< 2 Летописи 18 >

1 А Иосафат имаше богатство и голяма слава; и направи сватовщина с Ахава.
యెహోషాపాతుకు సంపద, ఘనత, అధికమైన తరవాత అతడు అహాబుతో సంబంధం కలుపుకున్నాడు.
2 И подир няколко години слезе при Ахава в Самария. И Ахав закла много овци и говеда за него и за людете, които бяха с него; още ме положи да отиде с него в Рамот-галаад.
కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత అతడు షోమ్రోనులో ఉండే అహాబు దగ్గరకి వెళ్ళాడు. అహాబు అతని కోసమూ అతని వెంట వచ్చిన మనుషుల కోసమూ అనేకమైన గొర్రెలనూ, పశువులనూ వధించి విందు చేశాడు. తనతో బాటు రామోతు గిలాదు మీదికి వెళ్ళడానికి అతణ్ణి ప్రేరేపించాడు.
3 Защото Израилевият цар Ахав рече на Юдовия цар Иосафата: Дохождаш ли с мене в Рамот-галаад? И той му отговори: Аз съм както си ти, и мойте люде както твоите люде; ще бъдем с тебе във войната.
ఇశ్రాయేలు రాజు అహాబు, యూదా రాజు యెహోషాపాతుతో “నువ్వు నాతో బాటు రామోతు గిలాదుకు వస్తావా” అని అడిగినప్పుడు, యెహోషాపాతు “నేను నీవాణ్ణి, నా ప్రజలు నీ ప్రజలు. మేము నీతోబాటు యుద్ధానికి వస్తాం” అని చెప్పాడు.
4 Иосафат каза още на Израилевия цар: Моля, допитай се сега до Господното слово.
యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో “ముందు యెహోవా దగ్గర సంగతి విచారణ చేద్దాం రండి” అన్నాడు.
5 Тогава Израилевият цар събра пророците си, четиристотин мъже, та им рече: Да идем ли на бой в Рамот-галаад, или да не ида? А те казаха: Иди, и Бог ще го предаде в ръката на царя.
ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి “నేను రామోతు గిలాదు మీదికి యుద్ధానికి వెళ్ళాలా, వద్దా?” అని వారిని అడిగాడు. అందుకు వారు “వెళ్ళు, దేవుడు దాన్ని రాజు చేతికి అప్పగిస్తాడు” అని చెప్పారు.
6 Обаче, Иосафат каза: Няма ли тук, освен тия някой Господен пророк, за да се допитаме чрез него?
అయితే యెహోషాపాతు “వీళ్ళు కాకుండా మనం విచారణ చేయడానికి యెహోవా ప్రవక్తల్లో ఒకడైనా ఇక్కడ లేడా?” అని అడిగాడు.
7 И Израилевият цар рече на Иосафата: Има още един човек, чрез когото можем да се допитаме до Господа; но аз го мразя, защото никога не пророкува добро за мене, но всякога зло; той е Михей, син на Емла. А Иосафат каза: Нека не говори така царят.
అందుకు ఇశ్రాయేలు రాజు “యెహోవా దగ్గర విచారణ చేయడానికి ఇమ్లా కొడుకు మీకాయా అనేవాడు ఇక్కడ ఉన్నాడు. అయితే అతడు నా గురించి మంచి ప్రవచించడు. ఎప్పుడూ కీడునే ప్రవచిస్తున్నాడు కాబట్టి అతడంటే నాకు కోపం” అన్నాడు. యెహోషాపాతు రాజు “రాజైన మీరు అలా అనవద్దు” అన్నాడు.
8 Тогава Израилевият цар повика един скопец и рече: Доведи скоро Михея син на Емла.
అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారంలో ఒకణ్ణి పిలిపించి “ఇమ్లా కొడుకు మీకాయాను త్వరగా రప్పించు” అని ఆజ్ఞ ఇచ్చాడు.
9 А Израилевият цар и Юдовият цар Иосафат седяха, всеки на престола си, облечени в одеждите си; и седяха на открито място при входа на самарийската порта; и всичките пророци пророкуваха пред тях.
