< Esther 9 >

1 Now in the twelfth month, which is the month of Adar, on the thirteenth day, when the king's law and decree were about to be carried out, on the day when the enemies of the Jews hoped to gain power over them, it was reversed. The Jews gained power over those who hated them.
అదారు అనే పన్నెండో నెల పదమూడో తేదీన రాజాజ్ఞ, రాజశాసనం అమలు చేసే సమయం వచ్చింది. శత్రువులు యూదులను లొంగ దీసుకోవాలని ఆలోచించిన రోజున కథ అడ్డం తిరిగింది. తమను ద్వేషించిన వారిపై యూదులు తామే పట్టు బిగించారు.
2 The Jews assembled in their cities throughout all the provinces of King Ahasuerus, to lay hands on those who tried to bring disaster on them. No one could stand against them, for the fear of them had fallen on all the peoples.
యూదులు అహష్వేరోషు పాలనలో ఉన్న సంస్థానాలన్నిటిలో ఉన్న పట్టణాల్లో తమకు కీడు తలపెట్టిన వారిని హతమార్చడానికి సమకూడారు. ఎవరూ వారి ముందు నిలవలేకపోయారు. అన్ని జాతుల ప్రజలకూ వారంటే భయం పట్టుకుంది.
3 All the officials of the provinces, the provincial governors, the governors, and the king's administrators, helped the Jews because the fear of Mordecai had fallen on them.
మొర్దెకైని గూర్చిన భయంతో సంస్థానాధీశులు, అధికారులు, రాచ కార్యాలు చూసుకునే వారు యూదులకు తోడ్పడ్డారు.
4 For Mordecai was great in the king's house, and his fame spread throughout all the provinces, for the man Mordecai was becoming great.
మొర్దెకై, రాజు ఆస్థానంలో గొప్పవాడయ్యాడు. ఈ మొర్దెకై అంతకంతకూ ప్రసిద్ధుడు కావడం వల్ల అతని కీర్తి సంస్థానాలన్నిటిలో వ్యాపించింది.
5 The Jews attacked their enemies with the sword, killing and destroying them, and did as they pleased to those who hated them.
యూదులు తమ శత్రువులందరి పైనా దాడి చేసి కత్తివాత హతమార్చి, నాశనం గావించి తమ ఇష్టం వచ్చినట్టు తమను ద్వేషించిన వారికి చేశారు.
6 In the fortress of Susa itself the Jews killed and destroyed five hundred men.
ఒక్క షూషను కోటలోనే యూదులు 500 మందిని చంపివేశారు.
7 They killed Parshandatha, Dalphon, Aspatha,
హమ్మెదాతా కొడుకు, యూదుల శత్రువు అయిన హామాను పదిమంది కొడుకులు పర్షందాతా,
8 Poratha, Adalia, Aridatha,
దల్పోను, అస్పాతా, పోరాతా,
9 Parmashta, Arisai, Aridai, Vaizatha,
అదల్యా, అరీదాతా, పర్మష్తా,
10 and the ten sons of Haman son of Hammedatha, the enemy of the Jews. But they did not take any plunder.
౧౦అరీసై, అరీదై, వైజాతా, అనే వారిని మట్టుబెట్టారు. అయితే వారు కొల్ల సొమ్ము దోచుకోలేదు.
11 That day the number of those killed in the fortress of Susa, was reported to the king.
౧౧ఆ రోజున షూషను కోటలో హతమైన వారి లెక్క రాజుకు చెప్పారు.
12 The king said to Queen Esther, “The Jews have killed five hundred men in the fortress of Susa, including the ten sons of Haman. What then have they done in the rest of the king's provinces? Now what is your petition? It will be granted you. What is your request? It will be granted to you.”
౧౨రాజు ఎస్తేరు రాణితో “యూదులు షూషను కోటలోనే 500 మందిని, హామాను కొడుకులు 10 మందిని సమూల నాశనం చేశారు. మిగిలిన రాజ సంస్థానాల్లో వారు ఏమి చేసి ఉంటారో. ఇప్పుడు నీ మనవి ఏమిటి? దాని ప్రకారం చేస్తాను. నీవు కోరేది ఏమిటి? అది నీకిస్తాను” అన్నాడు.
13 Esther said, “If it pleases the king, let the Jews who are in Susa be permitted to carry out this day's decree tomorrow also, and let the bodies of Haman's ten sons be hanged on gallows.”
