< 哥林多后书 1 >

1 本函来自奉上帝旨意成为基督耶稣信徒的保罗,以及我们的教友提摩太兄弟。它将送给哥林多的上帝教会,以及和亚该亚地区的所有上帝子民。
కొరింతులోని దేవుని సంఘానికీ అకయ ప్రాంతమంతటా ఉన్న పరిశుద్ధులందరికీ దేవుని సంకల్పం వలన క్రీస్తు యేసు అపొస్తలుడు అయిన పౌలు, మన సోదరుడు తిమోతి రాస్తున్న విషయాలు.
2 愿你们获得来自天父和主耶稣基督的恩典与平安。
మన తండ్రి అయిన దేవుని నుండీ యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతి కలుగు గాక.
3 赞颂上帝、主耶稣基督的天父。他是充满怜悯的天父,是赐予所有抚慰的上帝。
మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతి కలుగు గాక. ఆయన దయగల తండ్రి, అన్ని విధాలా ఆదరించే దేవుడు.
4 上帝在我们经历的所有苦难中抚慰我们,让我们可以用他所赐的抚慰,抚慰其他置身苦难之人。
ఆయన మా కష్టాలన్నిటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. దేవుడు మాకు చూపిన ఆ ఆదరణ మేమూ చూపి ఎలాంటి కష్టాల్లో ఉన్నవారినైనా ఆదరించగలిగేలా ఆయన మమ్మల్ని ఆదరిస్తున్నాడు.
5 我们越多承受基督所受的痛苦,就会获得更多基督的抚慰。
క్రీస్తు పడిన బాధలు మాలో అధికమయ్యే కొద్దీ, క్రీస్తు ఆదరణ కూడా మాలో అంతకంతకూ అధికం అవుతూ ఉంది.
6 如果我们身处不幸,那是为了能获得抚慰和拯救。如果我们获得抚慰,你也会获得抚慰,让你能够耐心地熬过我们所受的痛苦。
మాకు కష్టాలు వస్తే అవి మీ విమోచన కోసం, మీ ఆదరణ కోసం. మాకు ఆదరణ కలిగితే అది కూడా మీ ఆదరణ కోసమే. మాలాగే మీరూ పడుతున్న కష్టాలను సహించడానికి కావలసిన ఓర్పును ఈ ఆదరణ కలిగిస్తున్నది.
7 我们对你们充满信心,因为我们知道,你们承担了我们受的痛苦,但也必会获得我们的抚慰。
మీరు మా కష్టాలను ఎలా పంచుకుంటున్నారో అలాగే మా ఆదరణ కూడా పంచుకుంటున్నారని మాకు తెలుసు. అందుచేత మీ గురించి మాకు దృఢమైన ఆశాభావం ఉంది.
8 兄弟姐妹们,我们要向你们讲述我们在亚西亚遭受的苦难。那苦难如此强烈,我们甚至担心没有足够的力量继续下去,甚至不知道能否活着结束这一切。
సోదరులారా, ఆసియ ప్రాంతంలో మేము పడిన బాధలు మీకు తెలియకుండా ఉండడం మాకిష్టం లేదు. మేము బతుకుతామనే నమ్మకం లేక, మా శక్తికి మించిన భారంతో పూర్తిగా కుంగిపోయాము.
9 事实上,那就像我们内在已被判处了死刑。但也正因为如此,我们不再仅倚靠自己的力量,而是去相信可以让人死而复生的上帝。
వాస్తవంగా, మాకు మరణదండన విధించినట్టు అనిపించింది. అయితే చనిపోయిన వారిని లేపే దేవుని మీద తప్ప, మా మీద మేము నమ్మకం ఉంచకుండేలా అలా జరిగింది.
10 他将我们从可怕的死亡中拯救出来,他还会再次这样做。我们完全相信上帝会继续拯救我们。
౧౦ఆయన అలాటి భయంకరమైన ఆపద నుండి మమ్మల్నిరక్షించాడు, మళ్లీ రక్షిస్తాడు. ఆయన మీద మా నమ్మకం పెట్టుకున్నాము. మళ్ళీ మళ్ళీ ఆయన మమ్మల్ని తప్పిస్తాడు.
11 请为我们祈祷,这也是对我们的支持。通过这种方式让众人为我们感谢上帝,上帝将会根据众人的祈祷,赐予我们恩典。
౧౧మా కోసం మీరు ప్రార్థన ద్వారా సహాయం చేస్తూ ఉంటే ఆయన దీన్ని చేస్తాడు. చాలామంది ప్రార్థనల వల్ల దేవుడు మమ్మల్ని కనికరించినందుకు ఎంతోమంది మా తరపున కృతజ్ఞత చెబుతారు.
