< 2 Летописи 29 >

1 Езекия беше двадесет и пет години на възраст когато се възцари, и царува двадесет и девет години в Ерусалим; а името на майка му беше Авия, Захариева дъщеря.
హిజ్కియా పరిపాలించడం మొదలుపెట్టినప్పుడు అతని వయసు 25 సంవత్సరాలు. అతడు 29 ఏళ్ళు యెరూషలేములో పాలించాడు. అతని తల్లి జెకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా.
2 Той върши това, което бе право пред Господа, напълно както извърши баща му Давид.
అతడు తన పూర్వీకుడు దావీదు చేసిన ప్రకారం యెహోవా దృష్టికి యధార్థంగా ప్రవర్తించాడు.
3 В първия месец от първата година на царуването си той отвори вратата на Господния дом и ги поправи.
అతడు తన పరిపాలనలో మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరం తలుపులు తెరిచి వాటిని బాగుచేసి,
4 И като доведе свещениците и левитите, събра ги на източния площад и рече им:
యాజకులనూ లేవీయులనూ పిలిపించి, తూర్పువైపున రాజవీధిలో వారిని సమకూర్చి
5 Слушайте ме, левити, осветете се сега, осветете и храма на Господа Бога на бащите си, и изнесете нечистотата от светото място.
వారికిలా ఆజ్ఞాపించాడు. “లేవీయులారా, నా మాట వినండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని, మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలం నుంచి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి తీసికెళ్ళండి.”
6 Защото бащите ни са отстъпили, сторили са зло пред Господа нашия Бог, оставили са Го и са отвърнали лицата си от Господното обиталище, и са обърнали гръб;
“మన పూర్వీకులు అవిధేయులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడచి ఆయన్ని విసర్జించి, ఆయన నివాస స్థలం వైపు నుంచి ముఖం తిప్పుకుని నిర్లక్ష్యం చేశారు.
7 те са затворили вратите на предхрамието и са изгасили светилниците, а не са кадили темян нито пренасяли всеизгаряния в светото място на Израилевия Бог.
వారు వసారా తలుపులు మూసివేశారు. దీపాలు ఆర్పివేశారు. పరిశుద్ధ స్థలం లో ఇశ్రాయేలీయుల దేవునికి ధూపం వేయలేదు. దహనబలులు అర్పించలేదు.
8 Затова гняв от Господа е бил върху Юда и Ерусалим, и Той ги предаде да бъдат тласкани, и да бъдат предмет на учудване и на съскане, както виждате с очите си.
అందుచేత యెహోవా ఉగ్రత యూదామీదా, యెరూషలేము మీదా పడింది. మీరు కన్నులారా చూస్తున్నట్టు ఆయన వారిని భీతికీ భయానికీ నిందకూ గురి చేశాడు.
9 Защото, ето, бащите ни са паднали от нож, а синовете ни, дъщерите ни и жените ни са поради това в плен.
అందుకే మన తండ్రులు కత్తి చేత కూలారు, మన కొడుకులూ కూతుళ్ళూ భార్యలూ బందీలయ్యారు.
10 Сега, прочее, имам сърдечно желание да направим завет с Господа Израилевия Бог, за да отвърне от нас яростния Си гняв.
౧౦ఇప్పుడు మనమీదున్న ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారేలా ఆయనతో మనం నిబంధన చేయాలని ఉద్దేశించాను.
11 Чада мои, не бивайте сега небрежни; защото вас е избрал Господ да стоите пред Него, да му служите, да сте пред Него, да му служите, да сте Му служители и да кадите.
౧౧నా కుమారులారా, ఆయనకు పరిచారకులై ఉండి ధూపం వేయడానికీ ఆయన ఎదుట నిలబడి సేవచేయడానికీ యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ సమయంలో మీరు అశ్రద్ధ చేయవద్దు.”
