< Ephesians 5 >

1 Be therefore imitators of God, as beloved children.
కాబట్టి మీరు దేవుని పిల్లల్లాగా ఆయనను పోలి జీవించండి.
2 Walk in love, even as Christ also loved us and gave himself up for us, an offering and a sacrifice to God for a sweet-smelling fragrance.
క్రీస్తు మనలను ప్రేమించి మనకోసం దేవునికి పరిమళమైన అర్పణగా, తనను తానే బలిగా అప్పగించుకున్నాడు. అలాంటి ప్రేమనే మీరూ కలిగి ఉండండి.
3 But sexual immorality, and all uncleanness or covetousness, let it not even be mentioned among you, as becomes saints;
మీలో వ్యభిచారం, అపవిత్రత, అసూయ, ఇవేవీ ఉండకూడదు. కనీసం మీరు వాటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగిన ప్రవర్తన.
4 nor filthiness, nor foolish talking, nor jesting, which are not appropriate, but rather giving of thanks.
కృతజ్ఞత మాటలే మీ నోటి వెంట రావాలిగానీ అసభ్యమైన మాటలు, మూర్ఖపు మాటలు, రెండు అర్థాలతో కూడిన మాటలు మీరు పలక కూడదు. ఇవి మీకు తగినవి కావు.
5 Know this for sure, that no sexually immoral person, nor unclean person, nor covetous man (who is an idolater), has any inheritance in the Kingdom of Christ and God.
మీకు తెలుసు. వ్యభిచారులూ అపవిత్రులూ అత్యాశపరులూ క్రీస్తుకూ, దేవునికీ చెందిన రాజ్యానికి అర్హులు కారు. అత్యాశాపరులు విగ్రహారాధికులతో సమానం.
6 Let no one deceive you with empty words, for because of these things the wrath of God comes on the children of disobedience.
పనికిమాలిన మాటలు పలికేవారి వల్ల మోసపోకండి. అలాటి వాటివల్ల అవిధేయుల పైకి దేవుని ఉగ్రత వస్తుంది.
7 Therefore do not be partakers with them.
కాబట్టి వారికి దూరంగా ఉండండి.
8 For you were once darkness, but are now light in the Lord. Walk as children of light,
గత కాలంలో మీరు చీకటియై ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రభువులో వెలుగుగా ఉన్నారు. వెలుగు సంబంధుల్లాగా నడుచుకోండి.
9 for the fruit of the Spirit is in all goodness and righteousness and truth,
ఎందుకంటే వెలుగు ఫలం మంచితనం, నీతి, సత్యం.
10 proving what is well pleasing to the Lord.
౧౦కాబట్టి ప్రభువుకు ఇష్టమైనదేదో చూపుతూ,
11 Have no fellowship with the unfruitful deeds of darkness, but rather even reprove them.
౧౧పనికిమాలిన చీకటి పనుల్లో పాల్గొనక, వాటిని ఖండించండి.
12 For it is a shame even to speak of the things which are done by them in secret.
౧౨ఎందుకంటే వారు రహస్యంగా జరిగించే ఆ పనులను గురించి మాటలాడడం కూడా చాలా అవమానకరం.
13 But all things, when they are reproved, are revealed by the light, for everything that reveals is light.
౧౩ప్రతి పనీ వెలుగు చేత బట్టబయలు అవుతుంది. వెలుగు ప్రతిచోటా ప్రకాశిస్తూనే ఉంటుంది కదా?
14 Therefore he says, “Awake, you who sleep, and arise from the dead, and Christ will shine on you.”
౧౪బట్టబయలైన ప్రతిదీ వెలుగే. అందుకే, నిద్రిస్తున్న నువ్వు మేలుకో. చనిపోయిన వారిలో నుండి లే. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు, అని రాసి ఉంది.
15 Therefore watch carefully how you walk, not as unwise, but as wise,
౧౫బుద్ధిహీనుల్లా కాక వివేకంగా జీవించడానికి జాగ్రత్త పడండి.
16 redeeming the time, because the days are evil.
౧౬సమయం సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే రోజులు చెడ్డవి.
17 Therefore, do not be foolish, but understand what the will of the Lord is.
౧౭అందుకే మీరు మూర్ఖంగా ఉండక ప్రభువు సంకల్పమేమిటో తెలుసుకోండి.
