< Leviticus 15 >

1 Yahweh spoke to Moses and to Aaron, saying,
యెహోవా మోషే అహరోనులతో మాట్లాడి ఇలా చెప్పాడు.
2 “Speak to the people of Israel, and say to them, 'When any man has an infected fluid that comes out of his body, he becomes unclean.
“మీరు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పండి. ఎవరైనా ఒక వ్యక్తి శరీరంలో ఎక్కడన్నా ఏదన్నా స్రావం జరుగుతుంటే ఆ స్రావం కారణంగా అతడు అశుద్ధుడు అవుతాడు.
3 His uncleanness is due to this infected fluid. Whether his body flows with fluid or is stopped up, it is unclean.
అతని అశుద్ధతకు కారణం రోగ కారకమైన స్రావమే. అతని శరీరంలో ఆ స్రావాలు కారినా, నిలిచి పోయినా అది అశుద్ధమే.
4 Every bed on which he lies will be unclean, and everything on which he sits will be unclean.
అతడు పడుకునే పడకా, కూర్చునే ప్రతిదీ అశుద్ధమే అవుతుంది.
5 Whoever touches his bed must wash his clothes and bathe himself in water, and be unclean until evening.
అతని పడకని తాకే ఎవడైనా తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడు గానే ఉంటాడు.
6 Anyone who sits on anything on which the man with the flow of infected fluid sat, that person must wash his clothes and bathe himself in water, and he will be unclean until evening.
శరీరంలో స్రావం అవుతున్న వాడు కూర్చున్న దానిపై ఎవరైనా కూర్చుంటే అలాంటి వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. వాడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
7 Anyone who touches the body of the one who has a flow of infected fluid must wash his clothes and bathe himself in water, and be unclean until evening.
రోగ కారకమైన స్రావం అవుతున్న వాణ్ణి తాకిన వాడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
8 If the person who has such a flow of fluid spits on someone who is clean, then that person must wash his clothes and bathe himself in water, and he will be unclean until evening.
అలాంటి స్రావం జరిగే వాడు ఎవరైనా శుద్ధుడి పైన ఉమ్మి వేస్తే అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
9 Any saddle which he who has a flow rides upon will be unclean.
స్రావం జరిగేవాడు జీను పై కూర్చుంటే అదీ అశుద్ధం అవుతుంది.
10 Whoever touches anything that was under that person will be unclean until evening, and anyone who carries those things must wash his clothes and bathe himself in water; he will be unclean until evening.
౧౦అతడు కూర్చున్న ఏ వస్తువునైనా తాకితే, ఆ తాకినవాడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు. ఆ వస్తువులను మోసేవాడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
11 Whomever he who has such a flow touches without first having rinsed his hands in water, the person who was touched must wash his clothes and bathe himself in water, and he will be unclean until evening.
౧౧స్రావం జరిగే వాడు నీళ్ళతో చేతులు కడుక్కోకుండా ఎవరినైనా తాకితే అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
12 Any clay pot that the one with such a flow of fluid touches must be broken, and every container of wood must be rinsed in water.
౧౨స్రావం జరిగే వాడు తాకిన మట్టిపాత్రను పగలగొట్టాలి. అది చెక్క పాత్ర అయితే దాన్ని నీళ్ళతో కడగాలి.
13 When he who has a flow is cleansed from his flow, then he must count for himself seven days for his cleansing; then he must wash his clothes and bathe his body in running water. Then he will be clean.
౧౩స్రావం జరిగే వాడు స్రావం మానిన తరువాత శుద్ధుడు కావడానికి ఏడు రోజులు లెక్క పెట్టుకోవాలి. ఆ తరువాత తన బట్టలు ఉతుక్కోవాలి. పారే నీటిలో స్నానం చేయాలి. అప్పుడు అతడు శుద్ధుడు అవుతాడు.
14 On the eighth day he must take two doves or two young pigeons and come before Yahweh at the entrance to the tent of meeting; there he must give the birds to the priest.
