< ᎪᎵᏂᏗᏱ ᎠᏁᎯ ᎢᎬᏱᏱ ᎨᎪᏪᎳᏁᎸᎯ 7 >

1 ᎾᏃ ᏨᏓᏍᎩᏲᏪᎳᏁᎸ ᎤᎬᏩᎵ; ᎣᏏᏳ ᎠᏍᎦᏯ ᏄᏃᏟᏍᏔᏅᎾ ᏱᎩ ᎠᎨᏴ.
ఇప్పుడు మీరు నాకు రాసిన వాటి సంగతి. పురుషుడు తన భార్యను ముట్టుకోకుండా ఉండవలసిన సమయాలు కొన్ని ఉన్నాయి.
2 ᎠᏎᏃ ᎤᏕᎸᏛ ᏧᎾᏂᏏᏗᏱ ᏂᎨᏒᎾ ᎢᏳᎵᏍᏙᏗᏱ, ᎠᏂᏏᏴᏫᎭ ᎠᏂᏍᎦᏯ ᏧᎾᏓᎵᎢ ᏚᏂᎧᎮᏍᏗ, ᎠᎴ ᎠᏂᏏᏴᏫᎭ ᎠᏂᎨᏴ ᏗᎬᏩᏂᏰᎯ ᏚᏂᎧᎮᏍᏗ.
అయితే లైంగిక దుర్నీతి క్రియలు జరుగుతున్న కారణం చేత ప్రతి పురుషుడికీ తనకంటూ భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి.
3 ᎠᏍᎦᏯ ᎤᎨᏳᏎᏍᏗ ᎤᏓᎵᎢ ᎾᏍᎩᏯ ᎤᎨᏳᏗ ᎨᏒᎢ; ᎠᎴ ᎾᏍᎩᏯ ᎾᏍᏉ ᎠᎨᏴ ᎤᎨᏳᏎᏍᏗ ᎤᏰᎯ.
భర్త తన భార్య పట్లా, భార్య తన భర్త పట్లా వారి వివాహ ధర్మం నెరవేరుస్తూ ఉండాలి.
4 ᎠᎨᏴ ᎥᏝ ᎠᏓᏅᏖᏍᎬᏉ ᎢᎬᏩᏁᏗ ᏱᎩ ᎤᏩᏒ ᎠᏰᎸᎢ, ᎤᏰᎯᏍᎩᏂ; ᎾᏍᎩᏯ ᎾᏍᏉ ᎠᏍᎦᏯ ᎥᏝ ᎠᏓᏅᏖᏍᎬᏉ ᎢᎬᏩᏁᏗ ᏱᎩ ᎤᏩᏒ ᎠᏰᎸᎢ, ᎤᏓᎵᎢᏍᎩᏂ.
భార్య శరీరం మీద ఆమె భర్తకే గానీ ఆమెకు అధికారం లేదు. అలాగే భర్త శరీరం మీద అతని భార్యకే గానీ అతనికి అధికారం లేదు.
5 ᏞᏍᏗ ᏗᏣᏓᎨᏳᏔᏅᎩ ᎢᏗᏣᏣᏓᏛᏁᏗ ᎨᏒᎢ, ᎬᏂ ᎣᏏᏳ ᏗᏣᏓᏰᎸᎾᏁᎸᎯ ᏱᎩ ᏞᎦ ᎾᏍᎩ ᎢᏣᏛᏁᏗᏱ, ᎾᏍᎩ ᎢᏣᏜᏓᏅᏓᏕᏗᏱ ᎠᎹᏟ ᎢᏨᏗᏱ ᎠᎴ ᎠᏓᏙᎵᏍᏙᏗ ᎨᏒ ᏗᏥᎸᏫᏍᏓᏁᏗᏱ, ᎠᎴ ᏔᎵᏁᏉ ᏙᏣᏓᏩᏗᏍᎨᏍᏗ, ᎾᏍᎩ ᏎᏓᏂ ᎢᏥᎪᎵᏰᏗᏱ ᏂᎨᏒᎾ ᎨᏣᎵᏍᏆᏂᎪᏙᏗ ᏂᎨᏒᎾ ᎨᏒ ᎢᏳᏍᏗ.
ప్రార్థన చేయడానికి వీలు కలిగేలా కొంత కాలం పాటు ఇద్దరి అంగీకారం ఉంటేనే తప్ప వారి మధ్య లైంగిక ఎడబాటు ఉండకూడదు. మీరు ఆత్మ నిగ్రహం కోల్పోయినప్పుడు సాతాను మిమ్మల్ని ప్రేరేపించకుండేలా తిరిగి ఏకం కండి.