18 Do not be drunken with wine, in which is dissipation, but be filled with the Spirit,
౧౮మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే పరిశుద్ధాత్మతో నిండి ఉండండి.
19 speaking to one another in psalms, hymns, and spiritual songs; singing and making melody in your heart to the Lord;
౧౯కీర్తనలతో సంగీతాలతో ఆత్మసంబంధమైన పాటలతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ప్రభువును గూర్చి మీ హృదయాల్లో పాడుతూ కీర్తించండి.
20 giving thanks always concerning all things in the name of our Lord Jesus Christ to God, even the Father;
౨౦ప్రభు యేసు క్రీస్తు నామంలో అన్నిటిని గురించీ తండ్రి అయిన దేవునికి అన్ని పరిస్థితుల్లో కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి.
21 subjecting yourselves to one another in the fear of Christ.
౨౧క్రీస్తుపై ఉన్న భక్తి కొద్దీ ఒకరికొకరు లోబడి ఉండండి.
22 Wives, be subject to your own husbands, as to the Lord.
౨౨స్త్రీలు ప్రభువుకు లోబడినట్టే తమ భర్తలకు లోబడాలి.
23 For the husband is the head of the wife, as Christ also is the head of the assembly, being himself the savior of the body.
౨౩క్రీస్తు సంఘానికి ఏ విధంగా తలగా ఉన్నాడో అలాగే భర్త తన భార్యకు తలగా ఉన్నాడు. క్రీస్తే సంఘమనే శరీరానికి రక్షకుడు.
24 But as the assembly is subject to Christ, so let the wives also be to their own husbands in everything.
౨౪సంఘం క్రీస్తుకు లోబడిన విధంగానే భార్యలు కూడా ప్రతి విషయంలో తమ భర్తలకు లోబడాలి.
25 Husbands, love your wives, even as Christ also loved the assembly and gave himself up for her,
౨౫పురుషులారా, మీరు కూడా సంఘాన్ని క్రీస్తు ప్రేమించిన విధంగానే మీ భార్యలను ప్రేమించాలి.
26 that he might sanctify her, having cleansed her by the washing of water with the word,
౨౬సంఘాన్ని వాక్యమనే నీటి స్నానంతో శుద్ధిచేసి, పవిత్రపరచడానికి,
27 that he might present the assembly to himself gloriously, not having spot or wrinkle or any such thing, but that she should be holy and without defect.
౨౭దాన్ని కళంకంగానీ, మడతలుగానీ అలాటిది మరేదీ లేకుండా పవిత్రంగా నిర్దోషంగా మహిమగలదిగా తన ఎదుట నిలబెట్టుకోవాలని, దానికోసం తనను తాను సమర్పించుకున్నాడు.
28 Even so husbands also ought to love their own wives as their own bodies. He who loves his own wife loves himself.
౨౮అలాగే పురుషులకు కూడా తమ సొంత శరీరాల్లాగానే తమ భార్యలను ప్రేమించవలసిన బాధ్యత ఉంది. తన భార్యను ప్రేమించేవాడు తనను ప్రేమించుకొన్నట్టే.
29 For no man ever hated his own flesh, but nourishes and cherishes it, even as the Lord also does the assembly,
౨౯ఎవడూ తన శరీరాన్ని ద్వేషించడు, ప్రతి ఒక్కడూ దాన్ని పోషించి సంరక్షించుకుంటాడు.
30 because we are members of his body, of his flesh and bones.
౩౦మనం సంఘమనే క్రీస్తు శరీరంలో అవయవాలుగా ఉన్నాం కాబట్టి క్రీస్తు కూడా తన సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు.
31 “For this cause a man will leave his father and mother and will be joined to his wife. Then the two will become one flesh.”
౩౧“ఇందువలన పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఒక్క శరీరమవుతారు”
32 This mystery is great, but I speak concerning Christ and the assembly.
౩౨ఈ మాటల అర్థం గ్రహించడం కష్టం. అయితే నేను క్రీస్తును గూర్చీ సంఘం గూర్చీ చెబుతున్నాను.
33 Nevertheless each of you must also love his own wife even as himself; and let the wife see that she respects her husband.
౩౩చివరిగా నేను చెప్పేది, మీలో ప్రతి పురుషుడూ తనను తాను ఎంత ప్రేమించుకుంటాడో అంతగా తన భార్యను ప్రేమించాలి. అలాగే భార్య తన భర్తను గౌరవించాలి.

< Ephesians 5 >