౧౪ఎనిమిదో రోజు అతడు రెండు గువ్వలను గానీ రెండు పావురం పిల్లలను గానీ తీసుకుని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర యెహోవా సమక్షంలోకి తీసుకు రావాలి. అక్కడ యాజకుడికి వాటిని ఇవ్వాలి.
15 The priest must offer them, one as a sin offering and the other as a burnt offering, and the priest must make atonement for him before Yahweh for his flow.
౧౫యాజకుడు వాటిలో ఒక దాన్ని పాపం కోసం బలిగా రెండోదాన్ని దహనబలిగా అర్పించాలి. స్రావం జరిగే వాడి విషయంలో యాజకుడు ఇలా యెహోవా సమక్షంలో పరిహారం చేయాలి.
16 If any man has an emission of semen, then he must bathe his whole body in water; he will be unclean until evening.
౧౬ఒక వ్యక్తికి అప్రయత్నంగా వీర్యస్కలనం జరిగితే అతడు నీళ్ళలో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
17 Every garment or leather on which there is semen must be washed with water; it will be unclean until evening.
౧౭అతని వీర్యం ఏదన్నా బట్టలపైనో, తోలు వస్తువు పైనో పడితే ఆ బట్టనీ, తోలునూ నీళ్ళతో ఉతకాలి. అవి సాయంత్రం వరకూ అశుద్ధమై ఉంటాయి.
18 If a woman and a man sleep together and there is a transfer of semen to her, they must both bathe themselves in water; they will be unclean until evening.
౧౮స్త్రీ పురుష సంపర్కంలో వీర్యస్కలనమైతే వాళ్ళిద్దరూ స్నానం చేయాలి. వాళ్ళు సాయంత్రం వరకూ అశుద్ధులుగా ఉంటారు.
19 When a woman menstruates, her impurity will continue for seven days, and whoever touches her will be unclean until evening.
౧౯ఒక స్త్రీ శరీరంలో బహిష్టు సమయంలో రక్తస్రావం జరిగితే ఆమె అశుద్ధత ఏడు రోజులుంటుంది. ఆ సమయంలో ఆమెని తాకిన వాళ్ళు ఆ రోజు సాయంత్రం వరకూ అశుద్ధులుగా ఉంటారు.
20 Everything she lies on during her period will be unclean; everything that she sits on will also be unclean.
౨౦ఆ సమయంలో ఆమె పండుకున్న ప్రతిదీ అశుద్ధంగా ఉంటుంది. ఆమె దేనిపైన కూర్చుంటుందో అది అశుద్ధంగా ఉంటుంది.
21 Whoever touches her bed must wash his clothes and bathe himself in water; that person will be unclean until evening.
౨౧ఆమె మంచాన్ని తాకిన ప్రతి వాడూ తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
22 Whoever touches anything that she sits on must wash his clothes and bathe himself in water; that person will be unclean until evening.
౨౨ఆమె దేనిపైన కూర్చుంటుందో దాన్ని తాకితే అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
23 Whether it is on the bed or on anything on which she sits, if he touches it, that person will be unclean until evening.
౨౩ఆమె మంచాన్నీ లేదా ఆమె కూర్చున్నదాన్నీ తాకితే ఆ వ్యక్తి సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
24 If any man sleeps with her, and if her impure flow touches him, he will be unclean for seven days. Every bed on which he lies will be unclean.
౨౪ఒక వ్యక్తి స్త్రీతో సంభోగించినప్పుడు ఆమె అశుచి అతనికి తగిలితే అతడు ఏడు రోజులు అశుద్ధుడుగా ఉంటాడు. అతడు పండుకునే ప్రతి పడకా అశుద్ధమవుతుంది.
25 If a woman has a flow of blood for many days that is not in the time of her menstruation, or if she has a flow beyond the time of her menstruation, during all the days of the flow of her uncleanness, she will be as if she were in the days of her period. She is unclean.