6 ᎠᏎᏃ ᎾᏍᎩ ᎯᎠ ᏥᏂᏥᏪᎭ ᎠᎵᏍᎪᎸᏔᏅᎯᏉ ᎾᏍᎩ ᎢᏣᏛᏁᏗᏱ, ᎥᏝᏃ ᎠᏎ ᎾᏍᎩ ᎢᏣᏛᏁᏗᏱ ᎤᎵᏁᏨᎯ ᏱᎩ.
ఇది నా సలహా మాత్రమే, ఆజ్ఞ కాదు.
7 ᎤᏟᏰᏃ ᎬᎩᏰᎸᏗ ᎾᏂᎥᏉ ᏴᏫ ᎠᏴ ᎾᏆᏍᏛ ᎾᏍᎩᏯ ᏱᏄᎾᏍᏗ. ᎠᏎᏃ ᎠᏂᏏᏴᏫᎭ ᎤᎾᏤᎵᎦᏯ ᎤᏁᎳᏅᎯ ᎤᏂᏁᎸ ᎤᏂᎰᎢ, ᎠᏏᏴᏫ ᎯᎠ ᎾᏍᎩ ᏂᎤᏍᏙᎢ, ᏅᏩᏓᎴᏃ ᏅᏩᏓᎴ ᏄᏍᏙᎢ.
ఏది ఏమైనా, మనుషులందరూ నాలాగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ప్రతి ఒక్కడికీ దేవుడు ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. ఒకడికి ఒక వరం, ఇంకొకడికి ఇంకొక వరం ఇచ్చాడు.
8 ᎯᎠ ᎠᏗᎾ ᏂᎦᏥᏪᏎᎭ ᏂᏓᎾᏤᎲᎾ ᎠᎴ ᏧᏃᏑᎶᏨᎯ, ᎣᏏᏳ ᎠᏴ ᎾᏆᏛᏅ ᎾᏍᎩᏉ ᏱᏅᏩᎾᏛᏅ.
నాలాగా ఉండడం వారికి మంచిదని అవివాహితులతో, వితంతువులతో చెబుతున్నాను.
9 ᎠᏎᏃ ᎢᏳᏃ ᏰᎵ ᎾᏍᎩ ᏂᏓᏅᏂᎥᎾ ᏱᎩ, ᏓᎾᏤᎨᏍᏗᏉ; ᎤᏟᏰᏃ ᎣᏏᏳ ᏗᏨᏍᏗᏱ ᎠᏃ ᎦᎴᏴᎯᏍᏗᏱ.
అయితే కోరికలను నిగ్రహించుకోలేకపోతే పెండ్లి చేసుకోవచ్చు. విరహాగ్నితో వేగి పోవడం కంటే పెండ్లి చేసుకోవడం మంచిది.
10 ᏗᎾᏤᎯᏃ ᏕᏥᏁᏤᎭ, ᎥᏝ ᎠᏴᏉ, ᎤᎬᏫᏳᎯᏍᎩᏂ ᏕᎧᏁᏤᎭ, ᏞᏍᏗ ᎠᎨᏴ ᏳᏓᏅᎡᎴᏍᏗ ᎤᏰᎯ;
౧౦ఇక పెళ్ళయిన వారికి నేను కాక, ప్రభువే ఇచ్చే ఆజ్ఞ ఏమంటే, భార్య భర్తకు వేరు కాకూడదు.
11 ᎠᏎᏃ ᎢᏳᏃ ᏳᏓᏅᏒ, ᏅᏩᏛᏁᏍᏗ ᏂᏓᏤᎲᎾ ᎨᏒᎢ, ᎠᎴ ᏙᎯᏉ ᎾᏅᏁᎮᏍᏗ ᎤᏰᎯ; ᎠᎴ ᎠᏍᎦᏯ ᏞᏍᏗ ᎢᏴᏛ ᏱᎦᎧᎲᏍᎨᏍᏗ ᎤᏓᎵᎢ.
౧౧ఒకవేళ వేరైతే మళ్ళీ పెళ్ళి చేసుకోకూడదు. లేదా తన భర్తతో సమాధానపడాలి. అలాగే భర్త తన భార్యను విడిచిపెట్టకూడదు.
