< 3 Царе 21 >

1 След тия събития, понеже езраелецът Навутей имаше лозе в Езраил, близо до палата на самарийския цар Ахаава,
యెజ్రెయేలులో సమరయ రాజు అహాబు భవనాన్ని ఆనుకుని యెజ్రెయేలు వాడు నాబోతుకు ఒక ద్రాక్షతోట ఉంది.
2 Ахаав говори на Навутея казвайки: Дай ми лозето си да го имам за бостан, понеже е близо до къщата ми; и вместо него ще ти дам лозе по-добро от него, или, ако ти се види добре, ще ти дам стойността му в пари.
అహాబు నాబోతును పిలిపించి “నీ ద్రాక్షతోట నా భవనాన్ని ఆనుకుని ఉంది. కాబట్టి అది నాకివ్వు. దానిలో కూరగాయలు పండించుకుంటాను. దానికి బదులు దాని కంటే మంచి ద్రాక్షతోట నీకిస్తాను. లేకపోతే దాని ఖరీదైనా ఇస్తాను” అన్నాడు.
3 А Навутей рече на Ахаава: Да ми не даде Господ да ти дам бащиното си наследство.
అందుకు నాబోతు “నా పిత్రార్జితాన్ని నీకివ్వడానికి నాకెంత మాత్రం కుదరదు” అన్నాడు.
4 И Ахаав дойде у дома си тъжен и огорчен поради думата, която езраелецът Навутей му каза, като рече: Не ща да ти дам бащиното си наследство. И като легна на леглото си, отвърна лицето си и не яде хляб.
నా పిత్రార్జితాన్ని నీకివ్వనని యెజ్రెయేలు వాడైన నాబోతు తనతో చెప్పినందువల్ల అహాబు విచారంగా కోపంతో తన భవనానికి వెళ్లిపోయాడు. మంచం మీద పడుకుని ఎవరితో మాట్లాడకుండా భోజనం చేయకుండా ఉన్నాడు.
5 Тогава жена му Езавел дойде при него та му рече: Защо е духът ти тъжен, та не ядеш хляб?
అప్పుడు అతని భార్య యెజెబెలు వచ్చి “నీవు విచారంగా భోజనం చేయకుండా ఉన్నావేంటి?” అని అడిగింది.
6 А той каза: Понеже говорейки на езраелеца Навутей рекох му: Дай ми лозето си с пари, или, ако обичаш, ще ти дам друго лозе вместо него; а той отговори: Не ща да ти дам лозето си.
అతడు ఆమెతో ఇలా అన్నాడు. “నీ ద్రాక్షతోటను నాకు అమ్ము. లేకపోతే దానికి బదులు మరొక ద్రాక్షతోట నీకిస్తానని యెజ్రెయేలు వాడైన నాబోతును అడిగాను. అతడు నా ద్రాక్షతోట నీకివ్వను అన్నాడు.”
7 А жена му Езавел му рече: Царуваш ли ти наистина над Израиля? Стани, яж хляб, и нека е весело на сърцето ти; аз ще ти дам лозето на езраелеца Навутей.
అందుకు యెజెబెలు “నీవు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేయడం లేదా? లేచి భోజనం చెయ్యి. మనస్సులో సంతోషంగా ఉండు. నేనే యెజ్రెయేలు వాడైన నాబోతు ద్రాక్షతోట నీకిప్పిస్తాను” అంది.
8 И така, тя писа писма от Ахаавово име, и като ги запечата с печата му, прати писмата до старейшините и благородните, които бяха в града му, живеещи с Навутея.
ఆమె అహాబు పేర ఉత్తరాలు రాయించి అతని ముద్రతో ముద్రించి, ఆ ఉత్తరాలను నాబోతు నివసిస్తున్న పట్టణ పెద్దలకూ ఇంకా ముఖ్యమైన వారికీ పంపింది.
9 В писмата писа, казвайки: Прогласете пост, и поставете Навутея на видно място пред людете;
ఆ ఉత్తరాల్లో ఇలా రాయించింది. “ఉపవాస దినం జరగాలని మీరు చాటింపు వేయించి నాబోతును ప్రజల ఎదుట నిలబెట్టండి.
10 и срещу него поставете двама лоши човеци да засвидетелствуват против него казвайки: Ти похули Бога и царя. Тогава го изведете вън и убийте го с камъни, и нека умре.