12 我们始终以恰当的方式对待其他人,尤其是你们。我们的良心也证明了这一点,对此我们深感自豪。我们以圣洁和真诚遵循上帝的原则,不是依靠世俗的聪明,而是凭借上帝的恩典。
౧౨మా అతిశయం ఇదే! దీనికి మా మనస్సాక్షి సాక్ష్యం. లౌకిక జ్ఞానంతో కాక దేవుడు ప్రసాదించే సదుద్దేశంతో యథార్థతతో దేవుని కృపనే అనుసరించి, లోకంలో మరి ముఖ్యంగా మీ పట్ల నడుచుకున్నాము.
13 我们不会以复杂的语言撰写任何文字,因为我们希望你们能够读懂和理解。我希望你们最终能够理解,
౧౩మీరు చదివి అర్థం చేసుకోలేని సంగతులేవీ మీకు రాయడం లేదు.
14 即使你们现在并未全部理解,当主降临的时候,你们也会以我们为荣,就像我们也会以你们为荣。
౧౪మీరు ఇప్పటికే కొంతవరకూ మమ్మల్ని అర్థం చేసుకున్నారు. కడవరకూ అర్థం చేసుకుంటారని ఆశాభావంతో ఉన్నాం. మన యేసు ప్రభువు దినాన, మీరు మాకూ, మేము మీకూ గర్వ కారణంగా ఉంటాం.
15 我非常确信你们对我的信念,所以计划首先造访你们,让你们可以再次获得恩惠。
౧౫ఈ నమ్మకంతో నేను మొదట మీ దగ్గరికి రావాలనుకున్నాను. దీనివలన మీకు రెండు సార్లు ప్రయోజనం కలగాలని నా ఉద్దేశం.
16 随后我将去马其顿,再从马其顿返回你们那里,你们将送我去犹太。
౧౬మాసిదోనియకు వెళ్తూ ఉన్నపుడు మిమ్మల్ని కలుసుకుని మాసిదోనియ నుండి మళ్ళీ మీ దగ్గరికి రావాలనీ, తరువాత మీరు నన్ను యూదయకు సాగనంపగలరనీ అనుకున్నాను.
17 我为什么要改变最初的计划?你们是否认为我总是轻易做决定?是否认为我如凡俗之人一般,在计划一切时总是似是而非?
౧౭నేను ఇలా ఆలోచించి చపలచిత్తంగా నడచుకున్నానా? నేను “అవును, అవును” అన్న తరువాత, “కాదు, కాదు” అంటూ లౌక్యంగా ప్రవర్తిస్తున్నానా?
18 上帝是值得信赖的,我们向你们所传之道绝不是似是而非,
౧౮అయితే దేవుడు నమ్మదగినవాడు. మేము, “అవును” అని చెప్పి, “కాదు” అనం.
19 因为我、西拉和提摩太向你们宣扬耶稣基督、上帝之子的真理,不可能似是而非。以基督为名,所有的一切都是绝对的“是。”
౧౯నేనూ, సిల్వానూ, తిమోతీ, మీకు ప్రకటించిన దేవుని కుమారుడు యేసు క్రీస్తు “అవును” అని చెప్పి, “కాదు” అనేవానిగా ఉండలేదు. ఆయన ఎప్పుడూ, “అవును” అనేవానిగానే ఉన్నాడు.
20 对于上帝的所有承诺,基督的回答始终都为“是。”通过耶稣,我们也向上帝的荣耀说“是。”
౨౦దేవుని వాగ్దానాలన్నీ క్రీస్తులో, “అవును” గానే ఉన్నాయి. కాబట్టి దేవుని మహిమ కోసం ఆయన ద్వారా మనం, “ఆమెన్” అంటున్నాం.
21 上帝赐予你我所有人内在的力量,坚定地与基督同在。他已经指认了我们,
౨౧క్రీస్తులో మిమ్మల్నీ మమ్మల్నీ స్థిరపరిచేది దేవుడే. ఆయనే మనలను అభిషేకించి
22 在我们身上盖下批准的印章,这也是圣灵可以说服我们的保证。
౨౨మనం తన వాళ్ళమన్న ముద్ర మనపై వేసాడు, మన హృదయాల్లో తన ఆత్మను హామీగా ఇచ్చాడు.
23 我呼求上帝给我作证,我之所以没有到哥林多,就是为了避免为你们带来苦痛。
౨౩మిమ్మల్ని నొప్పించడం ఇష్టం లేక నేను కొరింతుకు మళ్ళీ రాలేదు. దీనికి దేవుడే నా సాక్షి.
24 我们不希望命令你们与上帝的信仰,而是希望帮助你们获得欢喜的体验,因为你们对上帝的信仰让你们更坚定。
౨౪మీ విశ్వాసం మీద పెత్తనం చెలాయించే ఉద్దేశం మాకు లేదు. మీరు మీ విశ్వాసంలో నిలిచి ఉండగా మీ ఆనందం కోసం మీతో కలిసి పని చేస్తున్నాము.

< 哥林多后书 1 >