12 ᎠᏂᏐᎢᏍᎩᏂ ᎠᏴᏉ ᏕᏥᏁᏤᎭ ᎥᏝᏃ ᎤᎬᏫᏳᎯ; ᎢᏳᏃ ᎩᎶ ᎢᏓᎵᏅᏟ ᎤᏓᎵᎢ ᏳᏪᎧᎭ ᎪᎯᏳᎲᏍᎩ ᏂᎨᏒᎾ, ᎣᏏᏳᏃ ᏯᏰᎸᏍᎦ ᎠᏏᏉ ᎤᎾᏁᎳᏗᏍᏗᏱ, ᏞᏍᏗ ᎢᏴᏛ ᏱᎦᎧᎲᏍᎨᏍᏗ.
౧౨మిగిలిన వారితో ప్రభువు కాక, నేనే చెప్పేదేమంటే, ఒక సోదరునికి అవిశ్వాసి అయిన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయడానికి ఇష్టపడితే, అతడు ఆమెను విడిచిపెట్టకూడదు.
13 ᎠᎴ ᎠᎨᏴ ᎤᏰᎯ ᏰᎭ ᎾᏍᎩ ᏄᏬᎯᏳᏒᎾ, ᎠᎴ ᎣᏏᏳᏉ ᏳᏰᎸᎭ ᎠᏏᏉ ᎤᎾᏁᎳᏗᏍᏗᏱ, ᏞᏍᏗ ᏯᏓᏅᎡᎮᏍᏗ.
౧౩అలాగే, ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త ఉండి, అతడు ఆమెతో కాపురం చేయడానికి తన సమ్మతి తెలిపితే, ఆమె అతణ్ణి విడిచిపెట్టకూడదు.
14 ᏄᏬᎯᏳᏒᎾᏰᏃ ᎠᏍᎦᏯ ᎤᏓᏅᎦᎸᏛ ᎢᎩ ᎤᏓᎵᎢ ᎢᏳᏩᏂᏌᏛ, ᎠᎴ ᏄᏬᎯᏳᏒᎾ ᎠᎨᏴ ᎤᏓᏅᎦᎸᏛ ᎢᎩ ᎤᏰᎯ ᎢᏳᏩᏂᏌᏛ; ᎥᏝᏰᏃ ᎾᏍᎩ, ᎿᎭᏉ ᏗᏤᏥ ᎠᏂᎦᏓᎭ ᏱᎩ; ᎠᏎᏃ ᎪᎯ ᎨᏒ ᎤᎾᏓᏅᎦᎸᏛ ᎢᎩ.
౧౪అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన తన భార్యను బట్టి పవిత్రత పొందుతాడు. అవిశ్వాసి అయిన భార్య విశ్వాసి అయిన తన భర్తను బట్టి పవిత్రత పొందుతుంది. లేకపోతే మీ పిల్లలు అపవిత్రులుగా ఉంటారు. కాని ఇప్పుడు వారు పవిత్రులే.
15 ᎢᏳᏍᎩᏂᏃᏅ ᏄᏬᎯᏳᏒᎾ ᏳᏓᏅᏒ, ᎤᏁᎳᎩ ᎠᏓᏅᏍᎨᏍᏗ. ᎩᎶ ᎢᎩᏅᏟ ᎠᎴ ᎢᎩᏙ, ᎥᏝ ᏳᏚᏓᎶ ᎾᏍᎩ ᏥᏄᏍᏙᎢ. ᎤᏁᎳᏅᎯᏍᎩᏂ ᏅᏩᏙᎯᏯᏛ ᎢᎦᏕᏗᏱ ᎢᎩᏯᏅᎲ.
౧౫అయితే అవిశ్వాసి అయిన భాగస్వామి విడిచి వెళ్ళిపోతానంటే పోనివ్వండి. అప్పుడు సోదరుడైనా సోదరి ఐనా తన పెళ్ళినాటి ప్రమాణాలకు కట్టుబడనవసరం లేదు. శాంతిగా జీవించడానికే దేవుడు మనలను పిలిచాడు.
16 ᎦᏙᏰᏃ ᏗᎦᎵᏍᏙᏗᎭ ᎢᎯᎦᏔᎭ, ᎯᎨᏴ, ᎦᎯᏍᏕᎸᏗ ᏂᎨᏒᎾ ᎨᏒ ᏣᏰᎯ? ᎠᎴ ᎦᏙ ᏗᎦᎵᏍᏙᏗᎭ ᎢᎯᎦᏔᎭ ᎯᏍᎦᏯ ᎦᎯᏍᏕᎸᏗ ᏂᎨᏒᎾ ᎨᏒ ᏣᏓᎵᎢ?