౧౩ఎస్తేరు “రాజైన మీకు సమ్మతమైతే ఈ రోజు జరిగినట్టే షూషనులో ఉన్న యూదులు రేపు కూడా చేయడానికి, హామాను పదిమంది కొడుకుల దేహాలను కొయ్యమీద వేలాడదీయడానికీ అనుమతి ప్రసాదించండి” అంది.
14 So the king commanded that this be done. A decree was issued in Susa, and they hanged the ten sons of Haman.
౧౪“అలా చేయవచ్చు” అని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. షూషనులో ఈ ఆజ్ఞను చాటించారు. హామాను పదిమంది కొడుకులను వేలాడదీశారు.
15 The Jews who were in Susa came together on the fourteenth day of the month of Adar, and killed three hundred more men in Susa, but laid no hands on the plunder.
౧౫అదారు నెల పద్నాలుగో తేదీన షూషనులోని యూదులు సమకూడి పట్టణంలో మూడు వందల మంది పురుషులను చంపేశారు. అయితే వారు దోపుడు సొమ్ము పట్టుకోలేదు.
16 The rest of the Jews who were in the king's provinces came together to defend their lives, and they got relief from their enemies and killed seventy-five thousand of those who hated them, but they did not lay their hands on the valuables of those they killed.
౧౬రాజ సంస్థానాల్లోని తక్కిన యూదులు సమకూడి, తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పూనుకుని అదారు నెల పదమూడో తేదీన తమ విరోధుల్లో 75 వేల మందిని చంపేసి, తమ పగవారి మూలంగా బాధ లేకుండా నెమ్మది పొందారు. అయితే వారు కూడా ఆస్తులు కొల్లగొట్ట లేదు.
17 This happened on the thirteenth day of the month of Adar. On the fourteenth day they rested and made that a day of feasting and gladness.
౧౭ఆదారు నెల పదమూడు, పద్నాలుగు తేదీల నాటికి వారు ఆ పని చాలించి ఆ రోజు విందువినోదాలు చేసుకున్నారు.
18 But the Jews who were in Susa assembled together on the thirteenth and the fourteenth days. On the fifteenth day they rested and made it a day of feasting and gladness.
౧౮షూషనులో ఉన్న యూదులు ఆ నెలలో పదమూడవ, పద్నాలుగవ తేదీల్లో గుంపు గూడారు. పదిహేనో తేదీన వారు విశ్రాంతిగా ఉండి, విందు చేసుకుని సంతోషించారు.
19 That is why the Jews of the villages, who make their homes in the rural towns, observe the fourteenth day of the month of Adar as a day of gladness and feasting, and as a day on which they send gifts of food to one another.
౧౯కాబట్టి పల్లెల్లో కాపురముండి గ్రామీణ ప్రదేశాల్లో ఉండే యూదులు అదారు నెల పద్నాలుగో తేదీన విందు వినోదాల్లో ఉంటూ ఒకరికొకరు ఆహారపదార్థాలు పంపించుకున్నారు.
20 Mordecai recorded these things and sent letters to all the Jews who were in all the provinces of King Ahasuerus, both near and far,
౨౦మొర్దెకై ఈ విషయాల గురించి రాజైన అహష్వేరోషు సంస్థానాలన్నిటికీ దగ్గరలో గానీ, దూరంలో గానీ నివసిస్తున్న యూదులందరికీ ఉత్తరాలు రాసి పంపించాడు.
21 obligating them to keep the fourteenth and the fifteenth day of Adar every year.
౨౧యూదులు ప్రతి సంవత్సరం అదారు నెలలో పద్నాలుగు, పదిహేనవ తేదీల్లో పండగ చేసుకోవాలని నిర్ణయించాడు.
22 These were the days when the Jews got relief from their enemies, and the month when their sorrow turned to joy, and mourning into a day of celebration. They were to make them days of feasting and gladness, and of sending gifts of food to one another, and gifts to the poor.
౨౨తమ శత్రువుల బారి నుండి విడుదల, వారి దుఃఖానికి బదులు సంతోషం వచ్చిన రోజు అదేననీ, విందు వినోదాలు చేసుకుంటూ ఒకరికొకరు కానుకలు పంపుకుని, పేదలకు సహాయం చేయాలని నియమించాడు.
23 So the Jews continued the celebration they had begun, doing what Mordecai had written to them.
౨౩అప్పుడు యూదులు తాము మొదలు పెట్టిన దాన్ని కొనసాగిస్తూ మొర్దెకై తమకు రాసిన ప్రకారం చేస్తామని అంగీకరించారు.