౨౫ఒక స్త్రీకి తన బహిష్టు సమయంలో కాకుండా అనేకరోజులు రక్త స్రావం జరుగుతూ ఉన్నా, లేదా బహిష్టు సమయం దాటిన తరువాత కూడా స్రావం జరుగుతూనే ఉన్నా స్రావం జరిగినన్ని రోజులూ ఆమెకు బహిష్టు సమయం లానే ఉంటుంది. ఆమె అశుద్ధురాలుగానే ఉంటుంది.
26 Every bed on which she lies all during her flow of blood will be to her just like the bed on which she lies during her menstruation, and everything on which she sits will be unclean, just like the uncleanness of her menstruation.
౨౬ఆమెకు స్రావం జరుగుతున్న రోజులన్నీ ఆమె పండుకునే మంచం ఆమె బహిష్టు సమయంలో పండుకునే మంచం లాగే ఉంటుంది. ఆమె దేని పైన కూర్చుంటుందో ఆమె బహిష్టు సమయంలో జరిగినట్టే అది అశుద్ధం అవుతుంది.
27 Whoever touches any of those things will be unclean; he must wash his clothes and bathe himself in water, and he will be unclean until evening.
౨౭వీటిని ముట్టుకునే వాడు అశుద్ధుడు. అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. నీళ్ళతో స్నానం చేయాలి. అతడు సాయంత్రం వరకూ అశుద్ధుడుగా ఉంటాడు.
28 But if she is cleansed from her flow of blood, then she will count for herself seven days, and after that she will be clean.
౨౮ఆమె స్రావం నిలిచిపోయి ఆమె శుద్ధురాలైతే దానికి ఏడు రోజులు పడుతుంది. ఆమె ఆ ఏడు రోజులను లెక్క పెట్టుకోవాలి. అవి గడచిన తరువాత ఆమె శుద్ధురాలు అవుతుంది.
29 On the eighth day she will take to her two doves or two young pigeons and bring them to the priest at the entrance to the tent of meeting.
౨౯ఎనిమిదో రోజు ఆమె రెండు గువ్వలను గానీ రెండు పావురం పిల్లలను గానీ తీసుకుని ప్రత్యక్ష గుడారం ద్వారంలో యెహోవా సమక్షంలోకి తీసుకు రావాలి. అక్కడ యాజకుడికి వాటిని ఇవ్వాలి.
30 The priest will offer one bird as a sin offering and the other as a burnt offering, and he will make atonement for her before Yahweh for her unclean flow of blood.
౩౦యాజకుడు వాటిలో ఒక దాన్ని పాపం కోసం బలిగా రెండోదాన్ని దహనబలిగా అర్పించాలి. ఆమెకు జరిగిన మలినకరమైన రక్త స్రావం విషయంలో యాజకుడు ఇలా యెహోవా సమక్షంలో పరిహారం చేయాలి.
31 This is how you must separate the people of Israel from their uncleanness, so they will not die due to their uncleanness, by defiling my tabernacle, where I live among them.
౩౧నేను ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసిస్తున్నాను. తమ అశుద్ధతతో వాళ్ళు నా నివాస స్థలాన్ని పాడు చేయకూడదు. వాళ్ళు తమ అశుద్ధతతో నా నివాస స్థలాన్ని పాడు చేసి చనిపోకుండా మీరు వారి అశుద్ధతని వాళ్ళకి దూరం చేయాలి.
32 These are the regulations for anyone who has a flow of fluid, for any man whose semen goes out of him and makes him unclean,
౩౨శరీరంలో స్రావం జరిగే వాణ్ణి గూర్చీ, వీర్యస్కలనమై అశుద్ధుడయ్యే వాణ్ణి గూర్చీ,
33 for any woman who has a menstrual period, for anyone with a flow of fluid, whether male or female, and for any man who sleeps with an unclean woman.'”
౩౩బహిష్టుగా ఉన్న స్త్రీ గూర్చీ, స్రావం జరిగే స్త్రీ పురుషులను గూర్చీ, అశుద్ధంగా ఉన్న స్త్రీతో సంభోగించే వాణ్ని గూర్చీ విధించిన నిబంధనలు ఇవి.”

< Leviticus 15 >