౧౬మహిళా, నీ భర్తను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు? పురుషుడా, నీ భార్యను రక్షణలోకి నడిపిస్తావో లేదో నీకేమి తెలుసు?
17 ᎾᏍᎩᏯᏍᎩᏂ ᎤᏁᎳᏅᎯ ᎠᏂᏏᏴᏫᎭ ᏥᎦᏯᏙᎮᎸ, ᎠᎴ ᎾᏍᎩᏯ ᎤᎬᏫᏳᎯ ᎠᏂᏏᏴᏫᎭ ᏥᏚᏯᏅᎲ, ᎾᏍᎩ ᏄᏍᏕᏍᏗ ᎠᏁᎮᏍᏗ. ᎠᎴ ᎾᏍᎩ ᏄᏍᏗ ᏕᏥᏁᏤᎭ ᏂᎦᏛ ᏚᎾᏓᏡᏩᏗᏒᎢ.
౧౭అయితే ప్రభువు ప్రతివాడికీ ఏ స్థితి నియమించాడో, ఏ స్థితిలో పిలిచాడో, ఆ స్థితిలోనే నడుచుకోవాలి. ఇదే నియమం సంఘాలన్నిటిలో ఏర్పాటు చేస్తున్నాను.
18 ᎢᏳᏃ ᎩᎶ ᎠᏥᎤᏍᏕᏎᎸᎯ ᎠᏥᏯᏂᏍᎨᏍᏗ, ᏞᏍᏗ ᎾᏥᎤᏍᏕᏎᎸᎾ ᏱᏄᎵᏍᏔᏁᏍᏗ. ᎢᏳᏃ ᎩᎶ ᎠᏥᎤᏍᏕᏎᎸᎯ ᏂᎨᏒᎾ ᎨᏒ ᎠᏥᏯᏂᏍᎨᏍᏗ, ᏞᏍᏗ ᏯᏥᎤᏍᏕᏎᎴᏍᏗ.
౧౮ఎవరినైనా దేవుడు విశ్వాసంలోకి పిలిచినప్పుడు అతడు సున్నతి పొంది ఉన్నాడా? అతడు ఆ సున్నతి గుర్తులు పోగొట్టుకోనక్కర లేదు. ఒకవేళ సున్నతి పొందనివాడు విశ్వాసంలోకి వచ్చాడా? అతడు సున్నతి పొందనక్కర లేదు.
19 ᎠᎱᏍᏕᏍᏗ ᎨᏒ ᎥᏝ ᎪᎱᏍᏗ ᎬᏙᏗ ᏱᎩ; ᎠᎴ ᎾᎱᏍᏕᏒᎾ ᎨᏒ ᎥᏝ ᎪᎱᏍᏗ ᎬᏙᏗ ᏱᎩ, ᏗᏍᏆᏂᎪᏙᏗᏱᏍᎩᏂ ᏗᎧᎿᎭᏩᏛᏍᏗ ᎤᏁᎳᏅᎯ ᏧᏤᎵᎦ.
౧౯దేవుని ఆజ్ఞలను పాటించడమే ముఖ్యం గానీ సున్నతి పొందడంలో గానీ, పొందక పోవటంలో గానీ ఏమీ లేదు,
20 ᎾᏂᎥᎩᎶ ᏄᏛᏅᏉ ᎠᏥᏯᏅᎲ ᎾᎿᎭᏉ ᏅᏩᏛᏁᏍᏗ.
౨౦ఎవరు ఏ స్థితిలో ఉండగా పిలుపు పొందారో ఆ స్థితిలోనే ఉండాలి.
21 ᎡᏣᏯᏅᎲᏍᎪ ᎡᏣᎾᏝᎢ ᎨᏒᎢ? ᎤᏁᎳᎩ; ᎢᏳᏍᎩᏂᏃᏅ ᏁᏣᎾᏝᎥᎾ ᎢᎬᏩᎵᏍᏙᏗ ᏱᎩ, ᎾᏍᎩ ᎯᎬᏫᏳᏔᏅᎭ.
౨౧దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీవు బానిసగా ఉన్నావా? దాని గురించి చింతించవద్దు. అయితే నీకు స్వేచ్ఛ పొందడానికి శక్తి ఉంటే స్వేచ్ఛ పొందడమే మంచిది.
