< Psalms 41 >

1 For the leader; for Jeduthun. A psalm of David. Happy are those who consider the weak; in the day of misfortune the Lord will deliver them.
ప్రధాన సంగీతకారుడి కోసం దావీదు కీర్తన బలహీనులను పట్టించుకునే వాడు ధన్యజీవి. కష్ట సమయంలో యెహోవా అతణ్ణి కాపాడతాడు.
2 He will keep them safe, happy, and long in the land, and not give them up to the rage of their foes.
యెహోవా అతణ్ణి భద్రపరచి సజీవంగా ఉంచుతాడు. భూమి మీద అతణ్ణి ఆశీర్వదిస్తాడు. అతని శత్రువులు కోరుకున్నట్టుగా అతణ్ణి వాళ్ళకి స్వాధీనం చేయడు.
3 The Lord will sustain them on bed of languishing; tending their sickness, as long as they lie.
జబ్బు చేసి పడకపై ఉన్నప్పుడు యెహోవా అతణ్ణి పరామర్శిస్తాడు. వ్యాధి పడకను నువ్వు స్వస్థత పడకగా మారుస్తావు.
4 For this cause I say, ‘Lord, show me your favour; heal me, because I have sinned against you.’
నేనిలా అన్నాను. యెహోవా, నీకు విరోధంగా నేను పాపం చేశాను. నన్ను కనికరించు. నా హృదయాన్ని బాగుచెయ్యి.
5 My enemies speak of me nothing but evil, ‘When will he die, and his name pass away?’
నా శత్రువులు నాకు వ్యతిరేకంగా చెడ్డ మాటలు అంటారు, వాడు ఎప్పుడు చచ్చిపోతాడు? వాడి పేరు ఎప్పుడు మాసిపోతుంది? అంటారు.
6 When one comes to see me, their words ring hollow; their heart keeps gathering mischief the while; and when they go out, they give it speech.
నా శత్రువు నన్ను చూడటానికి వస్తే నా గురించి పనికిమాలిన మాటలు చెప్తాడు. వాడి హృదయం నా నాశనం చూడ్డానికి సిద్ధపడి ఉంటుంది. వాడు బయటకు వెళ్లి ఇతరులకు ఆ సంగతి చెప్తాడు.
7 In secret they whisper together against me, all those who hate me plot evil against me.
నన్ను ద్వేషించే వాళ్ళంతా చేరి నాకు వ్యతిరేకంగా గుసగుసలాడుతూ ఉన్నారు. నాకు గాయం కావాలని వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు.
8 ‘Some fatal disease has fastened upon him; and now that he lies, he will rise up no more.’
ఒక చెడ్డ రోగం వాణ్ణి గట్టిగా పట్టుకుంది. ఇప్పుడు వాడు పడకపై ఉన్నాడు. దానిపైనుంచి వాడిక లేవడు అని చెప్పుకుంటారు.
9 My most trusted friend, on whom I relied, who ate of my bread, has turned against me.
నేను నమ్మిన నా సన్నిహిత మిత్రుడు, నా ఆహారం పంచుకున్నవాడు నన్ను తన్నడానికి కాలు ఎత్తాడు.
10 But do you, Lord, graciously raise me up, that I may pay them their due reward.
౧౦కానీ యెహోవా, వాళ్ళకు బదులు తీర్చడానికై నన్ను కరుణించి పైకి లేపు.
11 By this will I know you delight in me: if my foes may not shout over me in triumph.
౧౧అప్పుడు నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుస్తుంది. నా శత్రువు నాపై విజయం సాధించలేడు.
12 For my innocence you uphold me, and set me forever before your face.
౧౨నా యథార్థతను బట్టి నువ్వు నాకు సహాయం చేస్తావు. నీ సమక్షంలో నన్ను శాశ్వతంగా నిలబెట్టుకుంటావు.
13 Blessed be the Lord, the God of Israel, from everlasting to everlasting, Amen and Amen.
౧౩నిత్యత్వం నుండి నిత్యత్వం వరకూ ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి కలుగు గాక! ఆమేన్‌. ఆమేన్‌.

< Psalms 41 >