౧౦నీవు దేవుణ్ణి, రాజునూ దూషించావు, అని అతని మీద సాక్ష్యం చెప్పడానికి ఇద్దరు నిజాయితీ లేని మనుషులను ఏర్పాటు చేయండి. తీర్పు అయిన తరువాత అతన్ని బయటికి తీసికెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయండి.”
11 И мъжете от града му, старейшините и благородниците, които живееха в града му, сториха според заповедта, която Езавел им бе пратила, според написаното в писмата, които им бе пратила;
౧౧అతని నగర పెద్దలూ పట్టణంలో నివసించే ముఖ్యమైన వారూ యెజెబెలు తమకు పంపిన ఉత్తరాల్లో ఉన్నట్టుగా జరిగించారు.
12 прогласиха пост, и поставиха Навутея на видно място пред людете.
౧౨ఉపవాస దినం చాటించి నాబోతును ప్రజల ఎదుట నిలబెట్టారు.
13 И двамата лоши човеци влязоха и седнаха пред него; и лошите човеци свидетелствуваха против него, против Навутея, пред людете, казвайки: Навутей похули Бога и царя. Тогава го изведоха вън от града, та го убиха с камъни; и умря.
౧౩అప్పుడు ఇద్దరు నిజాయితీ లేని మనుషులు వచ్చి అతని ఎదుట కూర్చుని “నాబోతు దేవుణ్ణీ రాజునూ దూషించాడు” అని ప్రజల ఎదుట నాబోతు మీద సాక్ష్యం చెప్పారు. వాళ్ళు పట్టణం బయటికి అతన్ని తీసికెళ్లి రాళ్లతో కొట్టి చంపేశారు.
14 После пратиха да Езавел да кажат: Навутей е убит с камъни и умря.
౧౪నాబోతు రాతి దెబ్బలతో చచ్చిపోయాడని వాళ్ళు యెజెబెలుకు కబురు పంపారు.
15 И като чу Езавел, че Навутей бил убит с камъни и умрял, Езавел рече на Ахаава: Стани, присвои си лозето, което езраелецът Навутей отказа да ти даде с пари; защото Навутей не е жив, но е умрял.
౧౫అది విని యెజెబెలు “నాబోతు బతికి లేడు, చచ్చిపోయాడు. కాబట్టి నీవు లేచి యెజ్రెయేలు వాడైన నాబోతు ఖరీదుకు నీకివ్వనన్న అతని ద్రాక్షతోటను స్వాధీనం చేసుకో” అని అహాబుతో చెప్పింది.
16 И като чу Ахаав, че Навутей е умрял, Ахаав стана та слезе в лозето на езраелеца Навутей за да го присвои.
౧౬నాబోతు చనిపోయాడని అహాబు విని లేచి యెజ్రెయేలు వాడైన నాబోతు ద్రాక్షతోటను స్వాధీన పరచుకోడానికి వెళ్ళాడు.
17 Но Господното слово дойде към тесвиеца Илия и рече:
౧౭అప్పుడు యెహోవా తిష్బీయుడైన ఏలీయాతో ఇలా చెప్పాడు,
18 Стани, слез да посрещнеш Израилевия цар Ахаава, който живее в Самария; ето, той е в Навутеевото лозе, гдето слезе да го присвои.
౧౮“నీవు లేచి సమరయలో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబును కలుసుకోడానికి బయలు దేరు. అతడు నాబోతు ద్రాక్షతోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనం చేసుకోడానికి వెళ్ళాడు.
19 И да му говориш казвайки: Така казва Господ: Уби ли ти, а още присвои ли ти? Да му говориш още казвайки: Така казва Господ: На мястото, гдето кучетата лизаха Навутеевата кръв, кучетата ще лижат твоята кръв, да! твоята.
౧౯నీవు అతనితో ఇలా చెప్పు, యెహోవా చెప్పేదేమిటంటే దీన్ని స్వాధీనం చేసుకోవాలని నీవు నాబోతును చంపించావు గదా! యెహోవా చెప్పేదేమిటంటే ఏ స్థలం లో కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయో ఆ స్థలం లోనే కుక్కలు నీ రక్తాన్ని కూడా నాకుతాయి.”
20 А Ахаава каза на Илия: Намери ли ме, враже мой? А той отговори: Намерих те, защото ти си продал себе си да вършиш зло пред Господа.
