken them captive, and they have prayed the way of their land that Thou hast given to their fathers, and of the city that Thou hast chosen, and of the house that I have built for Thy name:
౩౮తాము చెరలో ఉన్న దేశంలో తమ పూర్ణహృదయంతో పూర్ణాత్మతో నీవైపు తిరిగి, తమ పూర్వీకులకు నీవిచ్చిన తమ దేశం వైపూ నువ్వు కోరుకున్న ఈ పట్టణం వైపూ నీ నామఘనత కోసం నేను కట్టించిన ఈ మందిరం వైపూ మనస్సు తిప్పి వేడుకుంటే
39 then Thou hast heard from the heavens, from the settled place of Thy dwelling, their prayer and their supplications, and hast maintained their cause, and forgiven Thy people who have sinned against Thee.
౩౯నీ నివాసమైన పరలోకం నుండి నువ్వు వారి విన్నపాన్నీ, ప్రార్థననీ ఆలకించి, వారి పని జరిగించి, నీకు వ్యతిరేకంగా పాపం చేసిన నీ ప్రజలను క్షమించు.
40 'Now, my God, let, I beseech Thee, Thine eyes be open, and Thine ears attentive, to the prayer of this place:
౪౦నా దేవా, ఈ స్థలం లో చేసే ప్రార్థనలపై నీ దృష్టి ఉంచు. దాన్ని నీ చెవులు ఆలకించనీ.
41 and now, rise, O Jehovah God, to Thy rest, Thou, and the ark of Thy strength; Thy priests, O Jehovah God, are clothed with salvation, and Thy saints rejoice in the goodness,
౪౧నా దేవా, యెహోవా, శక్తికి ఆధారభూతమైన నీ మందసంతో సహా లేచి రా. నీ విశ్రాంతి స్థలం లో ప్రవేశించు. దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ వస్త్రాలు ధరించుకుంటారు గాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషిస్తారు గాక.
42 O Jehovah God, turn not back the face of Thine anointed, be mindful of the kind acts of David Thy servant.'
౪౨దేవా యెహోవా, నీ చేత అభిషేకం పొందిన వాని నుండి నీ ముఖం తిప్పుకోవద్దు. నీ భక్తుడు దావీదుకు నువ్వు వాగ్దానం చేసిన కృపలను మరచిపోవద్దు.”

< 2 Chronicles 6 >