22 ᎤᎬᏫᏳᎯᏰᏃ ᎤᏯᏅᏛ ᎾᏍᎩ ᎠᏥᎾᏝᎢ ᎨᏒᎢ, ᎾᏍᎩ ᎤᎬᏫᏳᎯ ᎤᏤᎵᎦ ᎾᏥᎾᏝᎥᎾ; ᎾᏍᎩᏯᏃ ᎾᏍᏉ ᎠᏥᏯᏅᏛ ᎾᏥᎾᏝᎥᎾ ᎨᏒᎢ, ᎾᏍᎩ ᎦᎶᏁᏛ ᎤᎾᏝᎢ.
౨౨ప్రభువు పిలిచిన బానిస ప్రభువు వలన స్వతంత్రుడు. అదే విధంగా స్వతంత్రుడుగా ఉండి పిలుపు పొందిన వాడు క్రీస్తుకు బానిస.
23 ᏧᎬᏩᎶᏗ ᎡᏥᏩᎯᏍᏔᏅᎯ; ᏞᏍᏗ ᏴᏫᏉ ᏗᎨᏥᎾᏝᎢ ᏱᎨᏎᏍᏗ.
౨౩ప్రభువు మిమ్మల్ని వెల చెల్లించి కొన్నాడు కాబట్టి మనుషులకు దాసులు కావద్దు.
24 ᎢᏓᎵᏅᏟ ᎾᏂᎥ ᎩᎶ ᏄᏛᏅᏉ ᎠᏥᏯᏅᎲ, ᎾᎿᎭᏅᏩᏛᏁᏍᏗ ᎤᏁᎳᏅᎯ ᏓᎧᎿᎭᏩᏗᏒᎢ.
౨౪సోదరులారా, మనలో ప్రతి ఒక్కరినీ ఏ స్థితిలో ఉండగా పిలిచాడో ఆ స్థితిలోనే దేవునితో నిలిచి ఉందాం.
25 ᎾᏃ ᏂᏓᎾᏤᎲᎾ ᎤᎬᏩᎵ ᎨᏒᎢ, ᎥᏝ ᎤᎬᏫᏳᎯ ᎤᏁᏨᎯ ᏯᎩᎭ; ᎠᏎᏃ ᎣᏏᏳ ᎬᏰᎸᏗ ᎨᏒ ᎬᏂᎨᏒ ᏂᎬᏁᎭ, ᎾᏍᎩ ᎤᎬᏫᏳᎯ ᎠᎩᏙᎵᏨᎯ ᏥᎩ ᏚᏳᎪᏛ ᎢᎦᏛᏁᎯ ᎢᏯᏆᎵᏍᏙᏗᏱ.
౨౫పెళ్లి కానివారి విషయంలో ప్రభువు నుండి నాకు ఆదేశమేదీ లేదు గానీ ప్రభువు కృప చేత నమ్మదగిన వాడుగా ఉన్న నేను నా భావం చెబుతున్నాను.
26 ᎾᏍᎩᏃ ᎦᏓᏅᏖᏍᎬ ᎤᏟ ᎣᏏᏳ ᎾᏍᎩ ᎯᎠ ᎪᎯ ᎨᏒ ᎠᎩᎵᏯ ᏤᎭ; ᎾᏍᎩ ᎤᏟ ᎣᏏᏳ ᎯᎠ ᎾᏍᎩ ᏱᏄᏍᏗ ᏴᏫ ᎡᎲᎢ.
౨౬కాబట్టి ఇప్పుడున్న కష్ట పరిస్థితిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఉండడం మేలని నా ఉద్దేశం.
27 ᎠᎨᏴᏍᎪ ᏕᏍᏓᏚᏓᏔ? ᏞᏍᏗ ᏗᏍᏓᏚᏓᏕᏍᏗᏱ ᏣᏲᎸᎩ. ᎠᎨᏴᏍᎪ ᏂᏗᏍᏓᏚᏓᏛᎾ? ᏞᏍᏗ ᏣᏲᎸ ᏣᏓᎵᎢ.
౨౭వివాహ వ్యవస్థలో భార్యకు కట్టుబడి ఉన్నావా? వేరు కావాలనుకోవద్దు. భార్య లేకుండా స్వేచ్ఛగా, లేక అవివాహితుడుగా ఉన్నావా? భార్య కావాలని కోరవద్దు.