౨౦అది విని అహాబు ఏలీయాతో “నా పగవాడా, నేను నీకు దొరికానా?” అన్నాడు. అందుకు ఏలీయా ఇలా అన్నాడు. “యెహోవా దృష్టికి కీడు చేయడానికి నిన్ను నువ్వే అమ్ముకున్నావు. కాబట్టి నీవు నాకు దొరికావు.
21 Ето казва Господ: Аз ще докарам зло върху тебе, ще те измета, и ще изтребя от Ахаава всеки от мъжки пол, както малолетния, така и пълнолетния в Израиля;
౨౧యెహోవా నీతో ఇలా చెబుతున్నాడు, నేను నీ మీదికి కీడు రప్పిస్తాను. నీ వంశం వారిని నాశనం చేస్తాను. ఇశ్రాయేలు వారిలో బానిస గానీ స్వతంత్రుడు గానీ అహాబు వైపు ఎవరూ లేకుండా పురుషులందరినీ నిర్మూలం చేస్తాను.
22 и ще направя дома ти като дома на Еровоама Наватовия син, и като дома на Вааса Ахиевия син, поради раздразнението, с което Ме ти разгневи, като направи Израиля да съгреши.
౨౨ఇశ్రాయేలువారు పాపం చేయడానికి నీవు కారకుడివై నాకు కోపం పుట్టించావు. కాబట్టి నెబాతు కొడుకు యరొబాము కుటుంబానికీ అహీయా కొడుకు బయెషా కుటుంబానికీ నేను చేసినట్లు నీ కుటుంబానికీ చేస్తాను.
23 Също и на Езавел говори Господ, казвайки: Кучетата ще изядат Езавел при рова на Езраел.
౨౩యెజెబెలు గురించి యెహోవా చెప్పేదేమిటంటే యెజ్రెయేలు ప్రాకారం దగ్గర కుక్కలు యెజెబెలును పీక్కుతింటాయి.
24 Който от Ахаавовия род умре в града, него кучетата ще изядат; а който умре в полето, него въздушните птици ще изядат.
౨౪పట్టణంలో చనిపోయే అహాబు సంబంధులను కుక్కలు తింటాయి. పొలంలో చనిపోయేవారిని రాబందులు తింటాయి” అన్నాడు.
25 (Никой, наистина, не биде подобен на Ахаава, който продаде себе си да върши зло пред Господа, като го подбуждаше жена му Езавел,
౨౫తన భార్య యెజెబెలు ప్రేరేపణతో యెహోవా దృష్టిలో కీడు చేయడానికి తన్ను తాను అమ్ముకున్న అహాబులాంటి వాడు ఎవ్వడూ లేడు.
26 и който извърши много мерзости, като следваше идолите, съвсем, както вършеха аморейците, които Господ бе изгонил пред израилтяните).
౨౬ఇశ్రాయేలీయుల దగ్గరనుంచి యెహోవా వెళ్లగొట్టిన అమోరీయులు చేసినట్టు, అతడు విగ్రహాలను పెట్టుకుని చాలా నీచంగా ప్రవర్తించాడు.
27 А Ахаав, като чу тия думи, раздра дрехите си, тури вретище на снагата си, пости и лежеше обвит във вретище, и ходеше внимателно.
౨౭అహాబు ఆ మాటలు విని తన బట్టలు చించుకుని గోనెపట్ట కట్టుకుని ఉపవాసముండి, గోనెపట్ట మీద పడుకుని చాలా విచారించాడు.
28 Тогава Господното слово дойде към тесвиеца Илия и рече:
౨౮యెహోవా తిష్బీ వాడైన ఏలీయాతో ఇలా చెప్పాడు.
29 Видя ли как се смири Ахаав пред Мене? Понеже той се смири пред Мене, няма да докарам злото в неговите дни; в дните на сина му ще докарам злото върху дома му.
౨౯“అహాబు నా ఎదుట తనను తాను ఎంత తగ్గించుకుంటున్నాడో చూశావా? తనను నా ఎదుట తగ్గించుకుంటున్నాడు కాబట్టి, రాబోయే ఆ కీడును అతని కాలంలో పంపించను. నేనతని కొడుకు రోజుల్లో అతని వంశం మీదికి కీడు రానిస్తాను.”

< 3 Царе 21 >