12 Тогава станаха левитите: Маат Амасаевият син и Иоил Азариевият син, от Каатовите потомци; а от Мерариевите потомци, Кис Авдиевият син и Азария Ялелеиловият син; от Герсоновците, Иоах Земовият син и Един Иоаховият син;
౧౨అప్పుడు లేవీయులు పనికి సిద్ధపడ్డారు. వారెవరంటే కహాతీయుల్లో అమాశై కొడుకు మహతు, అజర్యా కొడుకు యోవేలు, మెరారీయుల్లో అబ్దీ కొడుకు కీషు, యెహల్లెలేలు కొడుకు అజర్యా, గెర్షోనీయుల్లో జిమ్మా కొడుకు యోవాహు, యోవాహు కొడుకు ఏదెను,
13 от Елисафановите потомци, Симрий и Еиил; от Асафовите потомци, Захария и Матания;
౧౩ఎలీషాపాను సంతానంలో షిమ్రీ, యెహీయేలు, ఆసాపు సంతానంలో జెకర్యా, మత్తన్యా
14 от Емановите потомци, Ехиил и Семей; а от Едутуновие потомци, Семаия и Озиил;
౧౪హేమాను సంతానంలో యెహీయేలు, షిమీ, యెదూతూను సంతానంలో షెమయా, ఉజ్జీయేలు.
15 и те, като събраха братята си та се осветиха, влязоха според царската заповед, съгласно Господното слово, да очистят Господния дом.
౧౫వీరు తమ సోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకుని యెహోవా మాటలనుబట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యెహోవా మందిరాన్ని బాగు చేయడానికి వచ్చారు.
16 Свещениците влязоха в по-вътрешната част на Господния дом, за да я очистят, и изнесоха в двора на Господния дим всичката нечистота, която намериха в Господния храм; а левитите взеха та я изнесоха вън в потока Кедрон.
౧౬బాగు చేయడానికి యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగానికి పోయి యెహోవా మందిరంలో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరం ఆవరణంలోకి తీసుకు వచ్చారు. లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేశారు.
17 На първия ден от първия месец почнаха да освещават, а на осмия ден от месеца стигнаха до Господния трем; и за осем дни осветиха Господния дом, и на шестнадесетия ден от първия месец свършиха.
౧౭మొదటి నెల మొదటి రోజు వారు శుద్ధి చేయడం మొదలు పెట్టి, ఆ నెల ఎనిమిదవ రోజున యెహోవా వసారా వరకూ వచ్చారు. వారు మరో ఎనిమిది రోజులు యెహోవా మందిరాన్ని శుద్ధి చేస్తూ మొదటి నెల 16 వ రోజున పని ముగించారు.
18 Тогава влязоха в двореца при цар Езекия и рекоха: Очистихме изцяло Господния дом, олтара за всеизгарянето с всичките му прибори и трапезата за присъствените хлябове с всичките й прибори;
౧౮అప్పుడు వారు రాజ భవనం లోపల ఉన్న రాజైన హిజ్కియా దగ్గరికి పోయి “మేము యెహోవా మందిరమంతా బాగు చేసాం. దహన బలిపీఠాన్ని దాని సామానంతటిని, సన్నిధి రొట్టెలుంచే బల్లనూ బాగు చేసాం.
19 при това, приготвихме и осветихме всичките вещи, които цар Ахаз, в царуването си, оскверни когато отстъпи: и ето ги пред Господния олтар.
౧౯రాజైన ఆహాజు పాలించిన కాలంలో అతడు ద్రోహం చేసి పారవేసిన సామానంతా కూడా మేము సిద్ధం చేసి ప్రతిష్టించాం. అవి యెహోవా బలిపీఠం ఎదుట ఉన్నాయి” అని చెప్పారు.
20 Тогава цар Езекия стана рано, и като събра градските първенци, възлезе в Господния дом.
౨౦అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి, పట్టణపు అధికారులను సమకూర్చి యెహోవా మందిరానికి వెళ్ళాడు.
21 И докараха седем юнеца, седем овена, седем агнета и седем козела в принос за грях за царството, за светилището и за Юда; и той заповяда на свещениците, Аароновите потомци, да ги принесат на Господния олтар.
