< Psalms 19 >

1 For the chief musician. A psalm of David. The heavens declare the glory of God, and the skies make his handiwork known!
ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన. ఆకాశాలు దేవుని మహిమను ప్రకటిస్తున్నాయి. గగనం ఆయన చేతి పనిని విశదపరుస్తున్నది!
2 Day after day speech pours out; night after night it reveals knowledge.
రోజు వెంబడి రోజు అది మాట్లాడుతూ ఉంది. రాత్రి వెంబడి రాత్రి జ్ఞానం కనపరుస్తూ ఉంది.
3 There is no speech or spoken words; their voice is not heard.
వాటికి భాష గాని మాటలు గాని లేవు. వాటి స్వరం వినిపించదు.
4 Yet their words go out over all the earth, and their speech to the end of the world. He has pitched a tent for the sun among them.
అయినా వాటి మాటలు భూమి అంతటా వ్యాపించి ఉన్నాయి, వాటి ఉపదేశం భూమి అంచుల వరకూ వెళ్ళింది. వాటిలో ఆయన సూర్యుడికి గుడారం వేశాడు.
5 The sun is like a bridegroom coming out of his chamber and like a strong man who rejoices when he runs his race.
సూర్యుడు తన విడిదిలోనుంచి బయటకు వస్తున్న పెళ్లి కొడుకులాగా, పందెంలో పరిగెత్తడానికి వేగిరపడే దృఢకాయునిలాగా ఉన్నాడు.
6 The sun rises from the one horizon and crosses the sky to the other; nothing escapes its heat.
ఆకాశంలో సూర్యుడు ఈ దిగంశాన ఉదయించి ఆ దిక్కుకు దాటతాడు. దాని వేడిని ఏదీ తప్పించుకోలేదు.
7 The law of Yahweh is perfect, restoring the soul; the testimony of Yahweh is reliable, making the simple wise.
యెహోవా నియమించిన ధర్మశాస్త్రం పరిపూర్ణం, అది ప్రాణం తెప్పరిల్లేలా చేస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగినవి. అవి బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తాయి.
8 The instructions of Yahweh are right, making the heart glad; the commandment of Yahweh is pure, bringing light to the eyes.
యెహోవా ఉపదేశాలు న్యాయమైనవి. అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి. యెహోవా ఏర్పరచిన నిబంధన శాసనాలు స్వచ్ఛమైనవి. అవి కళ్ళను వెలిగిస్తాయి.
9 The fear of Yahweh is pure, enduring forever; the righteous decrees of Yahweh are true and altogether right!
యెహోవా భయం స్వచ్ఛమైనది. అది నిత్యం నిలుస్తుంది. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి పూర్తిగా న్యాయమైనవి.
10 They are of greater value than gold, even more than much fine gold; they are sweeter than honey and the dripping honey from the honeycomb.
౧౦అవి బంగారం కంటే మేలిమి బంగారం కంటే విలువ గలవి. తేనె కంటే, తేనెపట్టు నుండి జాలువారే ధారలకంటే తీయనైనవి.
11 Yes, by them your servant is warned; in obeying them there is great reward.
౧౧వాటివల్ల నీ సేవకుడు హెచ్చరిక పొందుతాడు. వాటికి లోబడినందువల్ల గొప్ప ప్రతిఫలం ఉంటుంది.
12 Who can discern all his own errors? Cleanse me from hidden faults.
౧౨తన పొరపాట్లు తాను తెలుసుకోగలిగే వారెవరు? దాచిన తప్పులనుంచి నన్ను శుద్ధి చెయ్యి.
13 Keep your servant also from arrogant sins; let them not rule over me. Then I will be perfect, and I will be innocent from many transgressions.
౧౩దురహంకార పాపాల్లో పడకుండా నీ సేవకుణ్ణి కాపాడు. అవి నన్ను ఏలకుండా చెయ్యి. అప్పుడు నేను పరిపూర్ణుడిగా ఉంటాను. అనేక అతిక్రమాల విషయం నిర్దోషిగా ఉంటాను.
14 May the words of my mouth and the thoughts of my heart be acceptable in your sight, Yahweh, my rock and my redeemer.
౧౪యెహోవా, నా ఆశ్రయశిలా, నా విమోచకా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారం అవుతాయి గాక.

< Psalms 19 >