28 ᎢᏳᏍᎩᏂ ᏱᏣᏕᏒᎾ ᎥᏝ ᏱᎦᎯᏍᎦᏅᎦ; ᎢᏳ ᎠᎴ ᎠᏛ ᏱᏚᏤᏅ ᎥᏝ ᏱᎬᏍᎦᏅᎦ. ᎠᏎᏃ ᎾᏍᎩ ᎢᏳᎾᏍᏗ ᎤᏂᎩᎵᏲᎢᏍᏗ ᎨᏎᏍᏗ ᎤᏇᏓᎵ ᎨᏒᎢ. ᎠᏎᏃ ᎤᏁᎳᎩᏉ ᎢᏨᏰᎵᏎᎭ.
౨౮ఒకవేళ నీవు పెళ్ళి చేసుకున్నా పాపమేమీ చేసినట్టు కాదు. అవివాహిత పెళ్ళి చేసుకున్నా ఆమె పాపమేమీ చేసినట్టు కాదు. అయితే అలాటి వారికి దైనందిన కష్టాలు కలుగుతాయి. అవి మీకు కలగకుండా ఉండాలని నా కోరిక.
29 ᎯᎠᏍᎩᏂ ᏂᏥᏪᎭ, ᎢᏓᎵᏅᏟ, ᎪᎯ ᎨᏒ ᎤᏍᏆᎳᎯᏳ; ᎯᎠᏉᏃ ᏄᏍᏗ ᎠᎵᏃᎯᏯᎭ, ᎾᏍᎩ ᏧᎾᏓᎵ ᏥᎩ, ᏧᎾᏓᎵᏉ ᏂᎨᏒᎾ ᏥᎨᏐ ᎢᏳᏍᏗ ᎨᏎᏍᏗ,
౨౯సోదరులారా, నేను చెప్పేదేమంటే, సమయం కొద్దిగానే ఉంది కాబట్టి ఇక ముందు భార్యలు గలవారు భార్యలు లేనట్టుగా ఉండాలి.
30 ᎾᏃ ᏗᎾᏠᏱᎯ ᏥᎩ, ᏂᏓᎾᏠᏱᎲᎾᏉ ᎢᏳᏍᏗ ᎨᏎᏍᏗ; ᎾᎿᎭᎠᎾᎵᎮᎵᎩ ᏥᎩ, ᎾᎾᎵᎮᎵᎬᎾᏉ ᎢᏳᏍᏗ ᎨᏎᏍᏗ; ᎾᏃ ᎤᏂᏩᏍᎩ ᏥᎩ, ᏄᏂᎲᎾᏉ ᎢᏳᏍᏗ ᎨᏎᏍᏗ;
౩౦ఏడ్చేవారు ఏడవనట్టు, సంతోషించేవారు సంతోషించనట్టు ఉండాలి. కొనేవారు తాము కొన్నది తమది కానట్టు ఉండాలి.
31 ᎾᏃ ᎾᏍᎩ ᎯᎠ ᎡᎶᎯ ᎪᎱᏍᏗ ᎠᏅᏗᏍᎩ ᏞᏍᏗ ᎤᏣᏘᏂᏉ ᏱᎾᏅᏁᏗᏍᎨᏍᏗ; ᎯᎠᏰᏃ ᎡᎶᎯ ᏄᏍᏛ ᎦᎶᏐᎲᏍᎦᏉ.
౩౧ఈ లోక వ్యవహారాలు సాగించేవారు లోకంతో తమకేమీ సంబంధం లేనట్టు ఉండాలి. ఎందుకంటే ఈ లోక వ్యవస్థ గతించిపోతూ ఉంది.
32 ᎠᏗᎾ ᎠᏆᏚᎵᎭ ᏂᏤᎵᎯᏍᎬᎾᏉ ᎢᏣᎵᏍᏙᏗᏱ. ᎾᏍᎩ Ꮎ ᏄᏓᎸᎾ ᎠᏓᏅᏖᏍᎪ ᎤᎬᏫᏳᎯ ᎤᏤᎵᎦ ᎨᏒᎢ, ᎢᏳᏛᏁᏗᏱ ᎤᎬᏫᏳᎯ ᎣᏍᏛ ᎤᏰᎸᏗ ᏧᎸᏫᏍᏓᏁᏗᏱ.
౩౨మీరు చింతలు లేకుండా ఉండాలని నా కోరిక. పెళ్ళి కానివాడు ప్రభువును ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఆయన విషయాల్లో శ్రద్ధ కలిగి ఉంటాడు.
33 Ꮎ-ᏍᎩᏂ ᎤᏓᎵ ᎠᏓᏅᏖᏍᎪ ᏧᏓᎴᏅᏛ ᎡᎶᎯ ᎡᎯ, ᎢᏳᏛᏁᏗᏱ ᎤᏓᎵᎢ ᎣᏍᏛ ᎤᏰᎸᏗ ᏧᎸᏫᏍᏓᏁᏗᏱ.