౨౧వారు రాజ్యం కోసం పరిశుద్ధస్థలం కోసం యూదావారి కోసం పాపపరిహారార్థబలి చేయడానికి ఏడు కోడెలు, ఏడు పొట్టేళ్ళు, ఏడు గొర్రెపిల్లలు, ఏడు మేకపోతులను తెచ్చారు. యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించమని అహరోను వంశం యాజకులకు అతడు ఆజ్ఞాపించాడు.
22 И тъй, те заклаха юнците, и свещениците, като взеха кръвта, попръскаха я по олтара, заклаха и овните и попръскаха кравта им по олтара; тоже и агнетата заклаха и попръскаха кръвта им по олтара.
౨౨అప్పుడు వారు ఎద్దులను వధించారు. యాజకులు వాటి రక్తాన్ని తీసుకు బలిపీఠం మీద చల్లారు. పొట్టేళ్లను వధించి ఆ రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు. గొర్రెపిల్లలను కూడా వధించి ఆ రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు.
23 Сетне преведоха козлите, които бяха в принос за грях, пред царя и събранието; и те положиха ръцете си на тях;
౨౩పాపపరిహారార్థబలి కోసం రాజు ఎదుటకకూ, సమాజం ఎదుటకూ మేకపోతులను తెచ్చారు. వారు తమ చేతులను వాటి మీద ఉంచిన తరువాత యాజకులు వాటిని వధించారు.
24 тогава свещениците ги заклаха и попръскаха кръвта им по олтара в принос за грях, за да направят умилостивение за целия Израил; защото царят заповяда, щото всеизгарянето и приноса за грях да станат за целия Израил.
౨౪ఇశ్రాయేలీయులందరి కోసం దహనబలీ, పాపపరిహారార్థ బలీ అర్పించాలని రాజు ఆజ్ఞాపించాడు. కాబట్టి యాజకులు ఇశ్రాయేలీయులందరి కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి బలిపీఠం మీద వాటి రక్తం ప్రోక్షించి పాపపరిహారార్థబలి అర్పించారు.
25 И той постави левитите в Господния дом с кимвали, с псалтири и с арфи, според заповедта на Давида и на царевия гледач Гад и на пророк Натана; защото заповедта бе от Господа чрез пророците Му.
౨౫మునుపు దావీదూ, రాజుకు దీర్ఘ దర్శి అయిన గాదూ, ప్రవక్త అయిన నాతానుల ఆజ్ఞ ప్రకారం హిజ్కియా యెహోవా మందిరంలో తాళాలనూ తీగె వాయిద్యాలనూ సితారాలనూ వాయించడానికి అతడు లేవీయులను ఏర్పాటు చేశాడు. అలా జరగాలని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉన్నాడు.
26 И левитите стояха с Давидовите музикални инструменти, а свещениците с тръбите.
౨౬దావీదు చేయించిన వాద్యాలను వాయించడానికి లేవీయులను బూరలు ఊదడానికి యాజకులను నియమించారు.
27 Тогава Езекия заповяда да принесат всеизгарянето на олтара. И когато почна всеизгарянето, почна и пеенето Господу с тръбите и с инструментите на Израилевия цар Давида.
౨౭బలిపీఠం మీద దహనబలులను అర్పించమని హిజ్కియా ఆజ్ఞాపించాడు. దహనబలి అర్పణ ఆరంభం కాగానే బూరలతో, ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యాలతో యెహోవాకు స్తుతిగానం ఆరంభమయింది.
28 А цялото събрание се кланяше, и певците пееха, и тръбите свиреха непрекъснато докле се извърши всеизгарянето.
౨౮సమాజమంతా ఆరాధిస్తూ వుంటే గాయకులు పాటలు పాడారు, బూరలూదారు. దహనబలి అర్పణ ముగిసే వరకూ ఇదంతా జరుగుతూ ఉంది.
29 И като свършиха принасянето царят и всички, които присъствуваха с него, коленичиха и се поклониха.