24 At that time Haman son of Hammedatha the Agagite, the enemy of all the Jews, had plotted against the Jews to destroy them, and he threw Pur (that is, he threw lots), to crush and destroy them.
౨౪యూదుల శత్రువు, హమ్మెదాతా కొడుకు, అగగు వంశికుడు అయిన హామాను యూదులను మట్టుబెట్టాలనీ, వారిని చంపి సమూల నాశనం చెయ్యాలనీ పూరు, అంటే చీటి వేయించాడు గదా.
25 But when the matter came before the king, he gave orders by letters that the wicked plan Haman developed against the Jews should come back on his own head, and that he and his sons should be hanged on the gallows.
౨౫అయితే ఈ సంగతి రాజు దృష్టికి వచ్చాక హామాను యూదులకు విరోధంగా చేసిన కుట్రను అతని తల మీదికే వచ్చేలా చేసి, వాడిని, వాడి కొడుకులను ఉరికొయ్య మీద వేలాడ దీసేలా ఆజ్ఞ జారీ చేశాడు.
26 Therefore they called these days Purim, after the name of Pur. Because of everything that was written in this letter, and everything that they had seen and that had happened to them,
౨౬ఆ విధంగా ఆ రోజులకు పూరు అనే మాటనుబట్టి పూరీము అని పేరు వచ్చింది. ఈ ఆజ్ఞలో రాసిన వాటిని బట్టి తాము చూసిన, తమకు దాపురించిన వాటన్నిటిని బట్టి
27 the Jews accepted a new custom and duty. This custom would be for themselves, their descendants, and everyone who joined them. It would be that they would celebrate these two days every year. They would celebrate them in a certain way and at the same time each year.
౨౭యూదులు ఈ రెండు రోజులను గూర్చి ఆజ్ఞ అందినట్టే ఏటేటా నియమించిన రోజుల్లో ఉత్సవం చేసుకుంటామని ఒప్పందం చేసుకున్నారు. ఈ పండగ రోజులను తరతరాలు ప్రతి కుటుంబంలో ప్రతి సంస్థానంలో ప్రతి పట్టణంలో జ్ఞాపకార్థంగా ఆచరిస్తామని నిశ్చయించుకున్నారు.
28 These days were to be celebrated and observed in every generation, every family, every province, and every city. These Jews and their descendants would never cease to faithfully observe these days of Purim, so that they should never forget them.
౨౮పూరీము అనే ఈ పండగని యూదులు తప్పక ఆచరించాలని, తమ సంతానం మర్చిపోకుండేలా దీన్ని కొనసాగించాలని, తామూ, తమ సంతానం నమ్మకంగా దీన్ని పాటించాలని కట్టుబాటు చేసుకున్నారు.
29 Queen Esther daughter of Abihail and Mordecai the Jew wrote with full authority and confirmed this second letter about Purim.
౨౯అప్పుడు పూరీమును గూర్చి రాసిన ఈ రెండో ఆజ్ఞను ధృవీకరించడానికి అబీహాయిలు కుమార్తె, రాణి అయిన ఎస్తేరు, యూదుడైన మొర్దెకై అధికార పూర్వకంగా రాసి పంపారు.
30 Letters were sent to all the Jews in the 127 provinces of the kingdom of Ahasuerus, wishing the Jews safety and truth.
౩౦అహష్వేరోషు సామ్రాజ్యంలోని 127 సంస్థానాల్లోని యూదులందరికీ ఉత్తరాలు వెళ్ళాయి.
31 These letters confirmed the days of Purim at their appointed times, as Mordecai the Jew and Queen Esther obligated the Jews. The Jews accepted this obligation for themselves and their descendants, just as also they accepted times of fasting and lamenting.
౩౧యూదుడైన మొర్దెకై, ఎస్తేరు రాణి పూరీము పండగ రోజులను నిర్ధారిస్తూ ఆ ఉత్తరాలు రాశారు. యూదులంతా తామూ, తమ సంతతీ ఆ విధంగానే ఉపవాస, విలాప దినాలను పాటించే బాధ్యత తీసుకున్నారు.
32 The command of Esther confirmed these regulations regarding Purim, and it was written in the book.
౩౨ఈ విధంగా ఎస్తేరు రాణి ఆజ్ఞ చేత ఈ పూరీము సంప్రదాయాన్ని నిర్ధారించి వాటిని గ్రంథంలో రాశారు.

< Esther 9 >