ఇశ్రాయేలు రాజు, యూదారాజు యెహోషాపాతు షోమ్రోను ఊరు ద్వారం ముందు ఉన్న స్థలం లో తమ రాజవస్త్రాలు ధరించుకుని సింహాసనాల మీద కూర్చుని ఉండగా ప్రవక్తలంతా వారి ముందు ప్రవచిస్తూ ఉన్నారు.
10 А Седекия, Ханаановият син, си направи железни рогове, и рече: Така казва Господ: С тия ще буташ сирийците догде ги довършиш.
౧౦అప్పుడు కెనన్యా కొడుకు సిద్కియా ఇనప కొమ్ములు చేయించుకుని వచ్చి “సిరియనులు అరామీయులు నాశనమయ్యే వరకూ వీటితో వాళ్ళను నువ్వు పొడుస్తావని యెహోవా సెలవిస్తున్నాడు” అని ప్రకటించాడు.
11 Също и всичките пророци така пророкуваха, казвайки: Иди в Рамат-галаад, и ще имаш добър успех; защото Господ ще го предаде в ръката на царя.
౧౧ప్రవక్తలంతా ఆ విధంగానే ప్రవచిస్తూ “యెహోవా రామోతు గిలాదును రాజు చేతికి అప్పగిస్తాడు, దాని మీదికి వెళ్ళి జయం పొందు” అన్నారు.
12 А пратеникът, който отиде да повика Михея, му говори казвайки: Ето, думите на пророците като из една уста са добри за царя; моля, прочее, и твоята дума да бъде като думата на един от тях, и ти говори доброто.
౧౨మీకాయాని పిలవడానికి పోయిన దూత అతనితో “ప్రవక్తలు రాజు విషయంలో అంతా మేలునే పలుకుతున్నారు. దయచేసి నీ మాటను వారి మాటలతో కలిపి మేలునే ప్రవచించు” అన్నారు.
13 А Михей рече: Заклевам се в живота на Господа, каквото рече Бог мой, това ще говоря.
౧౩మీకాయా “యెహోవా జీవం తోడు, నా దేవుడు దేనిని సెలవిస్తాడో దానినే ప్రవచిస్తాను” అని చెప్పాడు.
14 И той, дойде при царя. И царят му каза: Михее, да идем ли на бой в Рамот-галаад, или да не ида? А той рече: Идете и ще имате успех; защото неприятелите ще бъдат предадени в ръката ви.
౧౪అతడు ఇశ్రాయేలు రాజు దగ్గరకి వచ్చినప్పుడు రాజు అతణ్ణి చూసి “మీకాయా, రామోతు గిలాదు పైకి మేము యుద్ధానికి వెళ్ళవచ్చా, ఆగిపోవాలా?” అని అడగ్గా, అతడు “వెళ్ళి యుద్ధం చేసి జయించండి. వారు మీ చేతికి చిక్కుతారు” అన్నాడు.
15 А царят му каза: Колко пъти ще те заклевам да не ми говориш друго освен истината в Господното име!
౧౫అప్పుడు రాజు “యెహోవా నామంలో అబద్ధం కాక సత్యమే చెప్పమని నేను ఎన్నిసార్లు నీ చేత ఒట్టు పెట్టించుకోవాలి?” అని అతనితో అన్నాడు.
16 А той рече: Видях целият Израил пръснат по планините като овци, които нямат овчар; и Господ рече: Тия нямат господар; нека се върнат всеки у дома си с мир.
౧౬అప్పుడు మీకాయా “కాపరి లేని గొర్రెల్లాగా ఇశ్రాయేలు వారంతా పర్వతాల మీద చెదిరిపోవడం నేను చూశాను. ‘వీరికి యజమాని లేడు. వీరిలో ప్రతివాడూ తన తన ఇంటికి ప్రశాంతంగా తిరిగి వెళ్ళాలి’ అని యెహోవా సెలవిచ్చాడు” అన్నాడు.
17 Тогава Израилевият цар каза на Иосафата: Не рекох ли ти, че не ще прорече добро за мене, но зло?