౨౯వారు బలులు అర్పించడం ముగించిన తరువాత రాజు, అతనితో ఉన్న వారంతా తలవంచి ఆరాధించారు.
30 Тогава цар Езекия и първенците заповядаха на левитите да славословят Господа с думите на Давида и на гледача Асаф. И те пееха с веселие; и наведоха се та се поклониха.
౩౦దావీదూ, దీర్ఘ దర్శి ఆసాపూ, రాసిన పాటలు పాడి యెహోవాను స్తుతించమని రాజైన హిజ్కియా, అధికారులూ లేవీయులకు ఆజ్ఞాపిస్తే వారు ఆనందంతో స్తుతి గానం చేసి, తలవంచి ఆరాధించారు.
31 След това, Езекия проговаряйки, каза: Сега, като сте се осветили Господу, пристъпете та принесете жертви и благодарителни приноси в Господния дом. И така, обществото принесе жертви и благодарителни приноси; и всеки, който имаше сърдечно съизволение, принесе и всеизгаряне.
౩౧అప్పుడు హిజ్కియా “మీరిప్పుడు యెహోవాకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకున్నారు. దగ్గరికి రండి. యెహోవా మందిరంలోకి బలులూ కృతజ్ఞతార్పణలనూ తీసుకురండి” అని చెప్పాడు. సమాజపు వారు బలులనూ కృతజ్ఞతార్పణలనూ తీసుకొచ్చారు. దహన బలులను అర్పించడానికి ఎవరికి ఇష్టమయిందో వారు వాటిని తీసుకొచ్చారు.
32 И числото на всеизгарянията, които обществото принесе, възлезе на седемдесет юнеца, сто овена и двеста агнета; всички тия бяха за всеизгаряния Господу;
౩౨సమాజపు వారు తీసుకొచ్చిన దహనబలి పశువులు ఇవి: 70 కోడెలు, 100 పొట్టేళ్లు, 200 గొర్రెపిల్లలు. వీటన్నిటినీ యెహోవాకు దహనబలులుగా తెచ్చారు.
33 а посветените животни бяха шестстотин говеда и три хиляди овце.
౩౩ప్రతిష్టించబడినవి 600 ఎద్దులు, 3,000 గొర్రెలు.
34 Свещениците, обаче, бяха малцина, и не можеха да одерат всичките всеизгаряния; затова, братята им, левитите им, помогнаха докле се свърши работата и докле се осветиха свещениците; защото левитите показаха повече сърдечна правота да се освещават отколкото свещениците.
౩౪యాజకులు కొద్దిమందే ఉన్నారు కాబట్టి వారు ఆ దహనబలి పశువులన్నిటి చర్మాలను ఒలవలేకపోయారు. ఆ పని పూర్తి అయ్యేవరకూ, ఇతర యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనే వరకూ, వారి సోదరులైన లేవీయులు వారికి సహాయం చేశారు. తమను తాము ప్రతిష్ఠించుకోవడంలో యాజకులకంటే లేవీయులు యధార్థ హృదయం గలవారు.
35 А пък всеизгарянията бяха много, заедно с тлъстината на примирителните приноси и с всеизгарянията на всяко всеизгаряне. Така се възстанови службата на Господния дом.
౩౫వీటితోపాటు సమాధాన బలిపశువుల కొవ్వూ దహనబలి పశువులూ దహనబలులకు ఏర్పడిన పానార్పణలూ సమృద్ధిగా ఉన్నాయి. ఈ విధంగా యెహోవా మందిర సేవను మళ్లీ స్థాపించారు.
36 И Езекия и всичките люде се радваха за гдето Бог беше предразположил людете; понеже това нещо стана ненадейно.
౩౬ఈ పని త్వరగానే జరిగింది కాబట్టి దేవుడు ప్రజలకు సిద్ధపరచిన దాన్ని చూసి హిజ్కియా, ప్రజలంతా సంతోషించారు.

< 2 Летописи 29 >