< 2 Samuel 4 >

1 Da Isjbosjet, Sauls Søn, hørte, at Abner var død i Hebron, tabte han Modet, og hele Israel grebes af Skræk.
హెబ్రోనులో అబ్నేరు చనిపోయాడన్న సంగతి విన్న సౌలు కుమారుడు భయపడ్డాడు. ఇశ్రాయేలు వారందరికీ ఏమీ పాలు పోలేదు.
2 Nu havde Isjbosjet, Sauls Søn, to Mænd, der var Førere for Strejfskarer, den ene hed Ba'ana, den anden Rekab, Sønner af Benjaminiten Rimmon fra Be'erot; thi også Be'erot regnes til Benjamin;
అయితే సౌలు కుమారుడి దగ్గర ఇద్దరు సైన్యాధికారులు ఉన్నారు. ఒకడి పేరు బయనా, రెండవవాడి పేరు రేకాబు. వీరిద్దరూ బెన్యామీను గోత్రానికి చెందిన బెయేరోతు నివాసి అయిన రిమ్మోను కొడుకులు. బెయేరోతు బెన్యామీనీయుల దేశంలో చేరిన ప్రాంతం.
3 dog var Be'erotiterne flygtet til Gittajim, hvor de bor som fremmede den Dag i Dag.
అయితే బెయేరోతీయులు గిత్తయీముకు పారిపోయి ఇప్పటి వరకూ అక్కడే కాపురం ఉన్నారు.
4 Sauls Søn Jonatan havde en Søn, der var lam i Fødderne; han var fem År gammel, da Efterretningen om Saul og Jonatan kom fra Jizre'el, og hans Fostermoder tog ham og flygtede; men under hendes skyndsomme Flugt faldt han fra hende og blev lam; hans Navn var Mefibosjet.
సౌలు కుమారుడు యోనాతానుకు కుంటివాడైన ఒక కొడుకు ఉన్నాడు. యెజ్రెయేలు నుండి సౌలు గురించీ యోనాతాను గురించీ సమాచారం వచ్చినప్పుడు అతడు ఐదేళ్ళ బాలుడు. అతని ఆయా అతణ్ణి ఎత్తుకుని వేగంగా పరుగెత్తినప్పుడు అతడు కింద పడిపోయి కుంటివాడయ్యాడు. అతడి పేరు మెఫీబోషెతు.
5 Be'erotiten Rimmons Sønner Rekab og Ba'ana gav sig på Vej og kom ved Middagstide til Isjbosjets Hus, medens han sov til Middag;
రిమ్మోను కొడుకులు రేకాబు, బయనా ఇద్దరూ మధ్యాహ్న సమయంలో బాగా ఎండగా ఉన్నప్పుడు బయలుదేరి ఇష్బోషెతు మంచంపై పడుకుని నిద్రపోతున్నప్పుడు అతని ఇంటికి వెళ్లారు.
6 og da Dørvogtersken, som var ved at rense Hvede, var faldet i Søvn, slap Rekab og hans Broder Ba'ana forbi
గోదుమలు తీసుకువచ్చేవారి వేషం వేసుకుని ఇంట్లోకి వెళ్లి, ఇష్బోషెతు పడక గదిలో మంచంపై నిద్రపోతూ ఉన్నప్పుడు అతణ్ణి కడుపులో పొడిచి చంపివేసి, అతని తల నరికి దాన్ని తీసుకుని తప్పించుకుని పారిపోయారు.
7 og trængte ind i Huset, hvor Isjbosjet lå på sit Leje i Soveværelset; og de slog ham ihjel og huggede Hovedet af ham; derpå tog de Hovedet og vandrede i Løbet at Natten gennem Arabalavningen
రాత్రి అంతా ఎడారి గుండా పరుగెత్తి హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి ఇష్బోషెతు తల తీసుకువచ్చారు. వారు “దయచేసి విను.
8 og bragte Isjbosjets Hoved til David i Hebron, idet de sagde til Kongen: "Her er Hovedet af Isjbosjet, din Fjende Sauls Søn, han, som stod dig efter Livet; i Dag har HERREN givet min Herre Kongen Hævn over Saul og hans Afkom!"
నీ ప్రాణం తీయాలని చూసిన సౌలు కొడుకు ఇష్బోషెతు తలను మేము తీసుకువచ్చాం. మా యజమాని, రాజువైన నీ తరపున సౌలుకు, అతని సంతానానికి ఈ రోజున యెహోవా ప్రతీకారం చేశాడు” అని చెప్పారు.
9 Da svarede David Be'erotiten Rimmons Sønner Rekab og hans Broder Ba'ana: "Så sandt HERREN lever, som har udfriet mig af al Trængsel:
అప్పుడు దావీదు బెయేరోతీ నివాసి అయిన రిమ్మోను కొడుకులు రేకాబు, బయనాలతో ఇలా చెప్పాడు,
10 Den, som bragte mig Efterretning om Sauls Død, i den Tro at han bragte et Glædesbud, ham greb jeg og lod dræbe i Ziklag for at give ham Løn for hans Glædesbud;
౧౦“మంచి కబురు తెస్తున్నానని భావించి ఒకడు వచ్చి సౌలు చనిపోయాడని తెలియజేశాడు.
11 hvor meget mere skulde jeg da ikke nu, når gudløse Mænd har myrdet en retfærdig Mand på hans Leje i hans eget Hus, kræve hans Blod af eder og udrydde eder af Jorden!"
౧౧వాడు తెచ్చిన కబురుకు బహుమానం ఏమిటంటే నేను వాణ్ణి పట్టుకుని సిక్లగులో చంపించాను. దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంట్లోకి దూరి, ఏ దోషమూ లేని అతణ్ణి మంచంపైనే చంపినప్పుడు మీరు జరిపిన రక్తపాతానికి ప్రతిగా నేను మీకు శిక్ష విధించకుండా ఉంటానా? మిమ్మల్ని లోకంలో లేకుండా తుడిచి పెట్టకుండా ఉంటానా?
12 Derpå bød David sine Folk dræbe dem, og de huggede Hænder og Fødder af dem og hængte dem op ved Dammen i Hebron; men Isjbosjets Hoved tog de og jordede i Abners Grav i Hebron.
౧౨అన్ని విధాలైన ఆపదల నుండి నన్ను రక్షించిన యెహోవాపై ఒట్టు, తప్పకుండా శిక్షిస్తాను” అని చెప్పి, దావీదు తన మనుషులకు ఆజ్ఞ ఇచ్చాడు. వారు ఆ ఇద్దరినీ చంపి వారి చేతులు, కాళ్లను నరికివేసి, వారి శవాలను హెబ్రోను కొలను దగ్గర వేలాడదీశారు. తరువాత వారు ఇష్బోషెతు తలను తీసుకువెళ్లి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టారు.

< 2 Samuel 4 >