౩౩పెళ్ళయిన వాడు తన భార్యను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోకవిషయాల గురించి శ్రద్ధ కలిగి ఉంటాడు.
34 ᏚᎾᏓᎴᎿᎭᎠ ᎾᏍᏉ ᎠᏥᏰᎯ ᎠᎨᏴ ᎠᏃ ᎾᏥᏰᎲᎾ. ᎾᏥᏰᎲᎾ ᎠᎨᏴ ᎠᏓᏅᏖᏍᎪ ᏧᏓᎴᏅᏛ ᎤᎬᏫᏳᎯ ᎤᏤᎵᎦ, ᎾᏍᎩ ᎾᏍᎦᏅᎾ ᎢᏳᎵᏍᏙᏗᏱ ᎠᏰᎵ ᎨᏒ ᎠᎴ ᎤᏓᏅᏙᎩᎯ ᎨᏒᎢ; Ꮎ-ᏍᎩᏂ ᎠᏥᏰᎯ ᎠᏓᏅᏖᏍᎪ ᏧᏓᎴᏅᏛ ᎡᎶᎯ ᎡᎯ, ᎢᏳᏛᏁᏗᏱ ᎤᏰᎯ ᎣᏍᏛ ᎤᏰᎸᏗ ᏧᎸᏫᏍᏓᏁᏗᏱ.
౩౪అందువల్ల అతని మనస్సు రెండు రకాలుగా పని చేస్తూ ఉంటుంది. అదే విధంగా పెళ్ళయిన స్త్రీకీ, పెళ్ళికాని స్త్రీకీ తేడా ఉంది. కన్య శరీరంలో ఆత్మలో పవిత్రత కలిగి ఉండాలని ప్రభువు కార్యాలను గూర్చి శ్రద్ధ కలిగి ఉంటుంది. పెళ్ళైన స్త్రీ అయితే తన భర్తను ఏ విధంగా సంతోషపెట్టాలా అని ఈ లోక సంబంధమైన విషయాలపై శ్రద్ధ కలిగి ఉంటుంది.
35 ᎠᎴ ᎯᎠ ᎾᏍᎩ ᏂᏥᏪᎭ ᎢᏨᏒ ᎣᏍᏛ ᎢᏣᎵᏍᏓᏁᏗ ᎠᏆᏑᎵᏍᎬᎢ; ᎥᏝ ᎢᏨᏌᏛᎥᏍᎬᏉ ᏱᎩ, ᎣᏏᏳᏍᎩᏂ ᎠᏰᎸᏗ ᎨᏒ [ ᎢᏣᏛᏁᏗᏱ, ] ᎠᎴ ᎾᏍᎩ ᎤᎬᏫᏳᎯ ᏤᏥᎧᎿᎭᏩᏗᏓᏍᏗᏱ ᎪᎱᏍᏗ ᏂᏥᏲᏍᏙᏓᏁᎲᎾ.
౩౫మీకు ఆటంకంగా ఉండాలని కాదు, మీ మంచి కోసమే చెబుతున్నాను. మీరు మంచి నడవడితో, ఇతర ధ్యాసలేమీ లేకుండా ప్రభువుపై దృష్టి ఉంచి ఆయన సేవ చేయాలని నా ఆశ.
36 ᎢᏳᏍᎩᏂᏃᏅ ᎩᎶ ᎤᏣᏘᏂ ᎠᏰᎸᏗ ᏂᏥᏯᏛᏁᎭ ᎠᏆᏤᎵ ᎠᏛ ᎢᎡᎵᏍᎨᏍᏗ, ᎢᎦᎶᏍᎨᏍᏗ ᏰᎵᎦᏯ ᎢᏳᏕᏘᏴᏛ ᎨᏒᎢ, ᎠᎴ ᎠᏎ ᎾᏍᎩ ᎢᏳᎵᏍᏙᏗ ᎢᎨᏎᏍᏗ, ᎤᏚᎵᏍᎬᏉ ᎾᏛᏁᎮᏍᏗ, ᎥᏝ ᏱᎬᏍᎦᏅᎨᏍᏗ; ᏓᎾᏤᎨᏍᏗᏉ.