౧౭అది విని ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో ఇలా అన్నాడు. “ఇతడు నా విషయంలో కీడునే గాని మేలును ప్రవచించడని నేను నీతో చెప్పలేదా?”
18 А Михей рече: Чуйте, прочее, Господното слово. Видях Господа седящ на престола си, и цялото небесно множество стоящо около него отдясно и отляво.
౧౮అప్పుడు మీకాయా ఇలా అన్నాడు. “యెహోవా మాట వినండి. యెహోవా తన సింహాసనం మీద కూర్చుని ఉండడం, పరలోక సైన్యమంతా ఆయన కుడివైపూ ఎడమవైపూ నిలబడి ఉండడం నేను చూశాను.
19 И Господ рече: Кой ще примами Израилевия цар Ахава за да отиде и да падне в Рамот-галаад? И един, проговаряйки, рече едно, а друг рече друго.
౧౯‘ఇశ్రాయేలు రాజు అహాబు రామోతు గిలాదు మీద యుద్ధానికి వెళ్ళి చనిపోయేలా అతణ్ణి ఎవరు ప్రేరేపిస్తారు?’ అని యెహోవా అడిగాడు. అప్పుడు, ఒకడు ఒక రకంగా, ఇంకొకడు మరొక రకంగా జవాబిచ్చారు.
20 Сетне излезе един дух та застана пред Господа и рече: Аз ще го примамя. И Господ му рече: Как?
౨౦అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ముందు నిలబడి, ‘నేను అతణ్ణి ప్రేరేపిస్తాను’ అని చెప్పాడు. యెహోవా, ‘ఏవిధంగా?’ అని అతణ్ణి అడిగాడు.
21 А той каза: Ще изляза и ще бъда лъжлив дух в устата на всичките му пророци. И Господ рече: Примамвай го, още и ще сполучиш; излез, стори така.
౨౧అందుకు ఆ ఆత్మ, ‘నేను వెళ్ళి అతని ప్రవక్తలందరి నోట అబద్ధాలాడే ఆత్మగా ఉంటాను’ అని చెప్పాడు. అందుకు యెహోవా ‘నువ్వు అతణ్ణి ప్రేరేపించి సఫలమౌతావు. వెళ్ళి అలా చెయ్యి’ అని సెలవిచ్చాడు.
22 Сега, прочее, ето, Господ е турил лъжлив дух в устата на тия твои пророци, обаче Господ е говорил зло за тебе.
౨౨నీ ప్రవక్తలైన వీరి నోటిలో యెహోవా అబద్ధాలాడే ఆత్మను ఉంచాడు. యెహోవా నీకు కీడు నిర్ణయించాడు.”
23 Тогава Седекия, Ханаановият син, се приближи та плесна Михея по бузата и каза: През кой път мина Господният Дух от мене за да говори на тебе?
౨౩అప్పుడు కెనన్యా కొడుకు సిద్కియా మీకాయా దగ్గరికి వచ్చి అతణ్ణి చెంప మీద కొట్టి “నీతో మాటలాడటానికి యెహోవా ఆత్మ నా దగ్గర నుండి ఎటు వైపు వెళ్ళాడు?” అన్నాడు.
24 А Михей рече: Ето, ще видиш в оня ден, когато ще отиваш из клет в клет за да се криеш.
౨౪అందుకు మీకాయా “దాక్కోడానికి నువ్వు లోపలి గదిలోకి వెళ్ళే రోజున అది నీకు తెలుస్తుంది” అని చెప్పాడు.
25 Тогава Израилевият цар каза: Хванете Михея та го върнете при градския управител Амон и при царския син Иоас,
౨౫అప్పుడు ఇశ్రాయేలు రాజు “మీరు మీకాయాను పట్టణపు అధికారి ఆమోను దగ్గరికి, రాకుమారుడు యోవాషు దగ్గరికి తీసుకు పోయి వారితో, రాజు మీకిచ్చిన ఆజ్ఞ ఇదే
26 и речете: Така казва царят: Турете тогова в тъмницата, и хранете го със затворническа порция хляб и вода догде се завърне с мир.