౩౬ఒకడు తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకోకుండా ఉండటం అక్రమమని భావిస్తే, లేక ఆమెకు వయస్సు పెరిగిపోవటం వల్ల పెళ్ళి చేసుకోవటం అవసరమని భావిస్తే, అతడు తన ఇష్ట ప్రకారం చేయవచ్చు. అతడు ఆమెను పెళ్ళి చేసుకోవచ్చు. అది పాపం కాదు.
37 ᎩᎶᏍᎩᏂ ᎤᎵᏂᎩᏛᏯ ᏚᏭᎪᏕᏍᏗ ᏧᏓᏅᏛᎢ, ᎠᏎ ᎾᏍᎩ ᎢᏳᏛᏁᏗᏱ ᏄᎵᏍᏓᏁᎲᎾ ᎢᎨᏎᏍᏗ, ᎾᏍᎩ ᏰᎵᏉ ᎠᏓᏅᏖᏍᎬ ᎢᎬᏩᏛᏁᏗ ᎨᏒᎢ, ᎠᎴ ᎾᏍᎩ ᎢᏳᏛᏁᏗᏱ ᏚᏭᎪᏔᏁᏍᏗ ᏧᏓᏅᏛᎢ, ᎾᏍᎩ ᎤᏍᏆᏂᎪᏙᏗᏱᏉ ᎤᏤᎵ ᎠᏛ, ᎾᏍᎩ ᎣᏏᏳ ᎾᏛᏁᎮᏍᏗ.
౩౭అయితే ఎవరైనా పెళ్ళి చేసుకోనని హృదయంలో నిశ్చయించుకుని, దానికి తగిన మనోబలం ఉండి, తన కోరికలను అదుపులో ఉంచుకునే శక్తి గలవాడయితే అతడు చేసేది మంచి పని.
38 ᎾᏍᎩᏃ Ꮎ ᎤᏤᎵ ᎠᏛ ᏧᏲᏍᎩ ᏧᏨᏍᏗᏱ ᎣᏏᏳ ᎾᏛᏁᎮᏍᏗ; ᎾᏍᎩᏍᎩᏂ Ꮎ ᏧᏲᏍᎩ ᏂᎨᏒᎾ ᏧᏨᏍᏗᏱ ᎤᏟ ᎣᏏᏳ ᎾᏛᏁᎮᏍᏗ.
౩౮కనుక తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకొన్నవాడు మంచి పని చేస్తున్నాడు. కాని పెళ్ళి చేసుకోనివాడు ఇంకా మంచి పని చేస్తున్నాడు.
39 ᎠᎨᏴ ᏗᏤᎯ ᏗᎧᎿᎭᏩᏛᏍᏗ ᎤᏚᏓᎸᏙ ᎤᏰᎯ ᎠᎴᏂᏙᎲ ᎢᎪᎯᏛ; ᎤᏰᎯᏍᎩᏂ ᎤᏲᎱᏒᎯ ᏱᎩ, ᎿᎭᏉ ᎤᏚᏓᎴᏛ, ᎾᏍᎩᏃ ᏗᎬᏩᏨᏍᏗᏉ ᎩᎶᏉ ᎤᏚᎵᏍᎬᎢ; ᎤᎬᏫᏳᎯ ᎪᎩᏳᎲᏍᎩ ᎤᏩᏒ.
౩౯భార్య తన భర్త బతికి ఉన్నంత వరకూ అతనికి కట్టుబడి ఉండాలి. భర్త మరణిస్తే తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్ళి చేసుకోడానికి ఆమెకు స్వేచ్ఛ ఉంటుంది. అయితే ఆమె విశ్వాసిని మాత్రమే చేసుకోవాలి.
40 ᎠᏎᏃ, ᎠᏴ ᎦᏓᏅᏖᏍᎬ, ᎤᏟ ᎢᎦᎢ ᏅᏩᏙᎯᏯᏛ ᏳᏓᏅᏔ, ᏱᏅᏩᏍᏗᏉ ᎡᎲᎢ; ᎠᎴ ᎦᏓᏅᏖᏍᎬ ᎠᏴ ᎾᏍᏉ ᎤᏁᎳᏅᎯ ᎤᏓᏅᏙ ᎠᏇᎭ.
౪౦అయితే ఆమె ఉన్న రీతిగా ఉండిపోతే మరింత శ్రేష్ఠమని నా అభిప్రాయం. ఈ విషయంలో దేవుని ఆత్మ నాతో ఉన్నాడని నా నమ్మకం.

< ᎪᎵᏂᏗᏱ ᎠᏁᎯ ᎢᎬᏱᏱ ᎨᎪᏪᎳᏁᎸᎯ 7 >