౨౬నేను సురక్షితంగా తిరిగి వచ్చే వరకూ ఇతన్ని చెరలో ఉంచి కొద్దిగా ఆహారం, నీరు మాత్రం ఇవ్వండి” అన్నాడు.
27 И рече Михей: Ако някога се върнеш с мир, то Господ не е говорил чрез мене. Рече още: Слушайте вие, всички люде.
౨౭అప్పుడు మీకాయా “నువ్వు సురక్షితంగా తిరిగి వస్తే యెహోవా నా ద్వారా పలకలేదన్న మాటే. ప్రజలంతా ఆలకించండి” అన్నాడు.
28 И така, Израилевият цар и Юдовият цар Иосафат възлязоха в Рамот-галаад.
౨౮అప్పుడు ఇశ్రాయేలు రాజు, యూదా రాజు యెహోషాపాతు, రామోతు గిలాదు మీదికి యుద్ధానికి వెళ్ళారు.
29 И Израилевият цар рече на Иосафата: Аз ще се предреша като вляза в сражението, а ти облечи одеждите си. Прочее, Израилевият цар се предреши, та влязоха в сражението.
౨౯ఇశ్రాయేలు రాజు “నేను మారు వేషం వేసుకుని యుద్ధానికి వెళ్తాను. నువ్వు నీ వస్త్రాలనే ధరించు” అని యెహోషాపాతుతో చెప్పి తాను మారు వేషం వేసుకున్నాడు. తరువాత వారు యుద్ధానికి వెళ్ళారు.
30 А сирийският цар бе заповядал на колесниценачалниците си, казвайки: Не се бийте нито с малък, нито с голям, но само с Израилевия цар.
౩౦సిరియా రాజు “మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధం చేయండి. పెద్దా చిన్న వారితో చేయవద్దు” అని తనతో ఉన్న తన రథాల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు.
31 А колесниценачалниците, като видяха Иосафата, рекоха: Тоя ще е Израилевият цар; и отклониха се за да го ударят. Но Иосафат извика; И Господ му помогна, защото Бог ги повлия да се отвърнат от него.
౩౧కాగా యెహోషాపాతు కనబడగానే రథాధిపతులు “అడుగో ఇశ్రాయేలు రాజు” అంటూ అతడిపై దాడి చెయ్యడానికి అతణ్ణి చుట్టుముట్టారు. అయితే యెహోషాపాతు యెహోవాకు మొర్రపెట్టడం వలన ఆయన అతనికి సహాయం చేశాడు. దేవుడు అతని దగ్గర నుండి వారు తొలగిపోయేలా చేశాడు.
32 Понеже колесниценачалниците, като видяха, че не беше Израилевият цар, престанаха да го преследват и се върнаха.
౩౨ఎలాగంటే, రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకుని అతణ్ణి తరమడం మాని తిరిగి వెళ్ళారు.
33 А един човек устрели без да мери, и удари Израилевия цар между ставите на бронята му; затова той рече на колесничаря: Обърни юздата та ме извади из войската, защото съм тежко ранен.
౩౩అప్పుడు ఎవడో గురి చూడకుండానే విల్లు ఎక్కుబెట్టి బాణం వేయగా అది ఇశ్రాయేలు రాజు కవచపు సందుల్లో గుచ్చుకుంది. రాజు తన సారధితో “నాకు గాయమైంది. వెనక్కి తిప్పి యుద్ధంలో నుండి నన్ను బయటికి తీసుకు వెళ్ళు” అన్నాడు.
34 И в оня ден сражението се усили; но Израилевият цар се удържа в колесницата си срещу сирийците до вечерта, и около захождането на слънцето умря.
౩౪ఆ రోజున యుద్ధం తీవ్రంగా జరిగింది. అయినా ఇశ్రాయేలు రాజు సూర్యాస్తమయం వరకూ సిరియా సైన్యానికి ఎదురుగా తన రథంలో ఆనుకుని నిలబడ్డాడు. పొద్దుగుంకే వేళకి అతడు చనిపోయాడు.

< 2 Летописи 18 >